Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM CHALLA KRISHNAVEER ABHISHEK WROTE 147 BOOKS AT THE AGE OF 31 IS TRULY REMARKABLE VNL NJ ABH

Vizag: వయస్సు 31.. రాసిన పుస్తకాలు 147..! సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనర్‌గా, రచయితగా దూసుకెళ్తున్న యువకుడు..!

వయస్సు

వయస్సు 31..రాసిన పుస్తకాలు 147..!

డాక్టర్‌ చల్లా కృష్ణవీర్‌.. 147 పుస్తకాలు రాశారు. అంటే అతని వయస్సు ఓ 50,60 ఉంటుందని అనుకుంటున్నారా?కాదండి.. అతని వయస్సు అక్షరాలా 31. ఇంత చిన్న వయస్సులోనే అన్ని పుస్తకాలు రాశారంటే ఆశ్చర్యపోవాల్సిందే..!

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    (Neelima Eaty, News 18, Vizag)

    డాక్టర్‌ చల్లా కృష్ణవీర్‌.. 147 పుస్తకాలు రాశారు. అంటే అతని వయస్సు ఓ 50,60 ఉంటుందని అనుకుంటున్నారా?కాదండి.. అతని వయస్సు అక్షరాలా 31. ఇంత చిన్న వయస్సులోనే అన్ని పుస్తకాలు రాశారంటే ఆశ్చర్యపోవాల్సిందే..!

    విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనర్‌. ఆంధ్రాయూనివర్సిటీ మరియు వివిధ ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పటికే 25 అంతర్జాతీయ అవార్డులు వరించాయి.

    మలుపుతిప్పిన స్వీడన్‌ ట్రిప్‌…!
    కృష్ణవీర్ నిజానికి జనాలతో ఎక్కువగా కలిసేవ్యక్తి కాదు..ఇంట్రావర్ట్‌... అలాంటిది ఇలా టీచింగ్ అతని ప్రొఫెషన్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది కృష్ణవీర్‌ చేసిన స్వీడన్‌ ట్రిప్‌ అతని జీవితాన్ని మలుపుతిప్పింది. ఒకసారి ఆతను స్వీడన్ దేశానికి వెళ్ళినపుడు..ఒక కవిత రాశారు. అది చూసిన వారంతా చాలా బాగుంది మంచి ఫ్యూచర్‌ ఉందంటూ మెచ్చుకున్నారు. అలా తనలో దాగి ఉన్న టాలెంట్‌ను తెలుసుకుని…తాను మంచిగా రాయగలను అని గుర్తించాడు. అలా ఆ క్షణం కృష్ణవీర్‌కు పుస్తకాలు రాయాలనే ఆలోచన మొదలైంది.

    తనతో తాను ఎక్కువ సమయం గడుపుతానని, అందువల్లే తన లక్ష్యం ఏంటో తనకు ఒక స్పష్టత ఉందంటున్నారు కృష్ణవీర్‌. పక్కవాళ్ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని పక్కనపెట్టి… మనతో మనం ఎక్కువ సమయం గడిపితే మనమేంటో మనకు తెలుస్తుందని.. జీవితంలో అనుకున్న ఆశయాన్ని చేరవచ్చంటున్నారు.

    147 పుస్తకాలు రాసిన కృష్ణవీర్‌..!

    కృష్ణవీర్‌ రాసిన ఇంగ్లీష్‌ స్కిల్స్ ఫర్‌ లాయర్స్‌ (English skills for lawyers) చాలా ప్రసిద్ధ చెందినది. ప్రస్తుతం ఆ పుస్తకం ఐదు యూనివర్సిటీలలో కూడా పాఠ్య పుస్తకంగా వాడుతున్నారు. ఇలా ఈ పుస్తకమే కాదు మొత్తం 147 పుస్తకాలను ఆయన రచించారు. వెయ్యి కవితలను ఒకేపుస్తకంలో రచించారు. కృష్ణవీర్‌ రాసిన పుస్తకాలన్నీంటిలో the hidden colours of rainbow పుస్తకం తనకు చాలా ఇష్టమైన పుస్తకం అంటున్నారు. జీవిత చరిత్రలు, డైరీలు, ట్రూ ఎకౌంట్స్‌, ఎగ్జామ్‌ ప్రిపరేషన్ పుస్తకాలు, హిస్టరీ, లా బుక్స్, లాంగ్వేజ్ మరియు లింగ్విస్టిక్స్‌, higher Education books రాయడం జరిగింది. కిరణ్ బేడీ వంటి వారి జీవిత చరిత్రలు కూడా రాశారు.

    ఇలా పుస్తక రచనలు మాత్రమే కాదు సాఫ్ట్ స్కిల్స్‌ ట్రైనింగ్‌ సెషన్స్‌ కూడా ఇస్తుంటారు. మనిషిలోని దాగి ఉన్న టాలెంట్‌ను బయటకు తీసి ఆలోచించే విధంగా ట్రైనింగ్‌ ఇస్తుంటారు. సమాజంలో ఎవ్వరితో ఎలా మాట్లాడాలి తెలుసుకునేలా  జనాలతో మింగిల్‌ అయ్యే విధానాలపై ట్రైనింగ్‌ ఇస్తుంటారు.

    ఈ క్రమంలో ఎందరో ప్రముఖులను కృష్ణవీర్‌ కలిశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చిన జీయార్‌స్వామి, కిరణ్‌ బేడి, డైరక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇలా ఎంతో మంది ప్రముఖులను కూడా కలిశారు.

    ప్రస్తుతం గాంధీజీపై ఆయన సిద్ధాంతాలు, వ్యక్తిత్వం గురించి పుస్తకరచనలు చేస్తున్నానని కృష్ణవీర్ తెలిపారు. అలాంటి గొప్ప నాయకుడి గూర్చి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందని,ఇప్పటివరకు ఈ కోణంలో ఎవ్వరూ బుక్‌ రాయలేదని..అందుకే తాను మహాత్ముడి గురించి మరిన్ని విషయాలను క్రోడికరించి బుక్స్‌ రాయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పుస్తకాలు రాయాలన్నదే తన లక్ష్యమని న్యూస్‌ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవీర్‌ తెలిపారు.

    ఫోన్‌ నెంబర్‌: 9908742869
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Local News, Vishakaptnam, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు