హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Death Mystery: నెలరోజులుగా చెట్టుకు వేలాడుతున్న డెడ్ బాడీ... అసలు మిస్టరీ ఇదేనా..?

Death Mystery: నెలరోజులుగా చెట్టుకు వేలాడుతున్న డెడ్ బాడీ... అసలు మిస్టరీ ఇదేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Srikakulam : అది ఒక అటవీ ప్రాంతం. ఎటుచూసినా చెట్లు, పొదలతో దట్టంగా ఉంటుంది. సామాన్యంగా మనుషులు అటువైపు వెళ్లరు. ఐతే కట్టెల కోసం ఓ వ్యక్తి అటువైపు వెళ్లాడు. ఎదురుగా ఉన్న జీడిచెట్టు వైపు చూసి భయంతో పరుగులు పెట్టాడు.

  అది ఒక అటవీ ప్రాంతం. ఎటుచూసినా చెట్లు, పొదలతో దట్టంగా ఉంటుంది. సామాన్యంగా మనుషులు అటువైపు వెళ్లరు. ఐతే కట్టెల కోసం ఓ వ్యక్తి అటువైపు వెళ్లాడు. ఎదురుగా ఉన్న జీడిచెట్టు వైపు చూసి భయంతో పరుగులు పెట్టాడు. అందుకు కారణం ఆ చెట్టుకు ఓ మృతదేహం వేలాడుతోంది. ఆ మృతదేహం ఎవరిది.. ఎందుకు ఇక్కడ వేలాడుతోంది. ఆతడే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా.. అనేది సస్పెన్స్ గా మారింది. క్రైమ్ స్టోరీని తలపిస్తున్న ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం పంచాయతీ పరిధిలోని మామిడిగుడ్డి గ్రామ సమీపంలో అడవిలో బొడికొండ అనే కొండ ఉంది.

  సోమవారం మామిడిగుడ్డి గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి కట్టెల కోసం కొండపైకి వెళ్లాడు. అక్కడ కట్టెల కోసం తిరుగుతండగా ఓ జీడిచెట్టుకు డెడ్ బాడీ వేలాడుతూ కనిపించింది. వెంటనే గ్రామంలోకి పరుగులు పెట్టి విషయాన్ని స్థానికులకు చెప్పాడు. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్ఐ సందీప్ కుమార్, ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. వెంటనే క్లూజ్ టీమ్ రంగంలోకి దిగి కొండ చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం వేలాడుతున్న చెట్టు దగ్గర నాటుసారా బాటిల్ లభ్యమైంది.

  ఇది చదవండి: కట్టుకున్నవాడి కోసం ఈమె చేస్తున్నపనికి కన్నీళ్లు ఆగవు..! ఇంతకీ ఏం జరిగిందంటే..!  స్పాట్ లో దొరికిన ఆధారాలతో పాటు ఇటీవల నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలించిన అధికారులు మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందిన బొర ధర్మారావు నెల రోజుల క్రితం అదృశ్యమైనట్లు గుర్తించారు. మృతదేహం అతడిదా కాదా అనేది నిర్ధారించేందుకు ధర్మారావు బావమరిది మల్లేశును పిలిపించారు. అతడు కూడా డెడ్ బాడీ ధర్మారావుదేనని గుర్తించాడు. మృతుడి కుమారులు గత నెల 19వ తేదీన తండ్రి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి పాతపట్నం ఆస్పత్రి డాక్టర్లు ఘటనాస్థలిలోని పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

  ఇది చదవండి: మ్యాట్రిమనీలో పరిచయం.. రెండు నెలలు సహజీవనం.. ఓ అర్ధరాత్రి ఊహించని ట్విస్ట్...


  మృతదేహాన్ని గుర్తించిన వ్యక్తితో పాటు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో ఇది హత్యా..? లేక ఆత్మహత్యా..? అనేది మిస్టరీగా మారింది. మృతుడి కుటుంబంలో ఎమైనా గొడవలుగానీ, ఆర్ధిక ఇబ్బందులుగానీ ఉన్నాయా..? అనే కోణంలో విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అలాగే ధర్మారావు అదృశ్యమైన వారం రోజుల ముందు ఏమైనా గొడవలు జరిగాయా..? అనే అంశాలపై దృష్టిపెట్టారు. మరోవైపు నెలరోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి విగతజీవిగా కనిపించడంతో ధర్మారావు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Srikakulam

  ఉత్తమ కథలు