హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఏపీలో విజృంభిస్తున్న మరో మహమ్మారి... అస్పత్రులకు పరుగులు పెడుతున్న జనం..

Andhra Pradesh: ఏపీలో విజృంభిస్తున్న మరో మహమ్మారి... అస్పత్రులకు పరుగులు పెడుతున్న జనం..

ఇంట్లో నిత్యం వినియోగించే కూలర్లు, డస్ట్ బిన్‌లు క్రమం తప్పకుండా శుభ్రపరచండి. కీటకాలు, దోమలు ఇలాంటి వాటిల్లో పోగయ్యే అవకాశం ఉంది. దోమలను దూరంగా ఉంచేందుకు ఇంట్లో తేలికపాటి కర్పూరాన్ని వెలిగించండి. దీంతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఉత్పత్తులు, మెషిన్లను వాడటం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా కాపాడుకోవచ్చు.

ఇంట్లో నిత్యం వినియోగించే కూలర్లు, డస్ట్ బిన్‌లు క్రమం తప్పకుండా శుభ్రపరచండి. కీటకాలు, దోమలు ఇలాంటి వాటిల్లో పోగయ్యే అవకాశం ఉంది. దోమలను దూరంగా ఉంచేందుకు ఇంట్లో తేలికపాటి కర్పూరాన్ని వెలిగించండి. దీంతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఉత్పత్తులు, మెషిన్లను వాడటం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా కాపాడుకోవచ్చు.

కరోనా మహమ్మారితో (Corona Virus) పోరాడుతున్న ప్రజల్ని‌ ఇప్పుడు మరో మహమ్మారి భయపెడుతోంది. ఓవైపు కరోనా వైరస్.. మరోవైపు దోమలు వెరసి ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.

P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి. న్యూస్18

కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రజల్ని‌ ఇప్పుడు మరో మహమ్మారి భయపెడుతోంది. ఓవైపు కరోనా వైరస్.. మరోవైపు దోమలు వెరసి ప్రజలు ఆస్పత్రుల పాలవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా పేరొందుతున్న విశాఖ నగరంలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. పారిశుధ్య నిర్వహణ గాడి తప్పడం, అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో డెంగ్యూ జ్వరము కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. నగర పారిశుధ్య విధానంలో మార్పుల కారణంగా డెంగ్యూ కేసులు పెరుగుదల ఎక్కువగా ఉంది. గతంలో వార్డుల ప్రాతిపదికగా పారిశుధ్య కార్మికులు రోడ్లు ఊడ్చడం, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం, కాలువల్లో పూడికలు తీయడం చేసేవారు. కానీ కొద్దిరోజుల కిందట దీనిని మార్పు చేసి వార్డు సచివాలయాలను ప్రాతిపదికగా చేసుకుని పారిశుధ్య కార్మికులను కేటాయిస్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో ముగ్గురు చొప్పున కార్మికులు రోడ్లు ఊడ్చడం, చెత్తసేకరణ, కాలువల్లో పూడిక తీయడం వంటి పనులు చేస్తున్నారు.

కార్మికులపై పనిభారం పెరగడంతో చెత్త సేకరణ పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నారు. దీనివల్ల చెత్త కుప్పలు రోజుల తరబడి వీధుల్లోనే ఉండిపోతున్నాయి. దీనికితోడు అడపాదడపా కురుస్తున్న వర్షాలు దోమల వృద్ధికి అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే నగరంలో కొంతకాలంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి.

ఇది చదవండి: మందుబాబు చేతిలో నాటు బాంబు... పరుగులు పెట్టిన జనం.. చివరికి ఏమైందంటే..!గత ఏడాది జూన్‌లో రెండు కేసులు మాత్రమే నమోదైతే ఈ ఏడాది జూన్‌లో పది కేసులు నమోదయ్యాయి. గత ఏడాది జూలైలో ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ ఈ ఏడాది జూలైలో ఏకంగా 47 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఆగస్టులో ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ ఈ నెల ఐదో తేదీ నాటికే ఏడు కేసులు నమోదవడం నగరంలో డెంగ్యూ విజృంభణకు అద్దంపడుతోంది. అయితే అధికారిక లెక్కలు ప్రకారం ఇలా ఉంటే.. అనధికారికంగా అంతకు పదింతల మందితో డెంగ్యూతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇది చదవండి: ఆషాఢమని పుట్టింటికి వచ్చిన నవ వధువు.. ఇంతలో మాజీ ప్రియుడు కలిశాడు.. ఆ తర్వాత...


డెంగ్యూ బాధితుల కోసం కొద్దిరోజుల కిందట కేజీహెచ్‌ రాజేంద్రప్రసాద్‌ బ్లాక్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటుచేశారు. అయితే అక్కడ సరైన వైద్యం అందదనే భయంతో అంతా ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. జ్వరాల సీజన్‌ ప్రారంభం కావడంతో జీవీఎంసీ అధికారులు దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

ఇది చదవండి: ఏపీలో పెళ్లిళ్లపై ఆంక్షలు... ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..


కరోనా కారణంగా డెంగ్యూ ఫీవర్ పరీక్షల నిర్వహణ మందగించింది. ఇటు డెంగ్యూపై జీవీఎంసీ అధికారులే ఈ విషయం అంగీకరించారు. కరోనా కారణంగా జ్వర పరీక్షలు సరిగా నిర్వహించలేదని, ఈ ఏడాది నిర్వహిస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు పేర్కొన్నారు. కేసుల తగ్గుదలకి కేవలం పారిశుధ్య నిర్వహణ మాత్రమే పరిష్కారంగా వైద్యుల మాట.

First published:

Tags: Andhra Pradesh, Corona virus, Dengue fever

ఉత్తమ కథలు