VISAKHAPATNAM CORONA FEAR OF PEOPLE THE OLD WOMAN WAS LEFT ORPHANED ON ROAD IN VISAKHAPATNAM NGS VZM
Andhra Pradesh: కరోనా భయంతో అమానుషం. అనాథలా అంతా వదిలేసినా. వదిలి వెళ్లని పెంపుడు పిల్లి
విశాఖపట్నంలో అమానుషం
కరోనా మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. రక్త సంబంధీకులును దూరం చేస్తోంది. అందరూ ఉన్నా చనిపోతే అనాథలుగా మిగలాల్సి వస్తోంది. ఇటీవల ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి.
కరోనా మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. జాలీ, మానవత్వం అన్నవి లేకుండా చేస్తోంది. కరోనా ఉందని తెలిస్తే సొంత అమ్మనాన్నలను కూడా బిడ్డలు పట్టించుకోవడం లేదు. బిడ్డలకు పాజిటివ్ అని తెలిస్తే తల్లిదండ్రలు పట్టించుకోవడం లేదు. ఇక పాపం కరోనా కారణంగా ఎవరైనా చనిపోతే అనాథగా రోడ్డుపై మిగలాల్సి వస్తోంది. ఇటీవల మానవత్వాన్ని ప్రశ్నించే ఎన్నో ఘటనలు భయపెడుతున్నాయి. అసలు మనిషి అన్నవాడు ఏమైపోయాడు అన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అక్కడక్కడా సాయం చేసే చేతులు మేమున్నామని కనిపిస్తున్నా.. రక్త సంబంధానికి కూడా మరిచిన దారుణాలే ఎక్కువ అవుతున్నాయి.
తాజాగా విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం, మద్ది గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. ఇటీవల ఓ వృద్ధురాలకు కరోనా పాజిటివ్ నిర్ధారనైంది. దీంతో ఆమెను ఎవరూ పట్టించుకోవడం మానేశారు. చికిత్స సంగతి దేవుడెరుగు.. కనీసం నాలుగు ముద్దల అన్నం పెట్టే దిక్కు కూడా లేకుండా చేశారు. గత నాలుగైదు రోజులుగా తిండిలేక ఆ వృద్ధురాలు చనిపోయింది. అయితే ఆమె చనిపోయి రెండు రోజులు దాటినా కరోనా భయంతో ఎవరూ ఆమె దగ్గరకు వెళ్లలేదు. దీంతో అందరూ ఉన్నా ఆ అందరూ ఉన్నా వృద్ధురాలు అనాధగా మిగిలిపోయింది. నడి రోడ్డుపైనే ఉన్న ఆ శవానికి చీమలు కూడా పట్టాయి. ఆమెను రక్త సంబంధీకులు పట్టించుకోకపోయినా.. ఆమె పెంచిన ఓ పెంపుడు పిల్లి మాత్రం ఆ వృద్ధురాలి భౌతికాయాన్ని వదిలి వెళ్లడం లేదు.. అక్కడే కాపాల ఉంటోంది.
ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోనీ మానవత్వం మంటగలిపే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా ఇలాంటి ఘటనలే గత రెండు రోజులుగా జరుగుతున్నాయి. ఆస్పత్రిలో కరోనా కారణంగా చనిపోయిన వారి కోసం వారి బంధువులు రావడం లేదు. చనిపోయరని తెలియగానే అప్పటి వరకు ఆస్పత్రికి వచ్చిన బంధువులు తరువాత మాయమైపోతున్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బందే వారికి అంత్యక్రియలు చేయాల్సి వస్తోంది. గుంటూరు జిల్లాల్లో ఓ హిందూ మహిళ అంత్యక్రియలు చేయకుండా బంధువులు వదిలేయడంతో ముస్లిం యువకులు అంత్యక్రియలు చేశారు.
గుంటూరు జిల్లా మండల కేంద్రమైన దుగ్గిరాలలో 48 ఏళ్ల మహిళ కరోనాతో చనిపోవడంతో కుటుంబీకులు భౌతికకాయాన్ని ముట్టుకునేందుకు భయపడిపోయారు. సామాజిక మాధ్యమాల ద్వారా గుంటూరు కోవిడ్ ఫైటర్స్ గురించి తెలుసుకుని వారిని సంప్రదించారు. దీంతో కోవిడ్ ఫైటర్స్‌కు చెందిన పఠాన్ అల్లాభక్షు, పఠాన్ ఫిరోజ్‌ఖాన్, హబీబ్ అన్సారీ, పఠాన్ ముజీబ్‌బాషా తమ సొంత అంబులెన్స్‌లో దుగ్గిరాల వెళ్లారు. సదరు మహిళ భౌతిక కాయాన్ని తెనాలి శ్మశానవాటికకు తరలించి, హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
గతేడాది నుంచి ఇప్పటివరకు తాము కరోనాతో చనిపోయిన 223 మందికి అంత్యక్రియలు చేశామని వారు తెలిపారు. కరోనాతో చనిపోయిన వారికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేసే పరిస్థితి లేనప్పుడు.. తమను సంప్రదిస్తే ఆ కార్యం నెరవేరుస్తామని చెప్పారు. సో ఎవరికైనా ఇలాంటి అమానుష ఘటనలు కనిపిస్తే వెంటనే 8143222456, 9848940304 నంబర్లలో తమను ఎవరైనా సంప్రదించాలని వారు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.