Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM CRITICISM OVER DOG PARK ESTABLISHING IN VISAKHAPATANAM AS LOCALS FACING MANY PROBLEMS FULL DETAILS HERE PRN VSP

Vizag Dogs Park: కుక్కల కోసం రూ.2కోట్లతో పార్క్.. జనం ఏమంటున్నారంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Visakhapatnam: నగరంలో చాలా చోట్ల సమస్యలు తిష్టవేశాయి. కొన్నిచోట్ల తాగునీరు, మరికొన్ని చోట్ల రోడ్లు, డ్రెయినేజీలు ఇలా విశాఖవాసులు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇన్ని సమస్యలు వదిలేసి విశాఖలో కుక్కలకు పార్కు (Dogs Park) నిర్మించడం వివాదాస్పదమవుతోంది.

ఇంకా చదవండి ...
  P.Anand Mohan, Visakhapatnam, News18

  విశాఖపట్నం (Visakpatnam). అదో అందమైన నగరం. పర్యాటకంగా ఎంతో పేరున్న నగరం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు కార్యనిర్వాహక రాజధానిగా (AP Executive Capital) అభివృద్ధి చెందుతోంది. స్మార్ట్ సిటీగా అభివృద్ధిలో ముందుకు వెళ్తోంది. ఐతే నగరంలో చాలా చోట్ల సమస్యలు తిష్టవేశాయి. కొన్నిచోట్ల తాగునీరు, మరికొన్ని చోట్ల రోడ్లు, డ్రెయినేజీలు ఇలా విశాఖవాసులు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇన్ని సమస్యలు వదిలేసి విశాఖలో కుక్కలకు పార్కు (Dogs Park) నిర్మించడం వివాదాస్పదమవుతోంది. దీనికి దాదాపు రూ.2కోట్లు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. నగరంలో చాలా సమస్యలుంటే కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుక్కలకు పార్కు నిర్మించడం అవసరమా అని విపక్షాలు పండిపడుతున్నాయి. ఇటీవల జరిగిన జీవీఎంసీ సమావేశంలో ఇదే అంశంపై రచ్చ అయింది. ప్రజాసమస్యలు గాలికొదిలేసి ఇదేంటని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.

  విశాఖలో జీవిఎంసీ ఫెయిల్ అయ్యిందని చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలని.. వామపక్ష నేతలు ఏకంగా నడిరోడ్డు పై కుక్కలతో నిరసన వ్యక్తం చేశారు. రకరకాల వ్యాధులతో.. ఇతరత్రా సమస్యలతో చచ్చిపోతున్న మనుషుల్నే కాపాడలేని జీవిఎంసీ.. ఇప్పుడు కుక్కలకి పార్క్ పెట్టడమేంటని విసుక్కుంటున్నారు. దోమల్ని నివారించేలని అధికారులు.. కుక్కల కోసం కోట్ల రూపాయల్ని కేటాయిస్తారా.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

  ఇది చదవండి: ఆన్ లైన్లో పరిచయమయ్యాడు... అన్నిరకాలుగా దగ్గరయ్యాడు.. ఆ తర్వాత న్యూడ్ ఫోటోలతో...


  విశాఖలోని సుజాతనగర్లో రూ.2కోట్లతో కుక్కల పార్కు నిర్మించేందుకు.. విశాఖ జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ కార్యాలయం ఎదుట కుక్కలతో నిరసన తెలియజేశారు. నగరంలో ప్రస్తుతం జ్వరాలు ప్రబలుతున్నాయని.. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోకుండా.. కుక్కల గురించి ఆలోచించడం ఏంటని ప్రశ్నించారు.

  ఇది చదవండి: 15 ఏళ్ల క్రితం లవ్ ఫెయిల్యూర్.., కరోనా వల్ల మళ్లీ కలిశారు.. కానీ ఇలా చేశారేంటీ..?


  ప్రజలకే పార్కులకు దిక్కు లేదు.. ఉన్న పార్కులను అభివృద్ధి చేయకుండా.. కుక్కల కోసం పార్కులు కడతారా అని పలువురు నిలదీస్తున్నారు. అన్ని అంశాల్లోనూ పన్నులు విధిస్తూ జనం సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. ముందు మనుషుల గురించి ఆలోచించాలని సూచించారు. వెంటనే కుక్కల పార్కు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

  ఇది చదవండి: దసరాకు దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా..? అయితే ఇవి గుర్తుంచుకోండి.


  ఐతే ఈ అంశంపై ప్రభుత్వ వివరణ మరోలా ఉంది. ఇది కుక్కల పార్కు కాదని కేవలం థీమ్ పార్క్ మాత్రమేనని చెబుతోంది. నగరంలో పలు చోట్ల థీమ్ పార్కులు నిర్మిస్తున్నామని.. ఇవి ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా విజ్ఞానం అందించేవిగా ఉంటాయని వివరిస్తోంది. కేవలం డాగ్స్ పార్క్ మాత్రమే కాకుండా.. బటర్ ప్లై పార్కు, పంచతత్వ పార్క్, ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్, ఆయుర్వేదిక్ పార్కు, హెర్బల్ పార్కు, యోగా అండ్ మెడిటేషన్ పార్క్ వంటి పార్కులు కూడా నిర్మిస్తున్నామన్నారు.

  ఇది చదవండి: ట్రైన్లో కలిసిన టీటీఐతో ఎఫైర్... నాలుగేళ్లలో రూ.14కోట్ల బిజినెస్.. కట్ చేస్తే కటకటాల్లోకి.. అసలేం జరిగిందంటే..!


  ప్రస్తుతం విశాఖనగరం 626 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. నగరంలో 22.5 లక్షల మంది జనాభా నివశిస్తున్నారు. స్మార్ట్ సిటీ ప్లాన్ లో భాగంగా నగరంలో పచ్చదనం పెంచడంతో పాటు థీమ్ పార్కుల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నామని జీవీఎంసీ వెల్లడించింది. అన్ని థీమ్ పార్కులు ఓకే మరి కుక్కల పార్కుపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో జీవీఎంసీ వెనక్కి తగ్గుతుందా..? లేదా ముందుకు వెళ్తుందా..? అనేది వేచి చూడాలి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Dog, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు