Home /News /andhra-pradesh /

Andhra Pradesh: మరికొన్ని రోజుల్లో పెళ్లి అంతలోనే విషాదం నింపిన కరోనా. తండ్రి, కొడుకు మృతి

Andhra Pradesh: మరికొన్ని రోజుల్లో పెళ్లి అంతలోనే విషాదం నింపిన కరోనా. తండ్రి, కొడుకు మృతి

పెళ్లింట కరోనా కాటు

పెళ్లింట కరోనా కాటు

కరోనా మహమ్మారి కొత్త రూపం దాల్చింది. గతంలో ఒకటి రెండు మరణాలతో సరిపెట్టుకున్న వైరస్.. ఇఫ్పుడు భారీగా మరణాలు నమోదు అయ్యేలా చేస్తోంది. ముఖ్యంగా కుటుంబాలపై పగ బట్టినట్టు ఉంది. అందుకే ఒకరికి ఇద్దర్ని తోడు తీసుకెళ్తోంది మాయదారి కరోనా.

  కుటుంబాలపై కరోనా పడగ విప్పింది. సెకెండ్ వేవ్ లో కరోనా మరింతంగా  వేగంగా దూసుకొస్తుంది. . ఒక్కరిని బలితీసుకోడానికి పరిమితం అవ్వడం లేదు. మరొకరి ప్రాణాన్ని కూడా తోడుగా తీసేస్తోంది. అయితే త్వరలోనే వివాహ వేడుకలకు సిద్ధమవుతున్న ఇళ్లపైనా కరోనా పంజా విసురుతుతోంది. విశాఖ జిల్లాలోని ఓ ఇంట్లో మరి కొద్ది రోజుల్లో వివాహం జరుగుతోందని అంతా హ్యాపీగా ఉన్నారు. ఓ వైపు కరోనా మహ్మమ్మారి పెళ్లి వేడుకలకు అటంకం కలిగిస్తుందని తెలియడంతో సింపుల్ గా పెళ్లి తంతు జరిపించాలని.. ఉన్న అతి కొద్ది బంధువుల సమక్షంలో పెళ్లిని హ్యాపీగా జరుపుకోవాలని అంతా లెక్కలు వేసుకుంటున్నారు. ఇలా కుటుంబ అంతా హ్యాపీగా ఉంది అనుకున్న సమయంలో ఆ ఇంట్లో పెను విషాదం నింపింది కరోనా.

  మొదట కరోనా సోకి కొడుకు మృతి చెందాడు. ఆ వార్త తెలిసి తట్టుకోలేకపోయిన తండ్రి గుండెపోటుతో మరణించారు. మాకవరపాలెం మండలం తామరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 58 ఏళ్ల ముళ్లపూడి రాజారావు అదే గ్రామంలోని ప్రాథమి క పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వారం రోజుల కిత్రం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌ వచ్చింది. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి 86 ఏళ్ల సుబ్బారావు మధ్యాహ్నం గుండెపోటుతో మృతిచెందారు. ఒకే రోజున తండ్రీ కొడుకులు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సుబ్బారావు కూడా సుదీర్ఘకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు.

  కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఆ ఇంట్లో త్వరలోనే పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఉపాధ్యాయుడు రాజారావుకు కొడుకు, కూతురు ఉన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కొడుకు పవన్‌ కుమార్‌కు వివాహం నిశ్చయించారు. మే 13న రాజమండ్రిలో వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ పెళ్లి కోసమే 20 రోజుల కిందట విశాఖలో షాపంగ్ పూర్తి చేశారు. అలా షాపింగ్ వెళ్లి వచ్చిన తరువాత రాజారావుకు జ్వరం వచ్చింది.. అతడికి టెస్టు చేయగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని కుటుంబీకులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో తండ్రీ కొడుకులు మరణించడం అందరినీ కలచివేస్తోంది. పెళ్లిబాజా మోగాల్సిన ఆ ఇంట్లో చావుమేళం ఇప్పుడు విషాదం పెను విషాదం నింపింది.

  వివాహాలపై కరోనా పగ బట్టినట్టు ఉంది. గతేడాదిన భారీగా ముహూర్తాలు ఉన్నా.. కరోనా భయంతో అంతా ఆ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. తరువాత మూఢం కారణంగా ముహూర్తాలు లేకుండా పోయాయి. మే ఫస్ట్ నుంచి మళ్లీ ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి అనుకన్న సమయంలో మళ్లీ కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ కేసులు సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే కొన్ని ఆంక్షలు ఉన్నాయి. దీంతో పరిమితంగా పెళ్లిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితి కానీ ఏపీలో పెరుగుతున్న కేసులు సంఖ్య చూస్తే మళ్లీ లాక్ డౌన్ తప్పదేమో అనే భయం వెంటాడుతోంది. దీంతో పెళ్లిళ్లు వాయిదా వేసుకోవడమే బెటర్ అంటున్నారు కొందరు నిఫుణులు..

  మీ నగరం నుండి (విశాఖపట్నం)

  ఆంధ్రప్రదేశ్
  విశాఖపట్నం
  ఆంధ్రప్రదేశ్
  విశాఖపట్నం
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Corona cases, Corona dead boides, Corona patient, Corona positive, Visakha, Visakhapatnam, Vizag

  తదుపరి వార్తలు