హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag Airport: సరికొత్తగా విశాఖ విమానాశ్రయం! రన్‌వేపై అభివృద్ధికి రయ్‌ రయ్‌!

Vizag Airport: సరికొత్తగా విశాఖ విమానాశ్రయం! రన్‌వేపై అభివృద్ధికి రయ్‌ రయ్‌!

సలహా కమిటీ సమావేశం

సలహా కమిటీ సమావేశం

ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాలని, గంటకు 10 స్లాట్లు కేటాయించాలన్నారు. గతంలో విశాఖ నుంచి దుబాయ్ వరకు నడిచే ఎయిర్ ఇండియా విమానం చాలా కాలం నుంచి నిలిచిపోయిందని...

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

విశాఖ విమాన ప్రయాణికులకు ఇది శుభవార్త. మరిన్ని మెరుగైన సదుపాయాలు.. గంటకు పది స్లాట్‌లు కేటాయింపు.. దుబాయ్, మలేషియా బ్యాంకాకులకు కొత్త సర్వీస్‌ల ప్రతిపాదన, వారణాసికి కొత్త సర్వీస్, కార్గో రవాణా తక్షణమే పెంచాల్సిందేనని కీలక తీర్మానాలు చేసింది సలహామండలి. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేయాలని ఇందుకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని సలహా మండలి చైర్మన్ విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ఆదేశించారు. విమానాశ్రయం టెర్మినల్ భవన్‌లో జరిగిన సలహా మండలి సమావేశానికి ఎంవివి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. మొదట విమానాశ్రయం డైరెక్టర్ కె. శ్రీనివాసరావు ఎజెండాలో అంశాలను సభ్యులకు వివరించారు. కొత్త బడ్జెట్ ప్రతి పాదనలు తెలిపారు. వీటికి సంబంధించి సభ్యుల నుంచి తగిన సలహాలు సూచనలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  పలువురు సభ్యులు అనేక ప్రతిపాదనలు చేశారు. అయితే వీటిపై సాధ్యాసాధ్యాలపై చర్చించిన తర్వాత ఏవైతే తక్షణమే అమలు చేయగలమన్నది నిర్ణయించి వాటినే తీర్మానించి కేంద్ర రాష్ట్రాలకు పంపించాలని ఛైర్మెన్ ఎంవీవీ నిర్ణయించారు.

గంటకు 10స్లాట్లు కేటాయించాలి:

దేశంలో 9వ రిచెస్ట్ సిటీగా ఉన్న విశాఖ ఇతర విమానాశ్రయాలతో పోల్చుకుంటే 19వ స్థానంలో ఉంది. దీన్నీ తొమ్మిదో స్థానంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్క సభ్యుడు ప్రయత్నించాలని సలహా మండలి ప్రత్యేక సలహా దారు ఓరుగంటి నరేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తర్వాత ఛైర్మెన్ ఎంవీవీ సత్యనారాయణ కొన్ని ముఖ్య తీర్మానాలను ప్రతిపాదించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాలని, గంటకు 10 స్లాట్లు కేటాయించాలన్నారు. గతంలో విశాఖ నుంచి దుబాయ్ వరకు నడిచే ఎయిర్ ఇండియా విమానం చాలా కాలం నుంచి నిలిచిపోయిందని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాబట్టి దుబాయ్, మలేషియా బ్యాంకాక్‌కు కొత్త సర్వీసులు నడిపే విధంగా పలు విమానయాన సంస్థలను కోరాలని నిర్ణయించారు. దీనిపై డైరెక్టర్ శ్రీనివాసరావు వివరిస్తూ కౌలాలంపూర్‌కి కొత్త సర్వీస్ నడిపేందుకు మలిండో సంస్ధ ముందుకు వచ్చిందన్నారు. మిగిలిన ప్రాంతాలకి ఇండిగో, ఏయిర్ఏసియా, ఇతర సంస్థలను సంప్రదిస్తున్నామన్నారు.

వారణాసికి నూతన సర్వీస్ అవసరము అని కాబట్టి అన్నిటికీ అవసరమైన సహకారం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహాకారం కోసం సలహా మండలి తరఫున తీర్మానాలు చేసి పంపాలని ఎంపి ఎంవీవీ సూచించారు. అంతే కాదు కార్గో రవాణా తగ్గిపోయిందని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని సభ్యులు ఛైర్మెన్,డైరెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అన్ని విమానయాన సంస్థలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరింత కనెక్టివిటీ పెంచాలని, విమానాశ్రయాలు మరింతగా అభివృద్ది చేసే ప్రయత్నాలు చేస్తోందని సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు తెలిపారు. ఐతే ఈ లోగా ముఖ్య పనులు వేగవంతం చేయాలని ఛైర్మెన్ డైరెక్టర్ శ్రీనివాసరావును కొరారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం లోపల కొన్ని మార్పులు చేర్పులు చెయ్యాలని ఛైర్మెన్ ఎంవీవీ సత్యనారాయణ ఆదేశించారు. అదే విధంగా మరుగు దొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.

First published:

Tags: Airport, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు