CYCLONE EFFECT: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు మరో తుపాను ప్రమాదం ముంచుకొస్తోంది. బంగాళాఖాతం (Bay of Bengal) తూర్పుతీరంలో ఏర్పడిన ఆసాని తుపాను (Asani Cyclone) ఏపీ వైపు దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాలపై ఈ తుపాను ప్రభావం చూపించనుంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆసాని తుఫాను బలపడుతోంది. విశాఖ (Visakha) కు 930 కిలోమీటర్ల దూరంలో అది కేంద్రీ కృతమైంది. గంటకు సుమారు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. కాసేపట్లో అది తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో మంగళవారం నుంచి ఒడిశా (Odisha), పశ్చిమ బెంగాల్ (West Bengal), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ కార్యాలయం హెచ్చరించింది.
ముఖ్యంగా వచ్చే 24 గంటల్లో తుపాను మరింత బలపడవచ్చని వాతావరణ శాఖ కార్యాలయం అంచనావేసింది. ఆంధ్రా లేదా ఒడిశా తీరాలను ఇది తాకే అవకాశం ఉందని పేర్కొంది. తీరం దాటే సమయంలో భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడి తుపానుగా మారి వావయ్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.
విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. సోమవారానికి తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
ఇదీ చదవండి : టీడీపీతో పొత్తుకు పవన్ సై..! నై అంటున్న ఏపీ బీజేపీ? అధిష్టానం మాటేంటి
మే 10వ తేదీ వరకు ఇలాగే కొనసాగి ఆ తర్వాత బలహీనపడే అవకాశం ఉందన్నారు. గంటకు 80 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వెల్లడించారు. ఒడిశా, పశ్చిమబెంగాల్ లోని పలు జిల్లాల్లో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో అండమాన్ సహా.. ఒడిశా, బెంగాల్, సిక్కిం, అస్సాం, ఏపీ, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఇదీ చదవండి : టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్..! చర్చలు అవసరం ఉందన్న పవన్.. బీజేపీ పైనా క్లారిటీ? ఏమన్నారంటే?
అయితే .. తుపాను హెచ్చరికతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర, మధ్య ప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తుపానును ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు తుపాను హెచ్చరికలు జారీ చేశారు. దాంతో విపత్తు నిర్వహణశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసాని తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : చిరకాల మిత్రుడికి ఆత్మీయ వీడ్కోలు.. బొజ్జల పాడె మోసిన చంద్రబాబు
ఆసాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేక 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు వేగముతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఒడిశాపైనే ఉంటుందన్న అధికారులు ఆమేరకు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో ఒడిశా మొత్తం హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cyclone alert, Heavy Rains, Visakhapatnam