Setti Jagadesh, News18, Visakapatnam
లంబసింగి మన్యంలో చల్లని మంచుతోపాటు ఎర్రగా మండే నిప్పులు పైన వెదురుపుల్లలకు గుచ్చిన చిన్నచిన్న మాంసపు ముక్కలు తింటుంటే ఆ కిక్కే వేరు అంటున్నారు పర్యాటకలు.. దానితోపాటు వాటిపై నిమ్మరసం చుక్కలు వేస్తే ఆ వాతావరణానికి మైమరచిపోతారు. లంబసింగి ఘాట్ రోడ్లో చికెన్ చీకులకు ఉన్న క్రేజీ అలాంటిది. వుమ్మడి విశాఖపట్నం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో లభిస్తున్నా లంబసింగి ఘాట్ రోడ్ లో చికెన్ చీకులకు మాత్రం ప్రత్యేక రుచి అంటున్నారు మాంసాహార ప్రియులు.
చల్లని మంచుఆస్వాదిస్తూ గరం గరం చికెన్ చికులను ఆరగించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే పర్యాటికలు ఈ చీకటి టెస్ట్ చూడకుండా మానరు. స్థానికంగా మసాలాలు తోనే తయారీ.. స్థానికంగా గిరిజనులు పండించే మిరప కారం, ధనియాలు మిరియాలు పసుపు కలిపిన మసాలా దినుసుల్నే చీకుల తయారీకి వినియోగిస్తామని చెబుతున్నారు గిరిజనులు.
బయట మార్కెట్లో లభించే ఎలాంటి కృత్రిమ మసాలాలు గానీ , హానికరమైన రంగులు వాడమని అందుకే వీటి రుచి విభిన్నమైనదనేది వారి మాట. ఈ చీకులు ఎలా తయారు చేస్తారు.. స్థానికంగా దొరికే కోళ్లతో మాంసపు ముక్కల్ని చిన్న చిన్న గా ఒకటే సైజ్లో చికెన్ కట్ చేస్తారు. వాటికి బాగా మసాలా, కారం కలిపి నాలుగు గంటల సేపు పక్కన ఉంచుతారు.
తరువాత అడవి నుండి తీసుకువచ్చి ఎదురుతో తయారుచేసిన వెదురుపుల్లలకు ఈ ముక్కల్ని గుచ్చడం జరుగుతుంది.. చల్లని మంచు ఘాట్ రోడ్ లో ఎర్రగా కాలుతున్న బొగ్గులపై పెడతారు. 5 నిమిషాలు పాటు బాగా ఉడికిన తరువాత పర్యాటకలకు ఇస్తారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Visakhapatnam