హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sridevi Drama Company: ఆమె స్టెప్ వేస్తే స్టేజ్ దద్దరిల్లిపోవాల్సిందే..! డాన్సర్‌గా మారిన బస్ కండక్టర్ స్టోరీ ఇదే..!

Sridevi Drama Company: ఆమె స్టెప్ వేస్తే స్టేజ్ దద్దరిల్లిపోవాల్సిందే..! డాన్సర్‌గా మారిన బస్ కండక్టర్ స్టోరీ ఇదే..!

ఝాన్సీ (ఫైల్)

ఝాన్సీ (ఫైల్)

శ్రీదేవి డ్రామా కంపెనీ… కొత్త కొత్త టాలెంట్‌లను వెతికి పట్టి తీసుకుస్తుంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ ప్రొగ్రామ్‌లో… ఎప్పుడూ కొత్త టాలెంట్‌లను పరిచయం చేస్తుంటారు. అలా ఈ వారం పరిచయం కానున్న వాళ్లలో ఒకరే విశాఖపట్నం గాజువాకకు చెందిన లేడీ కండక్టర్‌ ఝాన్సీ.. ఇంతకీ ఆవిడ స్పెషల్‌ ఏంటో తెలుసా?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  P Anand Mohan, News18, Visakhapatnam


  శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company).. కొత్త కొత్త టాలెంట్‌లను వెతికి పట్టి తీసుకుస్తుంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈటీవీ (ETv)లో ప్రసారమయ్యే ఈ ప్రొగ్రామ్‌లో… ఎప్పుడూ కొత్త టాలెంట్‌లను పరిచయం చేస్తుంటారు. అలా ఈ వారం పరిచయం కానున్న వాళ్లలో ఒకరే విశాఖపట్నం (Visakhapatnam) గాజువాకకు చెందిన లేడీ కండక్టర్‌ ఝాన్సీ.. ఇంతకీ ఆవిడ స్పెషల్‌ ఏంటో తెలుసా? ఆగస్టు 28న, ఆదివారం, ప్రసారం కానున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి సంబంధించి కప్పల పెళ్లి థీమ్‌తో మల్లెమాల టీమ్‌ రిలీజ్‌ చేసిన ప్రొమో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. దానికి కారణం గాజువాకకు చెందిన లేడీ కండక్టర్‌. ఆ ప్రొమో చూసిన వాళ్లకెవ్వరికైనా అందులో ఝాన్సీ తప్ప మరెవ్వరూ కనిపించరు. అంతలా మాస్‌ డాన్స్‌తో కట్టిపడేసింది. ఎనర్జిటిక్‌ ఫర్మామెన్స్‌తో అక్కడ కూర్చున్న జడ్జ్‌ ఆమనిని సైతం స్టేజీ మీదకు తీసుకొచ్చింది. అంతేకాదు ఆమని సైతం ఝాన్సీతో స్టెప్పులేసింది. చుట్టూ ఉన్న డ్రామా కంపెనీ సభ్యులంతా విజిల్స్‌తో అదుర్స్‌ అదుర్స్‌ అంటూ కేకలు పెట్టారు. ఇంతలా అందరికి ఊర్రూతలూగించిన ఆ లేడీ డాన్సర్‌ ఎవ్వరో కాదు మన ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంకు చెందిన మహిళ.


  ఆమె ఝాన్సీ. సింహాచలం దగ్గరలోని ప్రహ్లాదపురంలో బాబు విద్యానికేతన్ లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆమె చదువుకుంటున్న రోజుల్లోనే డాన్స్‌పై ఉన్న ఆసక్తితో రోజు ప్రాక్టీస్‌ చేసేవారు. పదో తరగతి పూర్తి అయిన తర్వాత డాన్స్‌ ప్రొగ్రామ్స్‌ చేసేవారు. టెన్త్‌ క్లాస్‌ అర్హత మీద ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలున్నాయని.. ఆమె అమ్మ, తమ్ముడు చెప్పడంతో దానికి దరఖాస్తు చేసుకుంది. 2011లో ఝాన్సీకి జాబ్ వచ్చింది. ఆ ఏడాదే ట్రైనింగ్‌ కంప్లీట్‌ చేసి.. 2012లో గాజువాక ఆర్టీసీ డిపోలో ఉద్యోగంలో జాయిన్ అయింది. జాబ్‌ వచ్చినా కూడా తనకు డాన్స్‌ మీద ఉన్న మక్కువతో కుటుంబ సభ్యులు సహకారంతో డాన్స్‌ ప్రొగ్రామ్స్‌ చేస్తూనే ఉండేది.


  ఇది చదవండి: గవ్వలతో ఇన్ని రకాల అద్భుతాలా..! అలంకరణలో ది బెస్ట్ అనిపిస్తోన్న సముద్రపు గవ్వలు..!


  ఎక్కడైనా డాన్స్‌ కాంపీటీషన్స్‌ జరుగుతున్నాయని తెలిస్తే అక్కడకు వెళ్లేవారు. అంతేకాదు కొన్ని టీవీ ఛానల్స్‌లోనూ తన నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. జెమినీ టీవీ డాన్సింగ్ స్టార్ ప్రొగ్రామ్‌లోనూ పోటీ చేసింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్‌ అందుకుంది. ఆ సమయంలో ఝాన్సీ, ఆమె కుటుంబసభ్యుల ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ రోజు తన జీవితంలోనే ఒక ప్రత్యేకమైన రోజు అంటూ ఝాన్సీ చెప్పుకొచ్చారు. అమె వర్క్‌ చేసే చోట, ఆమె బంధువులు అందరూ పొగడ్తలతో ముంచెత్తారు.


  ఇది చదవండి: పోలీసుల కోసం స్పెషల్ షోరూమ్.. అక్కడ దొరికేవన్నీ వారి కోసమే.. యువకుడి సక్సెస్ స్టోరీ..


  అక్కడ మొదలైన ఝాన్సీ ప్రయాణం తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. పదేళ్ల క్రితం మాటీవీలో రంగం 2 అనే కార్యక్రమంలోనూ, జీ తెలుగులో వచ్చిన తీన్మార్ అనే కార్యక్రమంలో ఒక డాన్సర్‌గా చేసింది. ఈ ప్రొగ్రామ్స్‌లో పార్టిసిపేట్‌ చేయడం వల్ల ఆమెకు ఎంతో పేరు వచ్చింది. ఇప్పుడు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన డాన్స్‌తో మరో లెవల్‌కు వెళ్లిపోయింది..  ఇది చదవండి: క్షమాపణ చెప్పడమే వేడుక.. పర్యుషాన్‌ పండగ అంటే తెలుసా..ఇంతకీ ఎవరు చేసుకుంటారు..?


  కొత్త సినిమాలోని పల్సర్ బైక్ సాంగ్‌కు ఊర మాస్‌ స్టెప్పులేసి ఇరగదీసింది. జడ్జి ఆమనితో పాటు యాంకర్ రష్మీ, హైపర్ ఆది, రాంప్రసాద్ ఇలా స్టేజిపై ఉన్న వాళ్లంతా ఆమెతో కలిసి స్టెప్పులేయడంతో స్టేజీ దద్దరిల్లింది. దీంతో సగటు ప్రేక్షకులకు ఇప్పుడు పూర్తి ఎపిసోడ్‌పై ఆసక్తి ఎక్కువైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గాజువాక లేడీ కండక్టర్ డ్యాన్స్ న్యూసే ట్రెండింగ్‌లో ఉంది. ఇంక నెటిజన్లు కొందరు పనిలో పనిగా ఆమె పాత డాన్స్‌ వీడియోలను కూడా వైరల్ చేసేస్తున్నారు. మరి చూడాలి ఈ వారం కప్పల పెళ్లి ఈవెంట్‌లో మన ఝాన్సీ ఫర్పామెన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో..!

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Sridevi drama company, Visakhapatnam

  ఉత్తమ కథలు