హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: మీరు ఫాస్ట్ ఫుడ్ ప్రియులా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Vizag: మీరు ఫాస్ట్ ఫుడ్ ప్రియులా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

X
ఫాస్ట్

ఫాస్ట్ ఫుడ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్

Vizag: టేస్ట్ గా ఉంటుందని ఫాస్ట్ ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నారా..? ఎక్కువగా పాస్ట్ ఫుడ్ తినడం అంటే మీకు ఇష్టమా..? అయితే ఈ విషయాలు ముందు తప్పక తెలుసుకోవాలి అంటున్నారు వైద్యులు.. ఏంటి అవి..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhaptnam

ఫుడ్ లవర్స్ (Food Lovers) రోజు రోజుకూ పెరుగుతున్నారు. అందులోనూ ఫాస్ట్ ఫుడ్ (Fast Food ) అంటే పడి చచ్చేవాళ్లు చాలామంది ఉంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. ఆహారం అనేది ఔషధం లాంటిందే.. కానీ సరైన ఆహారం అలవాట్లు లేకపోతే అనారోగ్య సమస్యలను (Health Problems) కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.  ముఖ్యంగా విశాఖట్నం (Visakhapatnam) లో  ఈ విషయం గురించి ప్రస్తుతం యువతి యువకులు కానీ.. పెద్దవాళ్లు కాని పెద్దగా శ్రద్ధ తీసుకోవడం లేదంటున్నారు వైద్యులు.. కాసుల వేటలో పడి కనీస ఆరోగ్యం కూడా పట్టుంచు కోవడం ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడడం ప్రమాదకరం అంటున్నారు.

ప్రస్తుతం మంది నగరవాసులు ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడ్డారు. ఆఫీస్ పనులు, లేట్ నైట్ వరకూ వర్క్ చేసి వంట చేయడానికి తీరిక లేక, ఒత్తిడి కారణంగా ఓపిక ఉండదు. దీంతో ఇంట్లో చేసుకోలేక బయట తినడం, ఒక వేళ ఓపిక సమయం ఉన్నా త్వరగా అయిపోయే పనులను వెతుక్కుంటున్నారు. దీంతో సరైన ఆహారం తీసుకోకుండా అనేక మంది ప్రజలు ఆరోగ్య సమస్యల్ని కోరి తెచ్చుకుంటున్నారని డాక్టర్‌ జహీర్ అహ్మద్‌ తెలిపారు.

ముఖ్యంగా బయట ఫాస్ట్ ఫుడ్ ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని సార్లు అది కలుషిత ఆహారమై అనారోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. బయట ఫుడ్ ఎలా చేస్తారో మనకి తెలియదు… నూనె ఎన్ని సార్లు మరిగించి వాడుతారో తెలియదు. పిండి, ఆహార పదార్థాలు ఎన్ని రోజుల ముందు వండారో.. ఏ నీటితో వండారో మనం ఊహించలేం. పౌష్ఠికాహార లోపం తలెత్తడమే కాకుండా, అనారోగ్య సమస్యలు, జీర్ణకోశ సమస్యలు , ఊబకాయం వంటివి పెరిగిపోతున్నాయని జహీర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: పది, ఇంటర్ పాసైన విద్యార్థలకు గుడ్‌న్యూస్‌..! దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఏయూ

వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది బయట తినడానికే ప్రాధాన్యం చూపుతున్నారు. బీచ్ రోడ్డులో జంక్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నామంటూ తెగ సంబర పడిపోతున్నారు. కానీ, వీటి వల్ల పిల్లల, పెద్దల వరకూ అధిక బరువు పెరుగుతున్నారని ఆలోచించడం లేదంటున్నారు డాక్టర్లు. వీటితోపాటు జీర్ణాశయం కూడా బాగా దెబ్బతింటుంది అని డాక్టర్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి : ఆ గార్డెన్స్ లో దొరకని మొబైల్ ఉండదు.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే?

తినడానికి చాలా రుచిగా ఉన్నా కూడా వీటిని ఎక్కువగా తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి తెలిసిన అవే తింటున్నారు. ఇటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరా సరిగా జరగదు. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి : బీచ్‌రోడ్‌కు వెళ్తున్నారా.. ఈ స్నాక్‌ ఐటమ్‌

విశాఖపట్నం బీచ్ రోడ్డు, జైల్ రోడ్డు లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఎంత మేర నిబంధనలు పాటిస్తున్నాయి?, ఫుడ్ సేఫ్టీ (Food Safety)అధికారులు ఎంతవరకు తనిఖీలు (Checking's) చేస్తున్నారు? అనే విషయాలు ఎవరికి అంతుబట్టడం లేదు. ఎవరి ఇష్టం వారిదే ఎవరి బిజినెస్స్ వారిదే అయిపోయింది. మరి ప్రజల ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకునేది?. నిబంధనలకు అతిక్రమించి వెలుస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఫుడ్ తింటే ఒంటికి మంచిదేనా అంటే…! అంత మంచిది కాదని వైద్యులు జహీర్‌ అహ్మద్‌ చెబుతున్నారు.

ఇదీ చదవండి : జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. అక్రమ సంబంధం వెనుక అసలు కథ.. తెలిస్తే షాక్

విదేశీ వంటకాలు ఇక్కడి ప్రజలను ఊరిస్తుండగా, శుభ్రత, నాణ్యత విషయాల్లో అక్కడ పాటిస్తున్న కఠిన నిబంధనలు మాత్రం ఇక్కడ పాటించరు. ఈనేపథ్యంలో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఏదేమైనా ప్రజా ఆరోగ్యం పై పట్టింపు లేకుండా ఇష్టానుసారంగా నాణ్యత పాటించకుండా ఫుడ్ కోర్టులు నడిపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Best health benefits, Local News, Vizag

ఉత్తమ కథలు