Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM CYCLONE WARNING FOR ANDHRA PRADESH AS IMD WARNS HEAVY RAIN FORECAST FOR COASTAL ANDHRA AND ODISHA FULL DETAILS HERE PRN VSP

Cyclone Alert: ఏపీకి తుఫాన్ ముప్పు... ఈ జిల్లాలు అలర్ట్... మూడు రోజులు జాగ్రత్త..

ఏపీకి తుపాను హెచ్చరిక

ఏపీకి తుపాను హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు మరో తుఫాన్ ముప్పు (Cyclone Alert) పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఈశాన్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు మరో తుఫాన్ ముప్పు (Cyclone Alert) పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఈశాన్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్యంగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు పయనిస్తోంది. గోపాలపురానికి తూర్పు ఆగ్నేయంగా దాదాపు 500 కిలో మీటర్లు, కళింగపట్నానికి తూర్పుగా 600 కిలోమీటర్ల దూరానా కేంద్రీకృతమైంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి, మరి కొన్ని గంటలు పశ్చిమ వాయవ్యంగానే పయనించి అనంతరం పశ్చిమ నైరుతి దిశగా మరలి రేపు సాయంకాలానికి దక్షిణ ఒడిసా ఉత్తరాంధ్రల మధ్య తీరం దాటే అవకాశమందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో నేడు ఒడిసా (Odisha), కోస్తాంధ్రలలో (Coastal Andhra Districts) అక్కడక్కడ భారీ జల్లులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే ఆదివారం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్రలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల కుంభవృష్టి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

    ఈనెల 27 న కోస్తాంధ్రలో సాధారణ వర్షాలు, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఒడిసాలోనూ భారీ వర్షాలు కొనసాగుతాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని... మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన వారు స్థానిక తీరంతో పాటు ఒడిశావైపు వెళ్లరాదని వాతావరణ శాఖ తెలిపింది.

    ఇది చదవండ: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అక్టోబర్ 1నుంచి కొత్తరూల్స్.. ఇకపై ఈ సర్ఠిఫికెట్ తప్పనిసరి...



    తుఫాన్ ముప్పు..?
    ఐతే ఈ వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారి ఆ తర్వాత తుపానుగా మారే అకాశమున్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. తీవ్రవాయుగుండం తుపాను మారి విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్‌ల మధ్య ఈనెల 26న తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపానుకు గులాబ్ అని పాకిస్తాన్ నామకరణం చేసే అవకాశాలున్నాయి.

    ఇది చదవండి: టీడీపీ-జనసేన మధ్య కుదిరిన పొత్తు.. వైసీపీకి చెక్ పెట్టేందుకే..!


    మూడు రోజుల పాటు వర్షాలు..
    శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో, ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు కురుస్తాయి. అలాగే 26న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశణుంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోనూ కొన్నిచోట్ల భారీ వర్షాలుంటాయి. 27న మాత్రం ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో సహాయక సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇప్పటికే తీరప్రాంత వాసులను హెచ్చరించారు.

    ఇది చదవండి: ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఎకౌంట్లలో డబ్బులు..


    తుపాను వచ్చే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో ఉత్తరాంధ్ర మత్స్యకారులు బిక్కుబిక్కుమంటున్నారు. గత నెలలో అల్పపీడనాలు, అలల తాకిడితో తీరప్రాంత గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే భారీ వర్షాలతో మూడు జిల్లాలో పూర్తిగా జలమయ్యమయ్యాయి. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నురు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Cyclone alert, Weather report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు