హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag News: డేంజర్ జోన్ లో వైజాగ్..? ఆస్పత్రులకు జనం పరుగులు..!

Vizag News: డేంజర్ జోన్ లో వైజాగ్..? ఆస్పత్రులకు జనం పరుగులు..!

విశాఖలో డెంగ్యూ భయం

విశాఖలో డెంగ్యూ భయం

విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో ఓ వైపు చలి తీవ్రత బాగా పెరిగింది. మరో వైపు చాప కింద నీరులా డెంగ్యూ కేసులు (Dengue fever) కూడా అధికమయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam | Andhra Pradesh

Setti Jagadeesh, News 18, Visakhapatnam

విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో ఓ వైపు చలి తీవ్రత బాగా పెరిగింది. మరో వైపు చాప కింద నీరులా డెంగ్యూ కేసులు (Dengue fever) కూడా అధికమయ్యాయి. సీజనల్ వ్యాధుల నివారణకు అధికారులు ఎప్పటికప్పుడు అటు ఆరోగ్యశాఖ, ఇటు ప్రజారోగ్యశాఖ అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం చలి కాలం ఇప్పుడు ఎక్కువ డెంగ్యూ వుండదు.కానీ ఇప్పుడు కాలంకాని కాలంలో డెంగ్యూ కేసులు ఎందుకు అధికమవుతున్నాయో అధికారులకు అంతు చిక్కడంలేదు. విశాఖలోని పాతనగరం, పలు మురికివాడ ప్రాంతాల్లో నివసిస్తున్న నగర ప్రజలంతా ఇళ్లలో నీరు , స్థానికంగా ఇతర తొట్టెలో నిల్వ వుండటంతోనే ఈ కేసుల ఉధృతి అధికంగా ఉంటున్నాయని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

అదే సమయం లో అధికారులు గ్రేటర్ పరిధిలో డ్రైడే వారానికి ఒకసారి చేయవలసి వుంటుంది. కానీ అవి అంతంత మాత్రం గానే కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సీజనల్ వ్యాధులు గురించి వివరించాలి. కానీ అంతలా ఎక్కడా కనిపించడం లేదు. అయితే వాస్తవానికి ప్రతి ఏటా జూలై నెల నుంచి నవంబర్ వరకూ ఎపిడెమిక్ సీజన్ అధికారులు అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటారు. కానీ సీజన్ చివరి సమయంలో కూడా కేసులు ఉధృతి అధికంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన మొదలైంది.

ఇది చదవండి: వైజాగ్ ను ఈ యాంగిల్ లో ఎప్పుడైనా చూశారా..? వావ్ అనకుండా ఉండలేరు..!

విశాఖ జిల్లాలో సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా కేసులు సీజన్ ప్రారంభ దశలోనే కేసులు అధికంగా నమోదు కావడంతో నగర ప్రజలను దడ పుట్టించాయి. ముఖ్యంగా విశాఖ నగరంతో పాటు, రూరల్, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా వున్నాయి.

ఇది చదవండి: మన్యంలో ఆ తరహా దుస్తులకు గిరాకీ.. ఏడాదికి 9 నెలలపాటు డిమాండ్..!

నెల రోజుల్లోనే 105 కేసులు

విశాఖ నగరంలో అధిక సంఖ్యలో జ్వరం వచ్చిన వారు మంచాన పడుతున్నారు. విశాఖ జిల్లాలో గత అక్టోబర్ నెలలో 147, సెప్టెంబర్ 262, నవంబర్లో 105 కేసులు నమోదుకాగా, ఇప్పటి వరకూ జిల్లాలో 11 నెలల వ్యవధిలో 376 డెంగ్యూ కేసులు అధికారికంగా నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహా విశాఖ నగరంలోని మురికివాడ ప్రాంతాలతో పాటు పాత నగరంలో కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Dengue fever, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు