Andhra Pradesh: గోమాతకు ఘనంగా సీమంతం.. కూతురు లేని లోటును ఇలా తీర్చుకున్న దంపతులు..

గోమాతకు సీమంతం చేసిన దంపతులు

Baby Shower to Cow: శ్రీకాకుళం జిల్లాలో వింతఘటన చోటు చేసుకుంది. కన్నకూతురిలా చూసుకుంటున్న గోవుకు యజనమాలు సీమతం నిర్వహించారు.

  • Share this:
    కూతురు తల్లి కాబోంతుందని ఆమెని కన్న తల్లిదండ్రులు పొందే ఆనందం వెలకట్టలేనిది. తమ బిడ్డకు సీమంతం చేసి ఊరిలో ఉన్న ముత్తయిదువులను పిలిచి ఆడంబరంగా సీమంతం పండుగ చేస్తుంటారు తల్లిదండ్రులు. కన్న కూతురు కాబట్టి అది బాధ్యతగా ఫీలయ్యి తల్లిదండ్రులు అలా సీమంతం చేయండం కామన్ గా జరుగుతుంటుంది. కానీ తమ ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా, కూతురుగా భావించి ఒక గోవుకు సీమంతం చేసి పెద్ద మనసు చాటుకున్నారు యజనమాలు. సాధారణంగా తమ ఆడపిల్లలు గర్భం దాల్చితే.. తమ కూతురు తల్లి కాబోతుందన్న ఆనందంలో ఎటువంటి అశుభం కలగకూడదని భావించి తల్లిదండ్రులు తమ ఆడబిడ్డలకు సీమంతం జరిపిస్తారు. కానీ గోవుకు సీమంతం చేయడాన్ని అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఓ వింతైన ఘటన శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మండలం సింగన్నవలస గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలోని సూరాబత్తుల ఆశాజ్యోతి కుటుంబం తమ ఇంట్లో పుట్టిన ఓ లేగ దూడను కన్న కూతురులా భావించి.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు.

    శుక్రవారం పుట్టడంతో ఆ లేగదూడకు మహాలక్ష్మి అనే పేరు పెట్టుకున్నారు. తమకు ఆడపిల్ల లేకపోవడంతో ఈ గోవునే తమ కన్న కూతురిలా భావించి పెంచుకున్నారు. ఇప్పుడు దాని వయసు మూడేళ్ల మూడు నెలలు. కాగా ఇటీవల ఆ గోమాత గర్భం దాల్చడంతో ఆ గోవుకు సాంప్రదాయ బద్దంగా సీమంతం చేయాలని ఆశాజ్యోతి కుటుంబం భావించింది. అనుకున్నదే తడవుగా సింగన్న వలసలో ఉన్న తమ బంధువులను , గ్రామస్తులను తమ గోవుకు సీమంతం కార్యక్రమానికి ఆహ్వనించింది. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరీ బంధువులను, గ్రామస్తులను ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం ఆ గోమాతను వయసున్న ఓ గోమాతను బొట్టు పెట్టి, చీరకట్టి, గాజులు వేసి, పట్టీలు తొడిగి, మెడలో దండ వేసి సిద్దం చేసారు. తమ ఇంట్లో ఆడబిడ్డలకు సీమంతం చేస్తారో అలానే సిద్దం చేసి సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ గోమాతకు ఆభరణాలు, పట్టు వస్త్రాలు పెట్టి ఆడబిడ్డలా అన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహించారు.

    ఇది చదవండి: ఏడుకొండలపై మరో వివాదం...? టీటీడీ నిర్ణయంతో కొత్త తలనొప్పులు తప్పవా..?

    ఇలా ఓ ఆడబిడ్డకు సీమంతం నిర్వహించినట్టుగా హిందూ ధర్మం సాంప్రదాయం ప్రకారం గోవుకు సీమంతం చేయడం సంతోషంగా ఉందని సూరాబత్తుల ఆశాజ్యోతి అంటున్నారు. శుక్రవారం పుట్టిన తమ గోవుకు మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నామని, శుక్రవారమే సీమంతం కార్యక్రమాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని ఆమె అంటున్నారు. తాము ఏ కార్యక్రమం చేపట్టినా.. మొట్టమొదట తమ అద్ళష్టంగా భావిస్తున్న గోవు.. ఎదురుగా వస్తే తమకు శుభం కలుగుతోందని ఆమె ఎంతో సంతోషంగా చెబుతున్నారు.
    Published by:Purna Chandra
    First published: