Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM COLOMBIAN STUDENT LAIDA SETTLED IN VISAKHAPATNAM AS SHE LOVE THE CITY VERY MUCH FULL DETAILS HERE PRN VNL NJ

మన ఇండియా గొప్పతనం అదే.. అందుకే ఈమె సప్తసముద్రాలు దాటి వచ్చేసింది..!

లైడా

లైడా (ఫైల్)

Vizag: మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, శిల్పకళలు విదేశీయులను సైతం ఆకర్షిస్తుంటాయి. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి.. మనదేశ అందాలను ఆస్వాదిస్తుంటారు. సాంప్రదాయాలను పాటిస్తుంటారు. అంతేకాదు భారతీయ సాంప్రదాయంలో పెళ్లిళ్లు కూడా చేసుకుంటుంటారు.

ఇంకా చదవండి ...
    Neelima Eaty, News18 Visakhapatnam

    మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, శిల్పకళలు విదేశీయులను సైతం ఆకర్షిస్తుంటాయి. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి.. మనదేశ అందాలను ఆస్వాదిస్తుంటారు. సాంప్రదాయాలను పాటిస్తుంటారు. అంతేకాదు భారతీయ సాంప్రదాయంలో పెళ్లిళ్లు కూడా చేసుకుంటుంటారు. అలా ఆసక్తి పెంచుకున్న కొలంబియా యువతి మన దేశానికి వచ్చి ఇక్కడ ఫైన్‌ ఆర్ట్స్‌ చదువుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. కొలంబియా (Colombia) కు చెందిన లైడ అనే స్టూడెంట్ మన ఆంధ్రా యూనిర్సిటీ (Andhra University) లో బీ.ఏ. ఫైన్ ఆర్ట్స్ లో విద్యాభ్యాసం చేస్తోంది. మన దేశానికి చెందిన శిల్ప కళపై ఇష్టం పెంచుకుంది. 2016లో ఇండియాకు టూరిస్ట్ గా వచ్చిన లైడాకు..ఇక్కడ వాతావరణం నచ్చి.. తను చదువుకుంటే ఇండియాలోనే చదువుకోవాలని నిర్ణయించుకుంది. టూరిస్ట్‌ గా వచ్చిన తను మళ్లీ వాళ్ల దేశానికి వెళ్లి.. ఆ తర్వాత ఇండియా (India) లో చాలా యూనివర్సీటిలకు దరఖాస్తు చేసుకోగా.. వైజాగ్‌లోని ఆంధ్రాయూనివర్సిటీలో తనకు సీటు వచ్చిందని విదేశీ విద్యార్థిని లైడ తెలిపారు.

    వైజాగ్‌ చాలా బాగా నచ్చింది : లైడా
    లైడా అనుభవాలు ఆమె మాటల్లో…’’నాకు వైజాగ్ చాలా చాలా నచ్చింది. ఈ నాలుగు సంవత్సరాలు పాటు నేను ఆంధ్ర యూనివర్సిటీ ఇంటర్నేషనల్ హాస్టల్‌లో ఉన్నాను. ఇక్కడ వాతావరణం నాకెంతో నచ్చింది.. మనుషులు నాకు ఆప్తులుగా ఉంటున్నారు. అందుకే నాకు వైజాగ్ మరియు ఇండియా చాలా నచ్చింది.’’

    ఇది చదవండి: పేపర్ తో మ్యాజిక్ చేయాలంటే వీళ్ల తర్వాతే ఎవరైనా.. క్రియేటివిటీతో కేకపుట్టిస్తున్న చిన్నారులు



    భారతీయ కళా సంస్కృతికి ఫిదా
    నాలుగేళ్ళ వయసు నుండి లైడా తన అమ్మతో కలిసి మట్టి కుండల్ని తయారు చేసేది. అలా మట్టితో ఆడుకుంటూ కొత్త కొత్త రూపాలను సృష్టిస్తుంటే వాళ్ల అమ్మ ఎంతగానో ముచ్చటపడేది. కానీ దాన్ని తర్వాత ఎందుకో కంటిన్యూ చేయలేకపోయింది. కానీ ఇండియా విజిటింగ్‌కు వచ్చినప్పుడు ఇక్కడ కళల, శిలా నైపుణ్యాలను చూసి మైమరిపోయిన లైడా..తన చిన్ననాటి కలను నిజం చేసుకోవాలనుకుంది. అప్పుడే ఆంధ్రాయూనివర్సిటీలోని ఫైన్‌ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్‌లో అడ్మిషన్‌ పొందింది. స్పెషలైజేషన్‌గా శిళ్పకళని ఎంచుకుంది.

    ఇది చదవండి: తిమింగలం మ్యూజియం ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పుడు చూడండి..! ఆసక్తికర విశేషాలివే..!


    లైడా చేసిన కళాకృతులు అద్భుతం..!
    లైడా చిత్రాలలో, శిల్పాలలో మన ఆచార, సంప్రదాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టెర్రకోట క్లే అది ఒక రకమైన మట్టిని శిల్పాలు తయారుచేయడానికి వాడుతుంటారు. టెర్రకోట స్పందనను శిల్పకళలో ఒక మాధ్యమంగా యూరోపియన్ బొమ్మల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కొన్ని వస్తువులను తయారు చేసి..వాటిని డేమౌల్డ్ చేసింది. మిగతావి చర్కోల్ పెయింటింగ్, పెన్సిల్ పెయింటింగ్, లెదర్ పెయింటింగ్స్, వాటర్ పెయింటింగ్స్ లో అదరగొట్టింది. అంతేకాదు ఇటీవల ఆంధ్రాయూనివర్సిటీలో ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శనలో.. లైడా తయారుచేసిన మానవుని గుండె కళాకృతి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.



    మా వాళ్లను కలిసి నాలుగేళ్లయింది..!
    "2020లో నేను సరదాగా కొలంబియా వెళ్లి వద్దాము అనుకున్న కానీ ఇంతలో కరోనా వల్ల వెళ్లలేకపోయాను. మా వాళ్లను కలిసి నాలుగేళ్లు అవుతుంది. ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ కోవిడ్ 19 వలన చేయలేకపోయాను." అని చెప్పింది లైడా.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra university, Local News, Visakhapatnam

    తదుపరి వార్తలు