హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: తిరుచానూరులో గోవిందరాజు స్వామికి ఆలయం ఎందుకు లేదు? అసలు మిస్టరీ తెలిస్తే షాక్

Tirumala: తిరుచానూరులో గోవిందరాజు స్వామికి ఆలయం ఎందుకు లేదు? అసలు మిస్టరీ తెలిస్తే షాక్

గోవిందరాజు స్వామికి ఆలయం ఎందుకు లేదో తెలుసా?

గోవిందరాజు స్వామికి ఆలయం ఎందుకు లేదో తెలుసా?

Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మరెన్నో ప్రశ్నలకి సమాధానం హైందవ శాస్త్రంలోని భద్రంగా లికించబడ్డాయని వేదపండితుల మాట.. అంతేకాదు వాటికి సంబంధించి ఎన్నో రుజువులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికీ వీడని మిస్టరీ గురించి తెలుసా..? గోవిందరాజు విగ్రహానికి ఆలయం ఎందుకు కట్టలేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

GT Hemanth Kumar, Tirupathi, News18

Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) నడియాడిన సప్త గిరుల్లో చిదంబర రహస్యాలు ఎన్నో.. ఎవరూ ఊహించని పౌరాణిక విశేషాల నెలవు కలియుగ వైకుంఠం.  తిరుమల (Tirumala) లో వేదాలే శిలలు అయ్యాయని మహా కవులు చెప్పే మాట. అడుగడుగునా అంతుచిక్కని ఎన్నో రహస్యాలు.. మరెన్నో ప్రశ్నలకి సమాధానం హైందవ శాస్త్రంలోని భద్రంగా లికించబడినదని వేదపండితుల వాదన. వాటిని రుజువు చేసేవే శిలా శాసనాలు. ఇలా శాస్త్రోక్తంగా ఏర్పడిన ఆలయాల్లో అభిషేకాది. దూపదీప నైవేద్యాలతో వెలసిన మూలమూర్తికి ఆరాధన చేస్తారు. అన్ని ఆలయాల్లో చేసే ఆరాధనలు ఓ ఎత్తు.. శేషాచలంపై శ్రీనివాసుడు కొలువై ఉంటె... అంజనాద్రి పర్వతం కింద కొలువైన గోవింద రాజా స్వామి ఆలయం (Govinda Raja swamy Temple) లో పూజ నివేదనే వేరు. శ్రీవారి అన్నగారైన గోవిందరాజునికి పూజ నివేదనలో అభిషేకం ఎందుకు చేయరు. సుద్దతో స్వామి వారి ప్రతిమ ప్రతిష్టించాల్సిన అవశ్యం ఎందుకు వచ్చింది.

మంచినీళ్ల కుంటలో ఒంటరిగా ఉన్న గోవిందరాజ పెరుమాళ్ళకు సంభంధం ఏంటి?

10వ శతాబ్దంలో తమిళనాడులోని చిత్రకూటం.. నేడు చిదంబరంగా పేరు గాంచిన ప్రదేశంలో పల్లవులు దేవేరులతో కలసి ఉన్న గోవిందరాజ పెరుమాళ్ ఆలయాన్ని నిర్మించారు. అనేక ఆలయాలను దక్షిణ భారత దేశంలో పలు ఆలయాలు నిర్మించారు. అప్పటి నుంచి చిదంబరంలో వరద రాజ స్వామికి సమానంగా పూజలు అందుకునే దేవదేవుడు శ్రీ గోవిందరాజులు.

పల్లవుల తరువాత రాజ్యాధికారంలోకి వచ్చిన చోళరాజులు శైవ ఆరాధకులు. విష్ణుమూర్తి దేవునిగా పరిగణలోకి తీసుకొనే వారు కాదు. దింతో వైష్ణవ ఆలయాలపై దాడులకు పాల్పడేవారు. అదే సమయంలో దశావతార సినిమాలో కమల్ హాసన్ ను గోవిందరాజ పెరుమాళ్ ను విగ్రహంతో కలిపి సముద్రంలో కలిపివేసిన సన్నివేశం అక్షర సత్యం. గోవిందరాజ పెరుమాళ్ ను సముద్రంలో వేశారు చోళరాజు కుళుతుంగ చోళుడు. కొంత కాలానికి ఒడ్డుకుచేరుకున్న గోవిందరాజస్వామి ఆయన మహిమను తెలియజేశారు.

ఇదీ చదవండి : ఏపీలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి.. ఎన్ని రోజులు ఇస్తున్నారో తెలుసా..?

ఆ సమయంలో చోళరాజుల నుంచి ఆ విగ్రహాన్ని కాపాడేందుకు గ్రామగ్రామాల్లో దాచుతూ చోళరాజుల కంటపడకుండా రహస్యంగా తిరుపతికి చేర్చారు. కలియుగ దైవం కొలువైన శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలోనే గోవిందరాజస్వామివారికి ఆలయం నిర్మించాలనే ఆలోచనకు వచ్చారు. స్ధానిక పాలకుడైన యాదవరాజు చేతుల మీదుగా 1130 వ సంవత్సరంలో తిరుపతిలో గోవిందరాజ స్వామి వారి ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి ఎంతో మంది రాజులు, పాలకులు స్వామి వారి సేవలో తరించారు.

ఇదీ చదవండి : నవంబర్ లోనే ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అందుకేనా..?

ఈ ఆలయాన్ని  విజయనగర సామ్రాజ్య రాజులు అభివృద్ధి చేశారు. అయినప్పటికీ చిదంబరం నుంచి తీసుకొచ్చిన రాతి విగ్రహం మాత్రం ప్రతిష్టించలేకపోయారు. అందుకు కారణం చిదంబరం నుంచి గోవిందరాజస్వామి వారి రాతి విగ్రహాన్ని తిరుపతికి తరలించే సమయంలో ముక్కు, చేతులు, వేళ్ళు భాగంలో కొంత లోపం వచ్చింది. దీంతో‌ ఆరాతి విగ్రహం ఆలయంలో ప్రతిష్టించే అర్హత కోల్పొయింది. విగ్రహం లోపాలను రామానుజాచార్యులు గుర్తించారు. గోవిందరాజు విగ్రహం లోపాలు ఉన్న ఉభయ దేవేరుల విగ్రహం మాత్రం చెక్కుచెదర లేదు. ఆ విగ్రహాలను తిరుపతిలోని అంకాల పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్టించారు. దింతో గోవిందరాజ స్వామి పూజకు నోచుకోక తిరుపతిలోని నరసింహ తీర్థం అయిన మంచినీళ్ల గుంటలో ప్రతిష్టించారు.

ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకి జగన్ టికెట్ ఇవ్వరా? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఓ రాగి చెట్టు కింద నిలువ నీడలేని ఆ గోవిందరాజునికి ఏడాది క్రితం భక్తుల విన్నపంతో టీటీడీ., తిరుపతి మున్సిపాలిటీ మండపాన్ని నిర్మించింది. ప్రస్తుతం కొందరు భక్తులు గోవిందరాజా పెరుమాళ్ కు పూజలు అందిస్తున్నారు. చిత్రకూటం నుంచి తెచ్చిన విగ్రహం పూజకు నోచుకోకపోవడంతో మరో విగ్రహాన్ని మలచాలని నిష్టాతులైన శిల్పులకు అప్పగించాలని యాదవ రాజుకు రామానుజ చార్యులు ఆదేశించారు. యాదవ రాజు మూల విరాట్టును మలచే పనిని కొందరు నిష్ణాతులైన శిల్పులకు అప్పగించారు.  కాని ఎలా జరిగిందో తెలియదు కాని విగ్రహంలో చిన్న లోపం ఉండటం వలన ప్రతిష్టాపన అర్హతను పొందలేక పోయింది. అందులో కొన్ని లోపాను గుర్తించిన రామానుజుల వారు మరో విగ్రహాన్ని చెక్కాలని సూచించారు. ఆ చిన్న లోపాలు ఉన్న విగ్రహమే పద్మసరోవరం వద్ద ఓ మూలాన చిన్న మండపంలో ప్రతిష్టించారు.

ఇదీ చదవండి: అమ్మో నిమ్మ.. ఒక్క కాయ ధర ఎంతో తెలిస్తే షాక్.. అదే రూటులో అల్లం..

దేశ పర్యటన అవశ్యం కావడంతో రామానుజచార్యలు తిరుపతిని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రాతి విగ్రహం మలచే సమయం లేదు. దీంతో గోవిందరాజస్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన సమయం మించి పోతుండడంతో సున్నం, బంకమట్టితో తయారు చేసిన గోవిందరాజస్వామి విగ్రహాన్ని  ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సున్నపు విగ్రహమే పూజలందుకుంటోంది. ఇక్కడ స్వామివారికి అభిషేకాది‌ కార్యక్రమాలను నిర్వహించరు. ఎందుకంటే సున్నం, బంకమట్టి విగ్రహం కావడంతో కరిగిపోతుందని. ప్రతి పదిహేను రోజులకు ఒక్కమారు  నూనె రాస్తారు. ప్రతినిత్యం స్వామి వారికి పూజనివేదనలు సమర్పించి స్వామికి పుష్పలతో అలంకరణ చేస్తారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala news

ఉత్తమ కథలు