Rain Alert: తుఫాను ముప్పు (Cycone Tension) ముంచుకొస్తోందా..? అదే జరిగితే ఈనెల 24 నుంచి 26వరకు ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతం అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అంది రానున్న 24 గంటల్లో బంగాళాఖాతం లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి 22న వాయుగుండంగా, ఆ తరువాత తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను ఏపీ-ఒడిశా (AP-Odisha) నుంచి దిశ మార్చుకొని ఒడిశా-పశ్చిమ బెంగాల్ (West Bengal) వైపు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని, అలా జరిగితే తెలుగు రాష్ట్రాల్లో వర్ష ప్రభావం ఉండదని, ఒకవేళ ఏపీ-ఒడిషా మధ్య తుఫాను తీరందాటితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే దీపావళి పండుగవేళ వరుణుడు తన ప్రభావం చూపేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే పండుగపై
పెను ప్రభావం కనిపిస్తుంది.
ప్రస్తుతం అండమాన్ లో ఏర్పడిన ఆవర్తనం తుపానుగా మారి అమావాస్య సమయంలో తీరానికి చేరే అవకాశం ఉందని, ఈ క్రమంలో రాకాసి
అలలు విరుచుకుపడే సూచనలు ఉన్నట్లు వాతావరణ అధ్యయన నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. తుపాను బలం పుంజుకోవడానికి సముద్రంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఈ తుపాను కారణంగా గాలి తీవ్రత, వర్షపాతం ఏ స్థాయిలో ఉంటుందనేది స్పష్టత రావాలంటే మరో రెండు రోజులు పడుతుందని వాతావరణ అధ్యయన నిపుణులు పేర్కొన్నారు.
తుపాను ఏ దిశగా ప్రయాణిస్తుందో ఇప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తొలుత ఇది ఏపీ, ఒడిశా మధ్య తీరం దాటొచ్చని భావించినప్పటికీ.. ఒడిశా–పశ్చిమబెంగాల్ వైపుకు దిశ మార్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంటుందని, వాయుగుండం తుపానుగా మారే సమయంలో గంటకు 46 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు కెరటాల ఉద్దృతి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. వైద్య రంగంలో మరో సంచలన నిర్ణయం.. 21 నుంచి అమలు
తుఫాన్ ముప్పు ప్రస్తుతానికి అయితే ఏపీకి లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ దిశ ఏ సమయంలోనైనా మార్చే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగానే అక్టోబరు వచ్చిందంటే తుఫానుల బెడద దడ పుట్టిస్తుంది. తాజాగా ఏపీకి సిత్రాంగ్ తుఫాను హెచ్చరికలు హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో బెంబేలెత్తిపోయిన జనాన్ని సిత్రాంగ్ తుఫాను హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇదీ చదవండి : పవన్ పై సీఎం సంచలన వ్యాఖ్యలు.. కుట్రలను ఎదుర్కోడానికి సిద్ధమంటూ సవాల్
పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. శుక్రవారానికి ఇది
వాయుగుండంగా మారే అవకాశం మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది తుఫాన్‌గా మారితే సింత్రాంగ్ అని నామకరణం చేయనున్నారు. అయితే తుఫాను ఏర్పాడితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పైనా ప్రభావం ఉంటుంది అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Rains, Weather report