హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: దోశ ప్రియులకు అదిరిపోయే న్యూస్‌..! అక్కడ దొరికే వెరైటీ దోశలు చూస్తే మతిపోవాల్సిందే..!

Vizag: దోశ ప్రియులకు అదిరిపోయే న్యూస్‌..! అక్కడ దొరికే వెరైటీ దోశలు చూస్తే మతిపోవాల్సిందే..!

X
వైజాగ్‌లో

వైజాగ్‌లో ఆకట్టుకుంటున్న దోశ ఫ్యాక్టరీ

మీకు దోశలంటే ఇష్టమా..? రోజూ ఒకే రకమైన దోశ (Dosa) తిని బోరు కొట్టిందా అయితే విశాఖపట్నం (Visakhapatnam) ఓల్డ్ జైల్ రోడ్డులో ఉన్న నైట్ ఫుడ్స్ కోర్టుకి ఒకసారి వెళ్లాల్సిందే.. అందరూ దోశను మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం టిఫిన్‌గా ఇష్టంగా తీసుకుంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhaptnam

మీకు దోశలంటే ఇష్టమా..? రోజూ ఒకే రకమైన దోశ (Dosa) తిని బోరు కొట్టిందా అయితే విశాఖపట్నం (Visakhapatnam) ఓల్డ్ జైల్ రోడ్డులో ఉన్న నైట్ ఫుడ్స్ కోర్టుకి ఒకసారి వెళ్లాల్సిందే.. అందరూ దోశను మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం టిఫిన్‌గా ఇష్టంగా తీసుకుంటారు. అయితే సమయంతో సంబంధం లేకుండా మీరు గానీ దోశ ప్రియులైతే.. ఈ వెరైటీ దోశకు సంబంధించిన ఆఫర్ మీరు తెలుసుకోవాల్సిందే. విశాఖ మహానగరంలోని ఓల్డ్ జైల్ రోడ్డు ఫుడ్‌కు చాలా ఫేమస్. ఇక్కడ దేశంలోని అన్నీ రాష్ట్రాల వారు నివసిస్తుండటంతో ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. అందుకే ఫుడ్ లవర్స్ విశాఖను అమితంగా ఇష్టపడతారు. వైజాగ్ అంటే సముద్రపు వంటలే కాదు ఇక్కడ టిఫిన్స్ కూడా మస్త్ ఫేమస్ అవుతున్నాయి.

ఎనీ టైం మీరు 121కి పైగా కొత్త రకం దోశలు ఒకే చోట తినాలనుకుంటే మాత్రం విశాఖ ఓల్డ్ జైల్ రోడ్డుకి వెళ్తే టేస్ట్ చేయవచ్చు. మసాల దోశ, ఆనియన్‌ దోశ, ప్లెయిన్‌ దోశల రుచులు ప్రతినిత్యం చూస్తుంటారు... దోశల్లో వెరైటీలను తినాలనుకుంటున్నారా..? ఒకేచోట 121 రకాల దోశలు ఆహారప్రియుల మది దోచుకుంటున్నాయి. సెంటర్ పార్క్ వెనుక, ఓల్డ్ జైల్ రోడ్డులో ఉన్న విశాఖ దోశ ఫ్యాక్టరీ వద్ద ఈ వెరైటీ దోశలు లభిస్తున్నాయి.

ఇది చదవండి: వరదలొస్తే వాళ్లకు పండగే..! ఎర్రనీళ్లలో ఎన్నో రకాల చేపలు..! తింటే ఎన్నో లాభాలు..!

తీన్మార్‌ దోశ, పావు బజ్జీ దోశ , పిజ్జాదోశ, కాజుదోశ, దిల్‌కుష్‌దోశ, పావ్‌బాజీ దోశ, ప్రకృతి దోçశ, కేరళ ఓపెన్, మైసూర్ దోశలో 6 రకాలు ,అమెరికన్‌ చొప్సే దోశలున్నాయి. ఇక్కడకు వచ్చేవారు ఎక్కువగా పన్నీర్‌దోశ, మష్రూమ్‌దోశ, స్వీట్‌కార్న్‌ దోశ, బేబీకార్న్, మైసూర్‌ మసాల దోశ ఇష్టపడుతుంటారని నిర్వాహకులు చెబుతుననారు. ఇంకా ప్లెయిన్‌ దోశలోనే ఎనిమిది రకాలు, మసాల దోశలో 15 రకాలు, పెసరదోశలో17, రాగిదోశలో 18 రకాలు, చెజ్వీన్‌ 21 రకాలు లభిస్తాయి.

ఇది చదవండి: అక్కడ పండే మొక్కజొన్న టేస్ట్ మరెక్కడా రాదు.. అంత ఫేమస్ ఎందుకంటే..!

ఇక్కడ చీజ్‌, ఉతప్పం, చైనీస్‌, మైసూర్‌, చిల్లీస్‌, స్ర్పింగ్‌రోల్‌, పావ్‌ బాజీ , ఫ్యాన్సీ, ట్రెడిషినల్‌.., ఇలా సెక్షన్‌లుగా రకరకాల వెరైటీ దోశలు అందుబాటులో ఉంటాయి. దోశల ధరలు కూడా అందుబాటు ధరల్లోనే ఉండటంతో విశాఖ నుంచే కాదు ఇతరప్రాంతాల వారు కూడా ఈ దోశ ఫ్యాక్టరీకి వచ్చి తమకు నచ్చిన ఫ్లేవర్‌ దోశ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ ఫుడ్ కోర్టును స్టార్‌ చేసింది కూడా గ్రాడ్యుయేట్సే. ఎనిమిది మంది గ్రాడ్యుయేట్స్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌ చదివిన యువతి, యువకులు ఈ దోశ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసి విఫలమైన వాళ్లు నిరాశ చెందకుండా ఏదైనా బిజినెస్‌ చేయాలనుకున్నారు.

ఇది చదవండి: ఈ చిన్నారి మల్టి టాలెంట్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కాకినాడ నుంచి అంతర్జాతీయ స్థాయికి..!

ఉన్నత చదువులు చదివిన ఈ విద్యార్థులు సంవత్సర కాలం పాటు ఎలాంటి బిజినెస్ పెట్టాలని తర్జనభర్జన పడ్డారు. అంతరం ఫుడ్ బిజినెస్ పై దృష్టి పెట్టారు. టాటా మ్యాజిక్‌ బండిని టిఫిన్‌ సెంటర్‌గా తయారు చేసుకున్నారు. ఈ ఫుడ్ కోర్ట్‌ను ఏర్పాటు చేసి జీవితంలో సక్సెస్‌ అయ్యారు. మరెందరికో ఆదర్శంగా నిలిచారు. మీరు ఓ సారి ఈ దోశ ఫ్యాక్టరీని విజిట్‌ చేస్తే మళ్లీ మళ్లీ వెళ్తారు.

అడ్రస్..: ఓల్డ్ జైలు రోడ్‌, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్‌- 530020

ఫోన్‌ నెంబర్‌: 9848105575

Vizag Dosa Factory Map

ఎలా వెళ్లాలి: విశాఖపట్నం కాంప్లెక్స్ కి అతి సమీపంలోనే ఓల్డ్ జైల్ రోడ్డు ఉంటుంది. 100 మీటర్లు దూరంలో నడిచి వెళ్ళే అంత దూరంలో ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Dosa, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు