హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Son-in-Laws: అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు.. కానీ అత్తారింటికెళ్లి చేసిన ఘనకార్యం ఇదీ..

Son-in-Laws: అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు.. కానీ అత్తారింటికెళ్లి చేసిన ఘనకార్యం ఇదీ..

పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో నిందితులు

Andhra Pradesh: అల్లుళ్లు అత్తగారింటికి వెళ్తే సకల మర్యాదలు చేస్తారు. అన్నిరకాల వంటలు వండిపెడతారు. ఇక పండక్కి వెళ్తే... అల్లుళ్ల భోగమే వేరు. అలాగే అత్తగారిల్లంటే అల్లుళ్లు గౌరవంగా ఉంటారు. కానీ ఇద్దరు అల్లుళ్లు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...

  P.Bhanu Prasad, Vizianagaram, News18

  అల్లుళ్లు అత్తగారింటికి వెళ్తే సకల మర్యాదలు చేస్తారు. అన్నిరకాల వంటలు వండిపెడతారు. ఇక పండక్కి వెళ్తే... అల్లుళ్ల భోగమే వేరు. అలాగే అత్తగారిల్లంటే అల్లుళ్లు గౌరవంగా ఉంటారు. అక్కడ తమను తాము ఏ మాత్రం తగ్గించుకోరు. పిల్లనిచ్చినవారి గౌరవమర్యాదలకు భంగం కలిగించరు. కానీ ఇద్దరు అల్లుళ్లు అత్తగారింటికే కన్నం వేశారు. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయనగరం జిల్లా (Vizianagaram) కొమరాడకు చెందిన మహిళ ఇంట్లో వారం క్రితం దొంగతనం జరిగింది. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే రంగంలోకి దిగారు. చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి.. ఆధారాలు సేకరించారు. ఈ చోరీ కేసు చేధించిన పోలీసులు.. దొంగలెవరో కనిపెట్టారు. తాజాగా నిందితుల వివరాలను పోలీసులు బయటపెట్టడంతో అందరూ షాకయ్యారు. అత్తగారింట్లోవాళ్లకైతే దిమ్మతిరిగి బొమ్మకనబడింది.

  విజయనగరం జిల్లా కొమరాడకు చెందిన అక్కమ్మకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చెయ్యగా, మరో ఇద్దరు కుమార్తెలను సీతానగరం మండలం పాపమ్మవలస గ్రామానికి చెందిన ఆవాల సింహాచలం, ఆవాల గణేష్ అనే అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లచేశారు. వీరిలో చిన్న అల్లుడు అవాల గణేష్ ఇల్లరికం వచ్చి అత్తమామలకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మామ గొర్రెల వ్యాపారం చేస్తుండగా.. అత్త అక్కమ్మ అరటి పండ్ల వ్యాపారం చేస్తోంది. అత్తమామలిద్దరూ తమ పనుల నిమిత్తం బయటకు వెళ్లడంతో అల్లుడు గణేష్ కు దుర్బుద్ధి పుట్టింది.

  ఇది చదవండి: కానిస్టేబుల్ పాడుబుద్ది.. ఇంట్లో అద్దెకుండే వివాహితను ఇలా చేస్తాడనుకోలేదు..!  అత్తగారింటికి కన్నం వెయాలని భావించి అన్న సింహాచలంకు కబురుబెట్టాడు. అతడికి విషయం చెప్పడంతో ఇద్దరూ కలిసి ఈ నెల 2వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఇంటిలోకి ప్రవేశించి బంగారు పుస్తెల తాడు, చైను, రెండు జతల చెవి దిద్దులు, నెక్లేస్ తో పాటు రూ. 20 వేలు నగదు దొంగిలించి పారిపోయారు. తరువాతి రోజు తెల్లవారుజామున తమ ఇంట్లో చోరీ జరిగిందన్న విషయం గమనించిన చిన్న కూతురు, చిన్న అల్లుడు ఆవాల గణేష్ భార్య నీలవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమరాడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

  ఇది చదవండి: మెడిసన్ చదివేందుకు ఫారిన్ వెళ్లి ఇతగాడు నేర్చుకున్నది ఇదీ.. డాక్టర్ కావాల్సిన వాడు జైలుకు వెళ్లాడు..  చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి.. ఆధారాలు సేకరించారు. ఇంటి వెనుక నుంచి వెళ్లి చోరీకి పాల్పడటంతో.. ఇది తెలిసిన వాళ్ల పనిగా పోలీసులు అనుమానించారు. చోరీ జరిగిన ఇంట్లో ఉంటున్న వారి కుటుంబ సభ్యుల గురించి ఆరా తీశారు. నేర స్థలం వద్ద సేకరించిన ఆధారాలను బట్టి, చిన్న అల్లుడు ఆవాల గణేష్ ప్రవర్తనపై అనుమానం వచ్చి ప్రశ్నించగా.. చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇక ఆవాల గణేష్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. అతని అన్న సింహాచలం కూడా చోరీలో పాల్గొన్నట్లు గుర్తించారు. మొత్తానికి నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు దొంగతనం జరిగిన తీరును వివరించారు. అసలు విషయం ఏంటంటే ఈ తోడుదొంగలైన అల్లుళ్లిద్దరూ అక్కమ్మకు స్వయానా మేనల్లుళ్లు. తరచూ అత్తను డబ్బులడుగుతుంటే ఇవ్వలేదన్న కోపంతో చోరీకి పాల్పడ్డట్లు నిందితులు తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Theft, Vizianagaram

  ఉత్తమ కథలు