Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM DISTRICT NEWS ETIKOPPAKA LACQUER COLOR AND ARE TRADITIONALLY TOYS FAMILIES FACING PROBLEMS NGS VSP

Etikoppaka: లక్క బొమ్మల గురించి మరిచిపోవాల్సిందేనా..? సమస్య ఏంటో తెలుసా..?

లక్కబొమ్మలు ఇక మరిచిపోవాల్సిందేనా..?

లక్కబొమ్మలు ఇక మరిచిపోవాల్సిందేనా..?

Etikoppaka toys: ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత గుర్తింపు పొందినవాటిలో లక్క బొమ్మలు ఒకటి.. ఈ బొమ్మలకు కేరాఫ్ ఏటికొప్పాక.. కానీ త్వరలో ఆ ఆనవాళ్లు చెరిగిపోనున్నాయా..? ప్రస్తుతం ఆ కుటుంబాల పరిస్థితి చూస్తుంటే.. అవును అనే సమాధానం వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...
    P. Anand Mohan, Visakhapatnam, News18,

    Etikoppaka Toys:  విశాఖపట్నం జిల్లా (Viskhapatnam District) లోని  ఏటికొప్పాక గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు.. ఏటికొప్పాక అనగానే.. లక్కబొమ్మల తయారీ గుర్తొస్తుంది. సహజ రంగులతో తయారవుతున్న ఏటికొప్పాక కొయ్యబొమ్మలు చాలా మంచివని కేంద్ర ప్రభుత్వే (Central Government) కేంద్రమే కితాబిచ్చింది. ఇప్పుడు అదే ఏటికొప్పాకలో లక్క బొమ్మల తయారీ కుంటుపడింది. ఎటుచూసినా రంగు రంగుల లక్క బొమ్మలతో కళకళలాడే ఏటికొప్పాక ఇప్పుడు  వ వెలవెల బోతోంది. ఒకప్పుడు పండుగలా ఉండే గ్రామమంతా ఇప్పుడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.

    లక్కబొమ్మల తయారీకి వినియోగించే కలప కొరత. లక్క బొమ్మల తయారికి ముడిసరుకైన అంకుడ కర్ర దొరకక తీవ్ర ఆర్థిక కష్టాలు చవిచుస్తున్నారు కొప్పాక హస్తకళాకారులు. అంకుడు కర్ర, సహజసిద్ధమైన రంగులను మాత్రమే వినియోగించి బొమ్మలు తయారుచేయడం ఏటికొప్పాక కళాకారుల ప్రత్యేకత.

    ఇదీ చదవండి: ఎన్నాళ్లీ డోలీ కష్టాలు.. రోడ్లు ఎందుకు వేయరు అంటూ ఆవేదన

    ఏటికొప్పాకకు చెందిన పలువురు ఔత్సాహిక హస్త కళాకారులు తమ సృజనాత్మకత, వినూత్న ఆలోచనలతో బొమ్మలు తయారుచేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. ఏటికొప్పాక గ్రామంలో 200 మందికి పైగా కళాకారులు లక్కబొమ్మలు తయారు చేసుకుని ఉపాధి పొందుతున్నారు.

    ఇదీ చదవండి: : ఎందరికో మార్దదర్శిగా మారిన సామాన్యుడు జయదేవ్ భొత్ర.. ఇంతకీ ఏం చేశారో తెలుసా..?

    ఏటికొప్పాకలో తయారు చేసిన బొమ్మలు ఇతర రాష్ట్రాలతో పాటు, విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఏటికొప్పాక హస్తకళాకారుల లక్క బొమ్మల తయారీకి అవసరమైన ముడిసరకు దొరక్క ఇబ్బందుల పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే కర్రకు అధిక ధర చెల్లించాల్సి రావడంతో చేసిన బొమ్మలకు సరైన గిట్టుబాటు ధర పొందలేకపోతున్నారు.

    కళాకారులకు పెట్టుబడి వ్యయం బాగా పెరిగిపోతోంది. అంకుడు కర్ర డిపోను ఏటికొప్పాకలో ఏర్పాటు చేసినా వారం తిరక్కుండానే మూసివేశారు. గ్రామంలో డిపో ఏర్పాటు కలగానే మిగిలింది. లక్కబొమ్మల తయారీకి ప్రధాన వనరు అంకుడు కర్ర. ఇది అటవీ ప్రాంతంలో మాత్రమే లభిస్తుంది. ఈ కర్ర మెత్తగా ఉండటం వల్ల బొమ్మల తయారీకి అనువుగా ఉంటుంది. ఈ కర్రపై అటవీశాఖ నిషేధం విధించింది. దీంతో కూలీలు ఈ కర్రను అడవి నుంచి రహస్యంగా తీసుకొచ్చి కళాకారులకు విక్రయిస్తున్నారు.

    ఇదీ చదవండి:  పుష్పక విమానం డైరెక్టర్‌ దామోదర గురించి ఆ విషయం తెలిస్తే షాక్ అవుతారు.. ఇది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

    ప్రస్తుతం విశాఖజిల్లాలోని అటవీ ప్రాంతంలో అంకుడు నిల్వలు బాగా తగ్గిపోయాయి. పొరుగు రాష్ట్రాల్లో ఈ కర్ర నిల్వలు ఎక్కువుగా ఉండడంతో అక్కడ  వంట చెరకుగా వాడతారు. అక్కడి నుంచి మన రాష్ట్రానికి అంకుడు కర్రను దిగుమతి చేస్తే హస్త కళాకారులకు తక్కువ ధరకు ముడిసరుకు లభించడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు నుండి అంకుడు కర్రను దిగుమతి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏటికొప్పాక గ్రామస్తులు కోరుతున్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు పొందుతున్నా ముడిసరకు కొరతతో కళాకారులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం రాయితీపై అంకుడు కర్రను సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag

    తదుపరి వార్తలు