P Anand Mohan, News18, Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ముఖ్యమైన నగరాల్లో విశాఖపట్నం (Visakhapatnam) ఒకటి. వైజాగ్ లో ల్యాండ్ మార్క్స్ అంటే బీచ్, కైలాసగిరితో పాటు జగదాంద సంటర్ ముఖ్యమైనది. జగదాంబ థియేటర్ వల్లే ఆ ప్రాంతానికి జగదాంబ సెంటర్ అనే పేరు వచ్చింది. అంతటి ఫేమస్ అయిన జగదాంబ థియేటర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. అంతేకాదు ఏకందా థియేటర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలంటూ ఫిర్యాదు కూడా అందించింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖకు చెందిన వేగి వీరి నాయుడు జగదాంబ, శారద, రమాదేవి థియేటర్ వారసుల్లో ఒకరు. ఆయనే థియేటర్ల లైసెన్స్ రద్దు చేయాలంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. థియేటర్ కు సంబంధించిన వాటాదారుల వివాదం నేపథ్యంలో స్పందన కార్యక్రమం ద్వారా కంప్లైంట్ చేయడం విశాఖలో చర్చనీయాంశమైంది.
తాను ను జగదాంబ, శారద మరియు రమాదేవి మూవీ థియేటర్స్ యొక్క వాటాదారులలో ఒకడినని.. అలాగే థియేటర్ల ఆస్తికి చట్టపరమైన వారసుడినని.. తన ప్రమేయం లేకుండానే థియేటర్ లైసెన్సుల్లో మార్పులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రారంభంలో తన తండ్రి సోదరులు "వేగి వెంకటేశ్వరరావు అండ్ బ్రదర్స్" సంస్థ పేరు మీద లైసెన్స్ పొంది థియేటర్లను నడిపేవారని.. తన తండ్రి మరణం తర్వాత ఆయన సోదరుడు భద్రాచలం థియేటర్ నడిపేవారని.. ఆయన చనిపోయిన తర్వాత వారి వారసులైన వేగి వెంకటేశ్వరరావు సోదరులపై నడించిందన్నారు. కొన్నాళ్లక శారద, రమాదేవి థియేటర్ల లైసెన్సులను ఎలాంటి డాక్యుమెంట్ ఆధారం లేకుండానే వేగి భద్రాచలంపైరు మీద లైసెన్స్ జారీ జారీఅయిందన్నారు.
ఐతే తమ అనుమతి లేకుండా జగదాంబ థియేటర్ లైసెన్స్ జగదీష్ కుమార్ అనే వ్యక్తిపేరిట నమోదైందని.. అతడకి చట్టవిరుద్ధంగా లైసెన్స్ బదిలీ అయిందని.. కావున వెంటనే క్యాన్సిల్ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మూడు థియేటర్ల లైసెన్సులు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.
ప్రస్తుతం వైజాగ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఫిర్యాదుపై అధికారులు స్పందించి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే విశాఖలో ఐకానిక్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకంగా మారే అవకాశముందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఐతే ఫిర్యాదును స్వీకరించిన అధికారులు మాత్రం ఇంకా స్పందించలేదు. అన్నీ పరిశీలంచి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారా.. లేక వారసత్వ వివాదం కింద పరిగణించి కోర్టులో తేల్చుకోమంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా వారసత్వ వివాదంలో జగదాంబ థియేటర్ చిక్కుకోవడం విశాఖ వాసులను, సినీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Visakhapatnam