ప్రశాంతతకు మారుపేరైన విశాఖ(VIZAG) నగరం నిత్యం హత్యలు(murders ), అత్యాచారాలు(Rapes), గ్యాంగ్ వార్(Gang Wars) లతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఓ పదోతరగతి విద్యార్థిపై (Tenth Class Student) కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి గాయపరచడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
ప్రశాంతమైన ఆ నగరంలో ఇప్పుడు దండుపాళ్యం బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయి. నిత్యం దందాలు, ఘర్షణలు, దాడులతో జనాల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇదెక్కడో పక్క రాష్ట్రంలో అనుకుంటే పొరపాటే.. ప్రశాంతతకు మారుపేరైన మన విశాఖపట్నం (Visakhaptnam) లోనే. నగరంలోని కేజీహెచ్ డౌన్, కలెక్టరేట్ కి కూతవేటు దూరంలోనే ఈ బ్యాచ్ దందా నడుస్తోంది. నిన్నటికి నిన్న ఓ పదో తరగతి విద్యార్ధిపై దాడి చేసిన ఈ బ్యాచ్...స్థానికంగా భయం పుట్టించింది. కారణాలేవైనా ఈ బ్యాచ్ దాడిలో ఓ పదో తరగతి విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు. నగరంలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడంతో.. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
విశాఖపట్నం.. ప్రశాంతనగరంగా.. సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖకు పేరు. కానీ...ఇటీవల నిత్యం అత్యాచారాలు, హత్యలతో నిత్యం వార్తల్లో ఉంటోంది. కొన్ని గ్యాంగ్ ల హల్ చల్ తో నగరంలో ప్రశాంతత కరువైంది. ప్రధానంగా విశాఖలోని కేజీహెచ్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొందరు బ్యాచ్ గా ఏర్పడి దండుపాళ్యం బ్యాచ్ లా హల్ చల్ చేస్తున్నారు. విశాఖ నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పదో తరగతి పరీక్ష రాసి వస్తున్న విద్యార్థిపై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.
రెల్లివీధికి చెందిన బాలుడు (17) ఇక్కడి ఓ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం వన్‌టౌన్‌లోని ఓ బాలికల ఉన్నత పాఠశాలలో సోషల్ పరీక్ష రాసి ఇంటికి వెళ్లేందుకు మిత్రులతో కలిసి ఆటో ఎక్కుతుండగా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దీంతో బాలుడు సమీపంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ కి పరుగులు తీశాడు. అది చూసి దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. గాయపడిన బాలుడు ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.
ఏవీఎన్ కళాశాల ప్రాంతంలో దండుపాళ్యం ముఠాగా చెప్పుకుని తిరుగుతున్న బ్యాచ్‌కు చెందిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఓ దాడి ఘటనలో ఈ బాలుడిపై హత్యాయత్నం కేసు ఉందని చెబుతున్నారు. గతంలో బాలుడిపై పలు కేసులు ఉన్నాయని, పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. ప్రశాంత విశాఖలో ఇలాంటి దాడులు కలకలం రేపుతుండటంపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. విశాఖ సిటీ కమిషనర్ ఈ బ్యాచ్ ఆగడాలపై దృష్టి పెట్టాలని....వీకిని అరెస్టు చేస్తే చాలావరకూ సమస్యలు తీరుతాయని విశాఖ వాసులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.