Global Investors Summit 2023: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు పెట్టుబడలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం (AP Government) నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) తొలి రోజు సక్సెస్ అయ్యింది. రెండో రోజు కూడా భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కాబోయే రాజధాని విశాఖ (Visakha) పై కేంద్ర వరాల జల్లు కురిపించింది. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరైన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఏపీపై ప్రశంసలు కురిపించారు. దేశంలోనే ఏపీ చాలా ముఖ్యమైందన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ఏపీలో అభివృద్ధి విషయంలో మీతో సంభాషించడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలోని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. భారతదేశాన్ని ఆత్మ నిర్భర్ భారత్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు మార్చాలనే ప్రధానమంత్రి కల, అది రాష్ట్ర అభివృద్ధితో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఈ స్ఫూర్తి వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం సబ్‌కా సత్ సబ్‌కా వికాస్ సబ్‌కా ప్రయాస్ అన్నారు గడ్కరీ.
చాలా కాలంగా సీఎం జగన్ 6 లేన్ల వైజాగ్ పోర్ట్ హైవేకు సంబంధించి ఒక ముఖ్యమైన డిమాండ్ నా ముందు ఉంచారు. ఈ రహదారి 55 కిలోమీటర్ల మేర ఉంటుంది, ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 6300 కోట్లు కానుందని మంత్రి అన్నారు. ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి సభా సమక్షంలో తెలిపారు. రాష్ట్ర అభివ్రుద్ధికి తన సహకారాన్ని అందించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే 975 కిలోమీటర్ల సముద్ర మట్టాన్ని కలిగి ఉందన్నారు.
ముఖ్యంగా నాలుగు లేన్ నేషనల్ హైవేతో పోర్ట్‌ను కనెక్ట్ చేయాలని తన మంత్రిత్వ శాఖ నిర్ణయించిందన్నారు గడ్కరీ.. మూడు పోర్ట్ లీడ్ ఇండస్ట్రియల్ కారీడాక్స్ ఉన్నాయని కూడా తమకు తెలుసన్నారు. ఒకటి విశాఖపట్నం చెన్నై, ఆ రోడ్డులో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ చేయాలని తాము ఇప్పటికే నిర్ణయించుకున్నామన్నారు. చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారీడాక్స్, హైదరాబాద్ -బెంగుళూరు ఇండస్ట్రియల్ కారీడాక్స్ అనంతపురంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కోసం తాము ఇప్పటికే ప్లాన్ చేసామన్నారు.
ఏపీలో మొత్తం రోడ్ నెట్‌వర్క్ 1,34,280 కిలో మీటర్లని.. 2014కి ముందు జాతీయ రహదారి పొడవు 4193 కిలోమీటర్లు ఉండగా, 2014లో ప్రధాని మోదీ ఆయన నేతృత్వంలో తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఏపీలో జాతీయ రహదారుల పొడవు 109% పెరిగిందన్నారు. ఇప్పుడు అది 8745 కిలోమీటర్లు ఉందన్నారు. ముఖ్యమైన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేని తాము తయారు చేస్తున్నామన్నారు. తాము అభివృద్ధి చేయబోతున్న మొత్తం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే 5, మొత్తం గ్రీన్‌ఫీల్డ్ పొడవు 662 కిలోమీటర్లు అన్నారు.
ఇదీ చదవండి : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తొలిరోజు సక్సెస్.. ఎన్ని కోట్ల ఒప్పందాలు వచ్చాయంటే..?
గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ముఖ్యమైన హైవే చాలా ముఖ్యమైనది ఎందుకంటే నేను షిప్పింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఏపీ నుండి విశాఖపట్నం నుండి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వరకు సరుకుల రవాణాకు సంబంధించి రైల్వేతో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. రాయ్‌పూర్ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్‌ను నిర్మించాలని ఆ సమయంలో నిర్ణయించారన్నారు. ప్రస్తుతం తాము 2024 ముగిసేలోపు ప్రారంభించాము, తాము ఈ పనిని పూర్తి చేయబోతున్నామని కేంద్ర మంత్రి గడ్కారి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Nitin Gadkari, Visakhapatnam