• HOME
 • »
 • NEWS
 • »
 • ANDHRA-PRADESH
 • »
 • VISAKHAPATNAM CORONA VIRUS EFFECT ON MARRIAGES IN ANDHRA PRADESH MARRIAGE START FROM MAY 1ST ON WARD NGS

Andhra Pradesh: మే 1 నుంచి వరుస పెళ్లి ముహూర్తాలు. ఇకపై వివాహాలు ఇలా జరుపుకోవాల్సిందే?

Andhra Pradesh: మే 1 నుంచి వరుస పెళ్లి ముహూర్తాలు. ఇకపై వివాహాలు ఇలా జరుపుకోవాల్సిందే?

ఏపీలో వివాహాలపై కరోనా కాటు

ఏపీని కరోనా వైరస్ వెంటాడుతోంది. దీంతో ఆ ప్రభావం వివాహాలపై పడుతోంది. మే 1వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా ఇళ్లల్లో పెళ్లి సందడి మొదలైంది. అన్నిటికీ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. కానీ ఇప్పుడు కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అసలు పెళ్లిళ్లు ఎలా చేయాలని తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు.

 • Share this:
  వివాహాలపైనా కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా ఏపీని కరోనా కాటు వేస్తోంది. రోజు రోజకూ పాజిటివ్ నిర్ధారణ అయిన వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. ఒక్క రోజులో నమోదైన కేసుల సంఖ్య ఇప్పటికే పదివేల మార్కుకు చేరువైంది. ఇటు మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు అవుతోంది. ఏపీలో ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి లేదు. కానీ చాలా చోట్ల ఆంక్షలు అయితే అమలవుతున్నాయి. చాలా గుంటూరు. విజయనగరం లాంటి జిల్లాల్లోని చాలా పట్టణాల్లో స్వచ్ఛంద లాక్ డౌన్ విధిస్తున్నాయి వ్యాపారా సంఘాలు. ఇదే పరిస్థితి కొనసాగితే లాక్ డౌన్ తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. ఒకవేళ లాక్ డౌన్ లేకపోయినా ఆంక్షలు అయితే అమలు అవుతున్నాయి. భౌతిక దూరం తప్పక పాఠించాల్సిన పరిస్థితి ఉంది. దీనికి తోడు ప్రజలు కూడా బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఓ వైపు మాడు పగిలే ఎండలు. మరోవైపు వెంటాడే వైరస్ దీంతో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు.

  ప్రజలంతా గజగజా వణుకుతున్న సమయంలో వివాహ వేడుకులపై కరోనా కత్తి వేలాడుతోంది. సెకెండ్ వేవ్ లో భాగంగా కరోనా పాజిటివ్‌ కేసులు ఊహించని విధంగా రెట్టింపు అవుతున్నాయి. దీంతో వివాహాల నిర్వహణపై పూర్తి సందిగ్ధం నెలకొంది. మే ఒకటి నుంచి వివాహాలకు ముహూర్తాలు తరముకొస్తున్నాయి. గత ఏడాది కూడా కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో చాలా వివాహాలకు బ్రేక్‌ పడింది. అప్పట్లో మార్చి నుంచి కరోనా వ్యాప్తి చెందడంతో చాలామంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు.

  అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల నుంచి కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ఆ నెలల్లో కొందరు వివాహాలు చేసుకున్నారు. ఆ వెంటనే అంటే ఈ ఏడాది 70 రోజుల పాటు శుక్రమూఢం వచ్చింది. దీంతో వివాహాలకు పూర్తిగా బ్రేకులు పడ్డాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టిందని భావించి.. ఈ ఏడాది మే నెలలో మంచి ముహూర్తాలు ఉండడంతో.. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని నిశ్చయించారు. ముహూర్తాలు నిర్ణయించుకుని కల్యాణ మండపాలు, బ్యాండు మేళాలు, లైటింగ్‌, డెకరేషన్‌, కేటరింగ్‌లకు అడ్వాన్సులు ఇచ్చేశారు.

  గత నెల నుంచే చాలామంది ఇళ్లలో పెళ్లి సందడి మొదైలైంది. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అడ్వాన్సులు ఇవ్వడం, నగలు, బట్టలు తీసుకోవడం, ఆహ్వాన పత్రకలు ఇవ్వడం లాంటి పనులతో బిజీ అయ్యారు. ఇలా అంతా హ్యాపీగా ఉంది అనుకున్న సమయంలో మళ్లీ కరోనా కాటు వేస్తోంది. రోజూ వేలాది సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే అసలు అనుకున్న ముహూర్తానికి వివాహాలు జరుగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం రోజు రోజుకూ కొవిడ్‌ నిబంధనలు కఠినతరం చేస్తుండడంతో వివాహాలు ఎలా నిర్వహించేది అని భయపడుతున్నారు. గతేడాది కన్నా పరిస్థితి దారుణంగా ఉండడంతో వివాహాలు వాయిదా వేసుకునే పరిస్థితులే ఎక్కువ కనిపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

  మరోవైపు వివాహాలు నిలిచిపోతే తమ ఉపాధి పోతుందని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. కల్యాణమండపం, కేటరింగ్‌, లైటింగ్‌, డెకరేషన్‌, కిరాణా దుకాణాలు ఇలా అనేక మంది వివాహాలపై ఆధారపడే వారు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆవేదనకు గురవుతున్నారు. గతేడాది లాగే ఈ ఏడాది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అధికంగా బ్యాంక్‌లు, పైవేటు వ్యక్తుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టడంతో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడతామని భయపడుతున్నారు.

  ఇలాంటి సమయంలో వివాహాలు చేయడం కత్తిమీద సామే అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. దగ్గర బంధువులు కూడా వస్తారనే నమ్మకం కలగడం లేదు. అసలు పిలవాలి అన్నా భయపడుతున్నారు. అయినా కావాల్సిన కొంతమందినైనా పిలవకుండా.. సరదా సందడి లేకుండా పెళ్లిల్లు ఏంటని కొందరు చింతిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కరోనా కూడా భయపెడుతోంది. దీంతో అతికొద్దిమంది సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో పెళ్లిల్లు చేయడం కంటే.. వాయిదా వేసుకోడమే బెటరని మరికొందరు సూచిస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: