Kommu Konam Fish: ఈ చేప వలకి చిక్కితే కాసుల పంటే..! తింటే రుచుల విందే..!

కొమ్ముకోణం చేప (ఫైల్)

Fishing: ఆ చేప మత్స్యకారులకు లాభాలిస్తుంది. సముద్రంలో ఎంత వేట సాగించినా.. ఆ చేప ఒక్కటి పడితే చాలు. ఇక మత్స్యకారులు ఆరోజు చూసుకోవక్కర్లేదు.

 • Share this:
  P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

  ఆ చేప మత్స్యకారులకు లాభాలిస్తుంది. సముద్రంలో ఎంత వేట సాగించినా.. ఆ చేప ఒక్కటి పడితే చాలు. ఇక మత్స్యకారులు ఆరోజు చూసుకోవక్కర్లేదు. టూనా చేపలకి ఉన్నంత గిరాకీ ఉన్న చేపది. దాని పేరే కొమ్ముకోనెం. బంగాళాఖాతం సముద్రంలో దొరికే ఈ అరుదైన చేప ఇప్పుడు విశాఖలో సందడి చేస్తోంది. సముద్రంలోనాలుగైదు రోజులు వేట కొనసాగిస్తే.. అదీ వందల అడుగుల లోతులో ఈ చేప పడుతోంది. కొమ్ము కోనెం చేప విశేషాలు తెలుసుకుందామా..? కొమ్ముకోనెం..?ఈ చేప భారీ సైజుకి పెరుగుతుంది. సాధారణ చేపల స్థాయికి మించి పెరుగుతుంది. సాధారణంగా వంజరం చేపల్ని చేపపిల్లలు.. పెద్ద సైజుకి పెరిగితే కోనెం చేప అంటారు. కోనెం చేప ఇరవై కేజీల వరకూ పెరుగుతుంది. ఇది అరుదుగా వలల్లో పడుతుంది. ఇక కోనెం మార్కెట్ ధర కూడా కేజీ వెయ్యి పైమాటే. ఇప్పుడు కొమ్ముకోనెం చేప విషయానికి వస్తే.. ఇది అరుదుగా వలకు చిక్కుతుంది. మత్స్యకారుల్లో కూడా దీని ఎక్కడ ఇది దొరుకుతుందో తెలిసిన వారికే దక్కుతుంది. వల వేసి మూడు నాలుగు రోజులు దీని కోసం శ్రమిస్తారు. అప్పటి కానీ.. ఇది దొరకదు. కొమ్ముకోనెం పదునైన కొమ్ముతో ఉంటుంది. ఇది గట్టి చేప. వలకి చిక్కిన చాలా సమయానికి మాత్రమే ఇది చనిపోతుందట. ఒకేసారి పది ఇరవై చేపలు పడతాయి. కొన్ని సార్లు వలలు కూడా చీలిపోయి చేప తప్పించుకుంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.

  పదునైన కొమ్ము..?
  ఫొటోలో చూసినట్టు పదునైన కొమ్ము ఉంటుంది. సైజు, బరువు భారీగా ఉంటాయి. దాదాపు నలభై, యాభై కేజీలపైనే ఉంటుందీ చేప. వలకి చిక్కితే ఇక మత్స్యకారులకు కాసుల పంటే. టూనా తర్వాత.. అంతే డిమాండ్ ఉన్న చేప ఇది. ఇది దేశీయంగా దొరికినా.. ఇక్కడ దీన్ని ఎక్కువగా తినేవాళ్లు లేరు. కారణం ఖరీదు. కొమ్ముకోనెం చేప ఖరీదు చాలా ఎక్కువ. కేజీ మూడు వందల నుంచీ ఎనిమిదివందలకు వరకూ ఉంటుంది. నలభై కేజీలు మామూలు సైజ్ చేప. ఇక ఎనభై నుంచీ వంద కేజీలు చేపలు ఒక్కోసారి పడతాయి. సాధారణ మార్కెట్ లో మూడు వందలు కేజీ అమ్ముతారు. కోసిన తర్వాత కేజీకి ఇంతా అని ధర కూడా పెరుగుతుంది. వందకేజీల చేప వలలో పడితే ఇక మత్స్యకారులకు హ్యాపీయే. వేటకి వెళ్లిన బోటు మెయింటెనెన్స్ తో పాటు.. వేట ఖర్చులు పోనూ.. లాభం గట్టిగానే వస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు.

  కొమ్మకోణం చేప (ఫైల్)


  కొమ్మకోణం చేప (ఫైల్)


  కేరళ, శ్రీలంకకి..
  ఎక్కువగా ఈ చేపను శ్రీలంక దేశీయులు ఇష్టపడతారట. అందుకే అక్కడికే ఎక్కువగా ఎగుమతి చేస్తారని మత్స్యకార సంఘం నాయకులు మేరుగు ఎల్లాజీ చెబుతున్నారు. భారత్ లో కేరళ రాష్ట్రీయులు ఎక్కువగా ఈ ఫిష్ ని ఇష్టంగా తింటారని.. అక్కడికి కూడా ఎగుమతి చేస్తామంటున్నారు. మత్స్యకారుల నుంచీ ఎక్స్ పోర్ట్ కంపెనీలకు విక్రయం జరిగిన తర్వాత ఈ చేప ధర కూడా పెరుగుతుంది. లోకల్ మార్కెట్ లో ఈ చేప విక్రయాలు తక్కువే. ఒకవేళ విక్రయించినా.. నలభై కేజీల కొమ్ముకోనెం చేపనే కొని చేపల మార్కెట్ లో అమ్ముతారు. అదీ చేపను కోసిన తర్వాత రేటు ఎనిమిదివందలు కూడా పలుకుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇక నలభై కేజీల నుంచీ 150 కేజీల వరకూ ఉండే చేప ఎక్స్ పోర్ట్ ఎక్కువగా జరుగుతుంది. ఈ పార్శిల్ విధానం కూడా కాస్ట్లీయే. చేపల వేట సీజన్లో దీని కోసమే వెళ్లే బోట్లు ప్రత్యేకించి ఉంటాయి. మత్స్యకారులు పట్టిన చేపల్ని నేరుగా ఫిష్ ఎక్స్ పోర్ట్ డీలర్లకి విక్రయిస్తారు.

  కొమ్మకోణం చేప (Photo Credit: FaceBook)


  రుచి, ఆరోగ్యం..?
  ఈ చేప ప్రత్యేకమైన రుచిగానూ ఉంటుందట. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఈ చేప తినడం వల్ల ప్రొటీన్ లు పెరుగుతాయని.. అందుకే దీన్ని విదేశీయులు కొంటారని చెబుతున్నారు మత్స్యకారులు. ఇమ్యునిటీ కూడా బాగా పెరుగుందని మత్స్యకారులు నమ్ముతారు. టూనా చేపల తర్వాత అంతే డిమాండ్ ఉన్న చేపకావడంతో దీనిపై మత్సకారులు ఆధారపడతారు. టూనా చేపలాగే ఇది కూడా సముద్రంలో చాలా లోతున మాత్రమే ఉంటుంది. దీన్ని పట్టుకోవడం చాలా కష్టమైన పనే. ఇక కరోనా కారణంగా కుదేలైన మత్స్యకారులకు కొమ్ము కోనెం కాసుల పంట పండిస్తోంది.
  Published by:Purna Chandra
  First published: