Constable Cheating: నలుగురు భార్యలు.. ఐదుగురు పిల్లలు.. నిత్యపెళ్లికుడుకైన కానిస్టేబుల్..

భార్యతో అప్పలరాజు (ఫైల్)

Cheating Police: అతడో పోలీస్. ప్రజలకు రక్షణ కల్పించడం అతడి విధి. ముఖ్యంగా మహిళలకు పోలీసులు అండగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి ఓ పోలీస్ నిత్య పెళ్లికొడుకుగా మారాడు.

 • Share this:
  అతడో పోలీస్. ప్రజలకు రక్షణ కల్పించడం అతడి విధి. ముఖ్యంగా మహిళలకు పోలీసులు అండగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి ఓ పోలీస్ నిత్య పెళ్లికొడుకుగా మారాడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తనను పెళ్లాడిన వారిని దారుణంగా మోసం చేయడం.., సీక్రెట్ గా మరో పెళ్లి చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. అంతేకాదు నలుగురు మహిళలకు భర్తవడమే కాదు ఐదుగురు పిల్లలకు తండ్రయ్యాడు కూడా. బాధితుల్లో ఓ భార్య ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో నలుగురు పెళ్లాల ముద్దుల పోలీస్ బండారం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నంకు (Visakhapatnam)  చెందిన అప్పలరాజు సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అప్పలరాజుపై పద్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లిపేరుతో మహిళలను మోసం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

  అప్పలరాజుకు గతంలోనే సునీత అనే మహిళతో పెళ్లైందని.. మొదటి భార్య ఉండగానే 2008లో తనను రెండో పెళ్లి చేసుకున్నాడని పద్మ ఆరోపించారు. ఆ తర్వాత 2014లో స్వర్ణ మూడో పెళ్లి, 2018లో లావణ్య అనే మహిళను నాలుగో పెళ్లి చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తనను మోసం చేసి నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ రెండో భార్య పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన కొడుకు స్నేహితుడైన బీటెక్ స్టూడెంట్ తో అక్రమ సంబంధం అంటగట్టాడని ఫిర్యాదులో పేర్కొంది.

  ఇది చదవండి: నెలల తరబడి ఇంటికి రాని భర్త.. అనుమానం వచ్చి ఆరాతీయగా షాకింగ్ నిజం..


  గతంలో పిల్లలంటే ఇష్టం లేదంటూ తనకు నాలుగుసార్లు అబార్షన్ చేయించినట్లు తెలిపింది. ఇప్పుడు మరో మహిళా కానిస్టేబుల్ తో పెళ్లికి సిద్ధమైనట్లు ఆమె ఆరోపించింది. ఇప్పటివరకు నలుగురు మహిళలను పెళ్లిళ్లు చేసుకోని మోసం చేసిన అప్పలరాలు.. వారితో ఐదుగురు పిల్లల్ని కన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు అప్పలరాజును సస్పెండ్ చేసి అతడిపై దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  ఇది చదవండి: ఏపీలో స్కూళ్ల మూత తప్పదా... ఒకే బడిలో 72మంది విద్యార్థులకు పాజిటివ్...


  గతలో ఓ మహిళ...
  విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన నంబారు రేణుక అనే మహిళ పెళ్లికి ముందే శ్రీనివాస్ అనే వ్యక్తితే ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత జగదీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఐతే పెళ్లైన మూడు రోజులకే ఆమె గర్భవతి అని తేలడంతో భర్త ఆమెను వదిలేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శ్రీనివాస్ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈలోగా రేణుక పాపకు జన్మనిచ్చింది.

  ఇది చదవండి: సీఐగారి స్వామి భక్తి.. వైసీపీ ఎమ్మెల్యే కేజీఎఫ్ స్టైల్లో పొగడ్తలు..  ఐతే రేణుకను వదిలించుకునే క్రమంలో శ్రీనివాస్ పిన్నికొడుకైన ఆర్మీ ఉద్యోగి ప్రసాద్ ను రేణుక ద్వారా ముగ్గులోకి దించాడు. ప్రియుడి ప్లాన్ ను పక్కాగా అమలు చేసిన రేణుక.. ప్రసాద్ ను ముగ్గులోకి దించింది. పెద్దలకు చెప్పకుండా అతడ్ని సీక్రెట్ గా పెళ్లి చేసుకునేలా చేసింది. ఉద్యోగ రీత్యా లక్నోలో ఉంటున్న ప్రసాద్ తన వెంటనే భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు లక్షలు విలువ చేసే బంగారం కొనిచ్చాడు. కొంతకాలం తర్వాత జీవీఎంసీలో ఉద్యోగం వచ్చిందని ప్రసాద్ ను నమ్మించిన రేణుక వైజాగ్ వచ్చి ప్రియుడు శ్రీనివాస్ తో సెటిలైంది. భర్త దగ్గర నుంచి బంగారంతో పాటు రూ.45 లక్షలు తీసుకొంది. కొన్ని రోజులకు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న యువకుడ్ని మరో పెళ్లి చేసుకుంది.
  Published by:Purna Chandra
  First published: