P. Anand Mohan, Visakhapatnam, News18
దసరా పండుగ (Dussehra Festival) వచ్చిందంటే చాలు. ఇంట్లో కొత్త బట్టలు, పిండివంటలు ఉండాల్సిందే. దానితో పాటు చికెన్ (Chicken), మటన్ (Mutton) వంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఖచ్చితంగా వండాల్సిందే. కానీ పండుగ వేళ ముక్క తిందామనుకుటుంన్న మాంసం ప్రియులకు (Non-Veg Lovers) మాత్రం షాక్ తప్పడం లేదు. మాంసం ధరలు చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. దసరా రోజుల్లో ముక్క మహా కాస్ట్లీ అయిపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ.. ఉభయగోదావరి జిల్లాల్లో మేక, గొర్రె మాంసం రేట్టు అమాంతాన పెరిగాయ. దసరా సమీపిస్తున్న కొద్దీ రేట్లన్ని మరింత పైపైకి వెళ్తున్నవి రెండేళ్ల తర్వాత ఇంతలా ధరలు పెరగడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దసరా ఎంజాయ్ అంటే ఉదయం పూజలు..మధ్యాహ్నం నుంచీ ఇక ముక్క వ్యవహారం నడుస్తుంటాయి. మరి వాటి కోసం మార్కెట్ ఎలా రెడీ అయ్యిందంటే. ధరలు పెరిగినప్పుడు జనం తక్కువ తింటారు. కస్టమర్లు రావాలనే ఉద్దేశంతో షాపులో రేట్లు కూడా తగ్గించి పెడతారు.
కానీ విశాఖపట్నంలో (Visakhapatnam) మాత్రం మాంసం ధరలు అమాంతం పెరిగిపోయాయి. మొన్నటి దాకా వ్యాపారం మందకొడిగా సాగడంతో వ్యాపారులు రేట్ల గెట్టేత్తారు. ముఖ్యంగా గొర్రె మామూలు రోజుల్లో ఏడువేల రూపాయల్లోపే పలుకుతుంది. కాస్తంత గట్టిదైనా పది లోపే.కానీ.. ఇప్పుడు దసరా ఆఫర్ ప్రకారం.. గొర్రె పదిహేనే వేలు పైనే పలుకుతోంది. ఇక ఆ ప్రాసెసింగ్.. ఈ పని కలిసి.. కేజీ గొర్రె మాంసం రూ.1500కి దొరుకుతుందని అంచనా. ఇప్పటికే రూ.1200 వరకు పలుకుతోంది. ఇక మేక మాంసం కూడా అంతే. మామూలు సమయంలో అయిదు ఆరు వేలు పడే ఈ మేక.. ఇప్పుడు ఏకంగా పదివేలపైనే అంటోంది. దీవంతో కేజీ మాంసం వెయ్యి రూపాయలకు కొనాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక చికెన్ సంగతి సరేసరి. నాటు కోటి కొనాలంటేనే జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. రెండు కేజీల కోసం వెయ్యి రూపాయలు లాగేస్తోంది. అదీ పుంజు అయితే పదిహేనే వందల పైమాటే. దసరా సమీపిస్తున్నకొద్దీ రేట్లు పెరుగుతూ వెళ్తున్నాయి. ఇక దసరా వస్తే వెయ్యి రూపాయల కోడి రూ.1500 పలుకుతుంది. బ్రాయిలర్ కోడిమాంసం ధర కూడా అలాగే ఉంది. రెండు నెలల క్రితమే కొండెక్కిన కోడి మాంసం ధర ప్రస్తుతం కిలో రూ.250 పలుకుతోంది.
ఇవి కాక.. సముద్రం, చెరువు చేపలు కూడా ప్రయత్నిస్తే.. అక్కడ ఎక్కవే పడుతోంది. కొన్ని సార్లు కొందరు కుమ్మక్కై ధరలు పెంచేస్తారని.. అప్పుడు తాము ఏం చేయలేకపోతున్నామని ఓ కోళ్ల వ్యాపారి అంటున్నారు. కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిన తర్వాత మార్కెట్లు తెరుచుకున్నాయి. మాంసం ధరలు మాత్రం ఎక్కువగా పెరిగాయి.ఈ దసరాకి ఇంక గట్టిగానే ఉంటాయని అన్నారాయన. అసలే కరోనాతో చాలా మంది ఆదాయం బాగా పడిపోయింది. ఇప్పుడు పండుగ సయమంలో నాన్ వెజ్ తిందామంటే ధరలు పెరిగిపోయాయని వినియోగదారులు వాపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chicken rate, Dussehra 2021, Mutton