హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cheetah Tension: ఆ గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తన్న చిరుత..? ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక

Cheetah Tension: ఆ గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తన్న చిరుత..? ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక

ఏజెన్సీలో చిరుత భయం

ఏజెన్సీలో చిరుత భయం

Cheetah Tension: ఆ ఏజెన్సీ ప్రాంతాలు అన్నీ నిత్యం ప్రశాంతంగా ఉంటాయి.. కాయ కష్టం చేసుకోవడం.. ఏ పూటకు అన్నట్టు ప్రశాంతమైన జీవనం వారిది. కానీ ఈ మధ్య వారికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది.. ఏం జరిగిందంటే..?

Cheetah Tension:   ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ మధ్య చిరుత భయాలు పెరుగుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా (Vizianagaram District)లోని మెంటాడ (Mentada) ఏజెన్సీలోని జయతి సహా పలు పరిసర గ్రామాల్లో చిరుతపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత మూడు రోజులుగా చిరుత పులి (Cheetah) సంచరిస్తున్నందన్న వార్తల నేపథ్యంలో  ఏజెన్సీలో భయాందోళనలు నెలకొన్నాయి.  జిల్లా అటవీ శాఖ అధికారులు సైతం చిరుత పులి సంచారం వార్తల నేపధ్యంలో  ఆనవాళ్లను సేకరించారు. ఆంధ్రా- ఒడిషా సరిహద్దు నుండి పులి ప్రవేశించినట్టు గుర్తించారు. అందకే సరిహద్దులోని కొండ ప్రాంతాలకు వెళ్లొద్దని,  గ్రామంలోనే ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మెంటాడ మండలం పరిదిలోని జయతి, పరిసర గ్రామాల్లో దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు ఉండడం లేదు.  గతంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో.. చిరుతలు, హైనాలు పలుసార్లు పశువులపై దాడి చేయడంతో ఏజెన్సీ ప్రజలు మరింత భయపడుతున్నారు. జయితి కొండ సమీపంలోని చింతల వలస, బిరసాడవలస, కంటుభుక్తవలస, సాలిపేట, చల్లపేట సహా చుట్టుపక్కల గ్రామాల్లోని రహదారుల గుండా వెల్లే వాహన దారులు, పాదచారులు బెంబేలెత్తిపోతున్నారు.

ఇదీ చదవండి ఏపీలో మరో బాదుడు.. ఆర్టీసీ చార్జీలు పెంచుతూ నిర్ణయం.. కొత్త ఛార్జీలు ఇలా

మెంటాడ మండలంలోని జయితి కొండ సమీపంలో రెండు రోజుల క్రితం పులి సంచరిస్తున్నట్లు, జయితి-పిట్టాడ మధ్య ఓ తోటలో ఉన్న కోళ్ల ఫారంలో పనిచేస్తున్న వ్యక్తికి రాత్రి ఏడు గంటల సమయంలో రోడ్డుకు అడ్డంగా వచ్చి కనబడడంతో.. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యానని, బండి కూడా బ్రేక్ లు వేయడంతో.. స్కిడ్ అయిందని.. దీంతో ఒక్కసారిగా భయం వేసిందని గ్రామస్తులతో చెప్పాడు.

ఇదీ చదవండి: సీఎం జగన్ ఆఫర్ ని తిరస్కరించిన మాజీ మంత్రి కొడాలి నాని.. కారణం అదేనా..?

మరుసటి రోజు ఉదయం వెళ్లి ఆ ప్రాంతంలో చూడగా, చిరుత పులి ఆనవాళ్లు కనిపించాయని గ్రామస్తులు చెబుతున్నారు. వెంటనే సమాచారం స్దానిక అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో.. పులి ఆచూకీ కోసం స్థానికులు, అటవీశాఖ అధికారుల గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో గల తోటల్లో గ్రామస్తులు గంపులుగుంపులు గా పులికి సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా కనిపిస్తాయేమోనని కర్రలు పట్టుకుని గాలిస్తున్నారు.

కొందరు గూగుల్ లో పులి అడుగులు గుర్తించే పనిలో పడ్డారు. దీంతో .. చిరుతపులికి సంబంధించిన కొన్ని అడుగులు, వెంట్రుకలు కనిపించాయి.

ఇక జయితి చుట్టుపక్కల కొండల సమీపంలో పులి సంచరిస్తున్నట్లు పలు గ్రామాల్లో ప్రచారం తో.. అటు వైపు వెళ్లాలి అంటేనే  వాహన దారులు, పాదచారులు  బెంబేలెత్తిపోతున్నారు. తక్షణమే అటవీశాఖ అధికారులు వచ్చి  తమ  భయాలు పోగట్టే విదంగా  చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మాయిల కోసం ప్రత్యేక కాలేజీలు.. 8వ తరగతి నుంచి ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియం

పులి ఆచూకీ కోసం స్థానికులతో కలిసి అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు.  జయితి కొండ సమీపంలో తిరుగుతున్నది పగ్ మార్క్ ను బట్టి చిరుతపులి గా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అడవిలో ఇప్పటికే డ్రాఫ్ట్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి.. చిరుత కదలికలపై నిఘా పెంచారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Vizianagaram

ఉత్తమ కథలు