Setti Jagadesh, News18, Visakapatnam
మాడుగుల హల్వా ఇదొక సంప్రదాయ వంటకం. దీనికి 150 ఏళ్ల చరిత్ర ఉంది.ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో మాడుగుల అనే గ్రామంలోఈ మాడుగుల హల్వా ప్రసిద్ధి.మంగరాజు అనే యువకుడుగత 20 ఏళ్ళు గా ఈ వ్యాపారం చేస్తున్నాడు. మాడుగుల హల్వాని గత 150 ఏళ్లుగా పంచదారతోనే తయారు చేసేవారు కానీ ఈ మంగరాజు , పంచదార తో , బెల్లం తో, తేనె తో, షుగర్ ఫ్రీ తో, చాకలెట్తో మాడుగుల హల్వాని 5 రకాలలో తయారు చేస్తున్నారు.
మాడుగుల హల్వా రుచులతో రారాజు గోధుమ పాలు ఆవునెయ్యి, బెల్లం, జీడిపప్పు, బాదం, పిస్తాల మిశ్రమలతో తయారు చేస్తారు. స్థానికంగా దీనికి ఓ ఆచారం కూడా ఉంది. మొదటి రాత్రికి ఈ హల్వా పెట్టడం జరుగుతుంది. ఈ హల్వా ఆరోగ్యంతో పాటు బలాన్ని కూడా ఇస్తుందంటున్నారు నిర్వాహకులు. ఈ హల్వా నాలుగు రకాలుగా అందుబాటులో ఉంటుంది.
1. మాడుగుల డ్రైఫ్రూట్ హల్వా1 కేజీ రూ. 800, 500 గ్రాములు రూ.400 250 గ్రాములు రూ. 200/-గోధుమ పాలు,ఆవునెయ్యి, పంచదార,జీడిపప్పు,బాదం, పిస్తాలతో తయారు అవుతుంది.
2. మాడుగుల బెల్లం హల్వా1 కేజీ 800500 గ్రాములు400250 గ్రాములు 200 గోధుమ పాలు ,ఆవునెయ్యి ,బెల్లం, జీడిపప్పు,బాదం,పిస్తాలతో తయారు అవుతుంది.
3.మాడుగుల తేనె డ్రైఫ్రూట్ హల్వా1 కేజీ రూ800, 500 గ్రాములు రూ.400, 250 గ్రాములు రూ.200/- గోధుమ పాలు ,ఆవునెయ్యి ,పంచదార, అడవితేనే,జీడిపప్పు,బాదం, పిస్తాలతో తయారు అవుతుంది.
4. మాడుగుల షుగర్ ఫ్రీ హల్వా1 కేజీ 999, 500 గ్రాములు రూ.499, 250 గ్రాములు రూ.249 గోధుమ పాలు,ఆవు నెయ్యి,షుగర్ ఫ్రీ, జీడిపప్పు,బాదం,పిస్తాలతో తయారు అవుతుంది.
మాడుగుల హల్వా తిన్నారంటే మైమరిచిపోతారు. పాడేరు ఘాట్ రోడ్డు దిగిన నుండి దుకాణం వద్దకు అధిక సంఖ్యలో పర్యాటకులు స్థానికులు వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు. హల్వా తిన్న ప్రతి ఒక్కరూ మధురంగా ఉందంటూ చెబుతున్నారు.
మాడుగుల హల్వా కావలసినవారు.. మంగరాజు.. 9948481874 ,9966161537
అడ్రస్..
అనకాపల్లి జిల్లా,మాడుగుల నియోజకవర్గం,కోడూరు గ్రామం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam