VISAKHAPATNAM BJP MP SUJANA CHOWDARY MADE SENSATIONAL COMMENTS ON YSRCP LED GOVERNMENT IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Sujana Comments: వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవ్.. కేంద్రం చూస్తూ ఉరుకోదు.. సుజనా వార్నింగ్..
విశాఖలో మాట్లాడుతున్న సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బీజేపీ (BJP) నేతలు జోరు పెంచారు. వైసీపీ (YSRCP) ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చుతున్నాను. నిన్న సీఎం రమేష్ పోలీస్ వ్యవస్థపై చేసిన హాట్ కామెంట్స్ మరువక ముందే.. మరో ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బీజేపీ (BJP) నేతలు జోరు పెంచారు. వైసీపీ (YSRCP) ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చుతున్నాను. నిన్న సీఎం రమేష్ పోలీస్ వ్యవస్థపై చేసిన హాట్ కామెంట్స్ మరువక ముందే.. మరో ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన దివంగత మాజీ ప్రధాని వాయిజ్ పేయి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన వైసీపీపై మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో రాక్షసపాలన నడుస్తోందని.. అభివృద్ధిలో 30ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ప్రజలు తమ భవిష్యత్ కోసం పోరాడాల్సిన అవసరముందన్నారు. తనకు ఆడిటర్ జీవి గురించి తెలియదని.. దారినపోయే దానయ్య కామెంట్స్ చేస్తే స్పందించాల్సిన అవసరం లేదన్నారు. రాడి సన్ బ్లూ కు నాకు సంభందం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉన్నవారికి భద్రత లేదని సుజనా చౌదరి విమర్శించారు.
ఇక సినిమా టికట్ల అంశంపైనా సుజనా చౌదరి మాట్లాడారు. సినిమా హాల్స్, టిక్కెట్ల ధరలు తగ్గించడాన్ని కోర్టు కొట్టివేసినా ప్రభుత్వం తగ్గడం లేదన్నారు. సిసినిమా హాల్స్ మూతపడితే దానిమీద ఆధారపడి ఉన్నవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని సుజనా విమర్శించారు. విభజన ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హామీలను సాధించడంలో వైసీపీ విఫలమైందన్నారు. వాళ్లకున్న లొసుగుల వల్ల కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నారని సుజనా మండిపడ్డారు. తలాతోక లేకుండా రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు.
స్థానిక ఎంపీ విశాఖ రైల్వే జోన్ కోసం అడగటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ఒక కన్నేసిందన్న సుజనా చౌదరి.. రాజ్యాంగం ప్రకారం పాలన చెయ్యకపోతే వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్రాన్ని కలుస్తామంటే.. తాము కూడా ఆయతనో పాటు కలుస్తామని సుజనా ప్రకటించరు. స్టీల్ ప్లాంట్ పై విధానపరమైన నిర్ణయం తీసుకున్నారన్న సుజనా.. ఓ శుభవార్త వినబోతున్నారన్నారు.
ఇదిలా ఉంటే శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఎంపీ సీఎం రమేష్ ఏపీలో పోలీస్ వ్యవస్థపై ఘాటువ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తుందని.. ఐపీఎస్ అధికారులు నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తున్నారని అలాంటి వారిని కేంద్రం రీకాల్ చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీస్ వ్యవస్థ తీరుపై ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హోం శాఖ కార్యదర్శికి వివరించామన్న సీఎం రమేష్.. ఏపీ పోలీసులను కేంద్రం టెలిస్కోప్ తో చూస్తోందన్నారు. ప్రబుత్వాలు వస్తాయి పోతాయి వ్యవస్థలు శాశ్వతమన్న సంగతి అధికారులు గుర్తించుకోవాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.