Setti Jagadesh, News18, Visakapatnam
ఉత్తరాంధ్రలో రొమ్ము కేన్సర్ చాపకింద నీరులా విజృంభిస్తుంది. మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పదేళ్ల ముందు పోలిస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో స్త్రీలు దీని బారిన పడుతున్న వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోందని వైద్యులు డాక్టర్ ఏవై రావు రేడియో థెరపీ విభాగాధిపతి, కేజీహెచ్ చెబుతున్నారు. ఇది అంతా సాధారణంగా మహిళల్లో ఎక్కువగా గర్భాశయ ముఖద్వార కేన్సర్ కనిపిస్తుంది.
స్త్రీలలో దీని తరువాత స్థానానికి రొమ్ము కేన్సర్ లు చేరాయంటున్నారు వైద్యులు. ప్రస్తుతం దీని బారిన పడిన ప్రతి వంద మంది కేన్సర్ బాధిత మహిళల్లో 25 మంది వరకు రొమ్ము కేన్సర్ తో బాధపడుతున్నారని అంటున్నారు.
ప్రతి ఒక్క స్త్రీలలో ప్రస్తుతం సరైన వారికి సరైన అవగాహన , ముందస్తు జాగ్రత్తలతో ఈ రొమ్ము కేన్సర్ కు చెక్ చెప్పువచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు.మహిళలలో ఇక్కడ మరో విషయం ఏమిటి అంతే.. ప్రస్తుతం చాలా మంది మహిళలకు వారు బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు కూడా వారికి తెలియదు. దీని కారణంగా మహిళలు వ్యాధి ముదిరేవరకూ అలానే ఉంటున్నారు. చివరికీ పాపం మహిళలు ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.
ఎలా వస్తుంది.. లక్షణాలతోనే వీటిని గుర్తించొచ్చు.
మహిళలు ఛాతిపై ఉన్న చర్మం కొంచెం లోపలికి వెళ్లి… చర్మం సొట్టలు పడ్డట్లు ఉండడం. మహిళలకి వక్షోజాలపై ఉండే చర్మ కణాల్లో చిన్న పాటి మార్పులు వస్తాయి గమనించుకోవాలి. ఈ కారణంగా వేస్తే ఛాతిలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది చూసుకోవాలి.మహిళలకి ఈ లక్షణాలు గనుక కనిపిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉన్నట్లు గుర్తించాలి. మహిళలు ఈ లక్షణాలు కనుక వుంటే బ్రెస్ట్ నిపుల్స్ వున్న చుట్టూ ఉండే చర్మం అంతా పొలుసులుగా మారి రాలిపోతుండడం జరుగుతుంది.
ఎక్కువగా మహిళకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వారి ఛాతిపై ఉన్న చర్మ రంగు అంతా మారుతుంది. మహిళలు శరీరంలోని ఇతర భాగాలపై ఉండే చర్మ రంగు కన్నా భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మహిళలు ఇది గమనిస్తూ ఉండాలి.
స్తీ యొక్క నిపుల్స్‌ని కొంచ్ నొక్కితే అవి సరిగా లోపలికి వెళ్లకపోయినా, రెండు కూడా డిఫరెంట్ సైజ్‌లలో ఉన్నా కూడా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించాల్సి వస్తుంది. ఎప్పుడైనా నిపుల్స్ నుంచి తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో వారికి ద్రవం బయటకు వస్తుంటే ఈ కాన్సర్ వచ్చే అవకాశం వుంది.
మహిళలు యొక్క చంకల్లో ఉండే లింఫ్ గ్రాంథుల్లో కూడా వాపు అనేది ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తిస్తారు. కొంత మందికి రొమ్ములు, చంకల్లో కూడా గడ్డలు ఉన్నట్లుగా అనిపించిన అనుమానించాలంటున్నరు. మహిళలు యొక్క రొమ్ములపై చర్మం ముడతపడడం వంటివి, కొంచెం గట్టిగా మారడం , రొమ్ములపై గుంటలు లాగా వుండటం, నారింజ పండు రంగు మాదిరిగా మారితే కఖ్చితంగా అనుమానించాల్సిందే అంటున్నారు డాక్టర్లు.
పైన తెలిపిన విధంగా గా మహిళలకి లక్షణాలు ఉన్నాయో లేదో వారే చేసుకోవాలి. ప్రతీ మహిళ కూడా ఎవరికీ వారే చెక్ చేసుకోవచ్చు అంటున్నారు. మహిళలు ముందుగానే రొమ్ము క్యాన్సర్ లక్షణాలను గుర్తించి, చికిత్స తీసుకోవడం వల్ల సమస్య నుంచి త్వరగా బయటపడతారు.ప్రభుత్వం మహిళలకు మరింత అవగాహన కల్పించే విధంగా చేస్తే బాగుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam