హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: అక్కడ బీచ్‌లో దొరికే ఈ జొన్న పొత్తు చాలా ఫేమస్‌..! దానికి అంత రుచి ఎందుకంటారా..!

Vizag: అక్కడ బీచ్‌లో దొరికే ఈ జొన్న పొత్తు చాలా ఫేమస్‌..! దానికి అంత రుచి ఎందుకంటారా..!

వైజాగ్

వైజాగ్ ఆర్కే బీచ్‌లో ఆకట్టుకుంటున్న మొక్కజొన్న పొత్తులు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఉన్న నగరాల్లో విశాఖపట్నం (Visakhpatnam) నగరానికి వాణిజ్య పరంగానే కాకుండా, పర్యాటకంగా కూడా ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పర్యాటకులకు సెలవు రోజులలో ఆహ్లాదకరంగా, సరదాగా గడిపేందుకు ఇది సరైన ప్రదేశం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఉన్న నగరాల్లో విశాఖపట్నం (Visakhpatnam) నగరానికి వాణిజ్య పరంగానే కాకుండా, పర్యాటకంగా కూడా ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పర్యాటకులకు సెలవు రోజులలో ఆహ్లాదకరంగా, సరదాగా గడిపేందుకు ఇది సరైన ప్రదేశం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, దేశ, విదేశాల నుండి టూరిస్టులు, ప్రతి ఏటా అధిక సంఖ్యలో విశాఖను సందర్శిస్తూ ఉంటారు. విశాఖపట్నం వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడి ప్రముఖ బీచ్‌లను సందర్శించకుండా వెళ్లరు. తెల్లవారుజామున 4 గంటలు నుండి వాకింగ్ మొదలుకొని, సాయంత్రం వేళ సేద తీరే వరకూ ఇక్కడ అధిక సంఖ్యలో పర్యాటకులు తిరుగతూనే ఉంటారు. సుందర సాగర్ తీరంలో కొన్ని రుచికరమైన ఫుడ్‌లు ఫేమస్‌గా నిలుస్తున్నాయి.

  అందులో RK బీచ్‌లో జొన్న పొత్తు అంటే చాలా ఫేమస్.. ఇక్కడికి వచ్చిన ప్రతి పర్యాటకులు జొన్న పొత్తులను తినకుండా వెళ్లరు. సుందర సాగర తీరాన్ని చూసుకుంటూ జొన్న పొత్తు తింటుంటే ఆ ఫీల్‌ వేరేలెవల్‌లో ఉంటుందని పర్యాటకులు అంటున్నారు.

  ఇది చదవండి: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పురమందిరం..! దీని హిస్టరీ తెలిస్తే షాకవ్వాల్సిందే..!

  విశాఖ బీచ్‌లో జొన్నపొత్తులకు అంత రుచి ఎలా..!

  ఏజన్సీ ప్రాంతాల నుండి ఆర్గానిక్ పద్దతిలో పండిస్తున్న జొన్న పొత్తు కావడం తో ఎంతో టేస్టీగా ఉంటుంది. అధిక శాతం మహిళలు ఇక్కడ జొన్న పొత్తుల అమ్మకాలు చేస్తూ ఉంటారు. ఏ వయసు వారు వచ్చినా దీన్ని చూస్తే నోరూరుతుంది. ఆర్.కే బీచ్ మొదలుకొని భీమిలి బీచ్‌కి వెళ్ళే వరకు ఈ జొన్న పొత్తులు దారిపొడుగునా కనిపిస్తాయి.

  ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

  చల్లని సాగర తీరాన జొన్న పొత్తు తింటే ఆ కిక్కే వేరంటున్నారు పర్యాటకులు. ఏజన్సీ పరిసర ప్రాంతాలు నుండి వాటి సమీప ప్రాంతాలైన దేవరపల్లి, చీడికాడ, మండలాలు మొదలైన ప్రాంతాలలో ఆర్గానిక్ పద్దతిలో పండిస్తున్న రైతుల వద్ద కొనుక్కొన్ని తెస్తున్నాము అని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంతటి గొప్ప రుచికరమైన పొత్తులు ఒక్క విశాఖపట్నంలో గల వివిధ బీచ్‌లలో మాత్రమే చూడగలరు... తినగలరు.

  విశాలమైన సాగరతీరం నోరూరించే ఆహార వంటకాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, సీ ఫుడ్స్‌, మూరి మిక్సర్ , ఐస్ క్రీమ్స్ ఇలా పర్యాటకులకు దొరకనిదంటూ ఇక్కడ ఏదీ లేదు. అయితే వాటిలో మొక్కజొన్న పొత్తులు మాత్రం అందరికీ ఆల్‌ ఏజ్‌ గ్రూప్‌లకు ఫేవరెట్‌ ఐటమ్‌. అడ్రస్‌: రామకృష్ణ బీచ్‌, వైజాగ్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌- 530003

  Vizag RK Beach Map

  ఎలా వెళ్లాలి: విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఆర్కే బీచ్‌కి చేరుకోవాలి. ఆటో బస్సు సౌకర్యం కలదు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు