హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: అక్కడ ఏం జరుగుతోంది..? రోడ్డెక్కిన బీచ్‌.. కూలుతున్న చెట్లు..

Vizag: అక్కడ ఏం జరుగుతోంది..? రోడ్డెక్కిన బీచ్‌.. కూలుతున్న చెట్లు..

రోడ్డుపైకి

రోడ్డుపైకి వచ్చేస్తున్నబీచ్ అలలు

Vizag: ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన యారాడ బీచ్‌లో అలల ఉధృతి బాగా పెరుగుతోంది. స్థానికులను భయపెడుతోంది. ఎంతలా అంటే అలలు రోడ్డును తాకుతున్నాయి. అక్కడి చెట్లు కూలిపోతున్నాయి. ఇంతకీ ఏం జరుగుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  ప్రముఖ పర్యాటక ప్రాంతం విశాఖపట్నం (Visakhapatnam) అయితే అత్యధికంగా ఆకట్టుకునేవి బీచ్ లే.. ఒకటా రెండా.. అడుగడుగునా బీచ్ అందాలు పర్యాటకులను ఆహ్వానిస్తూనే ఉంటాయి. అయితే కొన్ని చోట్ల అలలు ప్రశాంతంగా.. నీలి వర్ణంలో ఉండి ఆహ్లాదరకంగా ఉంటే.. కొన్ని ప్రదేశాల్లో మాత్రం హోరుమని అలలు జోరుగా వస్తూ.. అడ్వంచర్ ఫీల్ (Adventure Feel) కలిగిస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో సముద్రం హోరు ఒక్కసారిగా ముందుకొస్తే విధ్వంసమే.. సునామీ లాంటి ఘోర ప్రకృతి వైపరిత్యాలు చూసిన నగరవాసులు ఇప్పుడు విశాఖలో సముద్రం ముందుకు రావడంతో భయపడిపోతున్నారు. ఒక్కసారిగా ప్రళయం ముంచుకొస్తుందా? అని కంగారు పడుతున్నారు.

  ఎప్పటికప్పుడు విశాఖవాసులను సముద్రం భయపెడుతోంది. ముందుకొచ్చి విశాఖ వాసులను కంగారుపెడుతోంది. ఇటీవల విశాఖ ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చి తీరని నష్టాన్ని మిగిల్చింది. బీచ్ వద్ద చిన్నారులు ఆడుకునే చిన్న పిల్లల పార్కులో పది అడుగుల మేర కోతకు గురి చేసి వెళ్ళిపోయింది. ఈ కోతకు అక్కడ ఉన్న పార్క్‌లోని బొమ్మలు కూడా విరిగిపడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు.

  ఇదీ చదవండి : కోర్కెలు తీర్చే కొంగు బంగారం కనకదుర్గ.. ఇంద్రకీలాద్రికి అంతటి విశిష్టత ఎందుకు

  విశాఖ బీచ్ ఎప్పటికప్పుడు ముందుకు రావడంతో బీచ్‌కు వచ్చి ఎంజాయ్ చేయాలనుకున్న పర్యాటకులు భయపడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన సర్వత్రా ఉంది. పర్యాటకులను ఎవరినీ ఆ వైపుగా రానీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అదే తీరు మళ్లీ యారాడ బీచ్‌లో దర్శనమిచ్చింది.

  ఇదీ చదవండి: కొడాలి నానికి ఏమైంది..? అలా ఎందుకు చేశారు..? మనస్థాపం చెందారా..?

  ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన యారాడ బీచ్‌లో అలల ఉధృతి బాగా పెరుగుతోంది. ఈ యారాడ బీచ్ విశాఖ నగరానికి దగ్గరగా ఉండటం వల్ల విశాఖ వచ్చిన పర్యాటకులను, స్థానికులకు బాగా ఆకర్షిస్తుంది.

  ఇదీ చదవండి : ప్రభాస్ కు మంత్రి రోజా హామీ.. రెండు ఎకరాల స్థలం కేటాయింపు..

  ఈ యారాడ బీచ్‌కి పర్యాటకులు వెళ్లి చూస్తే మూడు వైపులా పచ్చని కొండలు నాలుగో వైపున అద్భుత బంగాళాఖాతం ఉండి ఒక మంచి వ్యూ కనిపిస్తుంది. బీచ్ పచ్చదనంతో పాటు బంగారు రంగు ఇసుకతో ఉంటుంది. ఇంత చక్కటి సుందర సాగర తీరంలో మంగళవారం మునుపెన్నడూ లేని విధంగా సముద్రపు నీరు సుమారు వంద మీటర్ల మేర ముందుకు వచ్చింది.

  ఇదీ చదవండి : ఒంటరిగా ఉంటున్నారా.. మీకో గుడ్ న్యూస్.. కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

  దీంతో స్థానిక గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒకసారిగా వచ్చిన కెరటాల తాకిడికి తీరంలో గల కొన్ని తాటిచెట్లు కింద పడి సముద్రం లోకి కొట్టుకుపోయాయి. అంతేకాక సందర్శకులు, స్థానిక గ్రామస్తులు రాకపోకలు సాగించే రోడ్డు వరకూ సముద్రపు నీరు వచ్చింది. నీటితోపాటు వచ్చిన దుమ్ము దూలితో వ్యర్థాలు అన్ని రహదారిపై బాగా పేరుకుపోయాయి.

  కాగా స్థానికంగా గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో కూడా మత్స్యకారుల కోసమని సముద్రానికి వంద మీటర్ల దూరంలో జెట్టీని నిర్మించారు. ఈ జెట్టీపైకి కూడా చాలా సముద్రపు నీరు వచ్చింది. ముందుకొస్తున్న సముద్ర తీరం చూసి తీవ్ర ప్రమాదం ఏదైనా ముంచుకొస్తుందేమోనని గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అధికారులు స్పందించి ఏదైనా ప్రత్యమ్యాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు