హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Second Hand Bikes: మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్నారా..? అయితే జాగ్రత్త... మీ ఇంటికి పోలీసులు రావొచ్చు..

Second Hand Bikes: మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్నారా..? అయితే జాగ్రత్త... మీ ఇంటికి పోలీసులు రావొచ్చు..

పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకులు

పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకులు

Second Hand Bikes: మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్నారా..? కొత్త బైక్ పై ఎక్కువ ధర చెల్లించలేక తక్కువ ధరలో పాతబైక్ కొని ఎంచక్కా తిరిగేస్తున్నారా..? అలా అయితే మీరు చిక్కుల్లో పడినట్లే.

P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్నారా..? కొత్త బైక్ పై ఎక్కువ ధర చెల్లించలేక తక్కువ ధరలో పాతబైక్ కొని ఎంచక్కా తిరిగేస్తున్నారా..? అలా అయితే మీరు చిక్కుల్లో పడినట్లే. ఎందుకంటే అలాంటి బైకులకు ఉపయోగించేవన్నీ కొట్టేసిన కొత్తబైకుల స్పేర్ పార్ట్సే. విశాఖలో ఓ దొంగ పాత బైకులకి.. కొత్త బైక్ పార్ట్ వేసేసి మరీ అమ్మేశాడు. అలాంటివి దాదాపు 50కి పైగా బైక్ లు ఉన్నాయట. ఆ దొంగ ముందు ఆటోమొబైల్ ఇంజనీర్లు కూడా పనికి రారు. ఎంతటి డొక్కు బైక్ నైనా సరే లెటేస్ట్ మోడల్ బైక్ లా గంటల్లో తయారు చేసి ఇచ్చేస్తాడు. పాత బైక్ లు తీసుకుని, కొత్త బైక్ లను చోరీ చేసి పార్టులను మార్చేసి ఓల్డ్ బైక్ ను కూడా న్యూ మోడల్ బైక్ లా తయారు చేసే గ్యారేజ్ రన్ చేశాడు. ఏళ్ల తరబడి ఇదే పని చేస్తూ, వందల సంఖ్యలో డొక్కు బైక్ ల రూపు రేఖలు మార్చి ఇతరులకు అమ్ముతూ సొమ్ము చేసుకున్నాడు. కొందరైతే ఈ ఘరానా దొంగ మెకానిక్ ను అడ్డం పెట్టుకుని చోరీ బైక్ ల రీమోడల్ ను గుట్టుచప్పుడు కాని బిజినెస్ గా రన్ చేశారు. చివరకు ఇప్పుడు బండారం బయటపడటంతో ఇన్నాళ్లూ నోట్ల కట్టలు లెక్కపెట్టిన వాళ్లు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

విశాఖపట్నం మహా నగరంలో బైక్ లో చోరీలు షరా మూమూలే. రోడ్డు మీద పార్క్ చేసిన తర్వాత తిరిగి వచ్చేసరికి బైక్ ఉంటే లక్కీనే. ఈ తరహా నేపథ్యం విశాఖ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతోంది. గాజువాక, మల్కాపురం, పెందుర్తి, మధరవాడ ప్రాంతాల్లో బైక్ చోరీలు నిత్యం జరుగుతూనే ఉంటుంటాయి. బైక్ పోయిన వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగిసిపోతోంది. అయితే వరుసగా ఈ తరహా ఫిర్యాదులు పెరిగిపోతుండటంతో విశాఖ పోలీసులు బైక్ చోరీలపై దృష్టి సారించారు. విశాఖ నగరానికి చెందిన అహ్మద్ అనే మెకానిక్ బైక్ లు రీమోడలింగ్ చేయడంలో దిట్టగా పేరుగాంచాడని తెలుసుకున్నారు.

ఇది చదవండి: తోకపై నిల్చొని ఈలేస్తున్న కోబ్రాలు.. ఏపీలో అరుదైన జీవుల సంచారం.. ఎక్కడంటే..!


అహ్మద్ పై ఓ కన్నేసి ఉంచగా మొత్తం బండారం బయటపడింది. పోలీసులు విచారణలో వెలుగు చూసిన ప్రకారం కొత్త బైక్ లను గుట్టుగా చోరీ చేసి వాటి ఇంజిన్ ఇతర ముఖ్యమైన భాగాలను పాత బైక్ లకు అమర్చి రీ మోడల్ చేసేస్తాడు. ఈ తరహా నైపుణ్యంలో అహ్మద్ కు విశాఖలో ఎదురు లేదు. తాను ఇలా చేయగలనని ఇతర జిల్లాల వారికి తెలిసేలా చేసుకున్నాడు. దీంతో తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలంలో కొంతమంది తమ పాత వాహనాల్ని ఒక్కోదానికి రూ.15 వేల చొప్పున నగదు ఇచ్చి రీమోడలింగ్ చేయిం చుకున్నారు. ఇది తెలిసిన మరికొంత మంది తమ ద్విచక్ర వాహనాలను అతడికే ఇవ్వగా వాటిని రీమోడలింగ్ చేసి ఇచ్చేశాడు.

ఇది చదవండి: ఏపీలోని విద్యార్థులకు అలర్ట్... అలా చేస్తే వాలంటీర్లు ఇంటికొచ్చేస్తారు..


ఇప్పుడ తమ పాత వాహనాలను తీసుకుని వైజాగ్ వెళితే అహ్మద్ తాను ఉండే ప్రాంతానికి రావొ ద్దంటాడు. విశాఖ రైల్వేస్టేషన్ వద్ద ఉండమని, తానే వస్తానని చెబుతాడు. పాత వాహనాన్ని పరిశీలించి కొత్త వాహనంలా చేస్తానని బేరం కుదుర్చుకుని పది రోజులు సమయం ఇస్తాడు. తాను తీసుకున్న పాత వాహన భాగాలను విడ దీసి అదే కంపెనీకి చెందిన కొత్త వాహనాన్ని చోరీ చేస్తాడు. చోరీ చేసిన వాహనం చాస్, ఇంజిన్ నంబర్లను చెరిపేసి బాధితులు ఇచ్చిన పాత వాహనం నంబర్లను వేసి మళ్లీ అదే రైల్వేస్టేషన్ వద్దకు రమ్మని అప్పగిస్తాడు.

ఇది చదవండి: ఏడేళ్ల ప్రేమ... ప్రియుడు పెళ్లికి నో చెప్పడంతో యువతి చేసిన పనికి గంటలో పెళ్లైంది..


రెండేళ్లుగా విశాఖలో బైకుల చోరీలు పెరిగిపోతుండటంతో పోలీసులు వాటిపై నిఘాపెట్టారు. ప్రతి రోజూ ముఖ్యమైన జంక్షన్ల వద్ద తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అహ్మద్ ఇటీవల విశాఖలోని ఉప్పాడ, కొత్తపల్లి గ్రామాలకు చేరుకొన్నాడు. రెండు చోట్లా తనకు పరిచయం ఉన్న వాళ్ల ద్వారా ఇక్కడ కొన్నాళ్లు మకాం వేద్దామనుకుని ప్లాన్ చేసాడు. కొత్తపల్లిలో ఓ మెకానిక్ షెడ్డు దగ్గర ఉండగా గాజువాక పోలీసులకు సమాచారం అందడంతో కొత్తపల్లికి చేరుకుని నింది తుడిని అదుపులోకి తీసుకొన్నారు. తమదైన రీతిలో విచారించగా డొంకంతా కదిలింది. రెండు రోజుల్లో యు.కొత్తపల్లి మండలంలోని పలు ప్రాంతాలకు చెందిన వారి నుంచి 20 వాహనా లను స్వాధీనం చేసుకుని విశాఖకు తరలించారు. ఇలా తక్కు వ ధరకే కొత్త వాహనాలు చోరీ చేసి దాని పార్ట్స్ తీసేసీ పాత బైక్ లకు అమర్చి సొమ్ము చేసుకుంటున్న అహ్మద్ బండారం బయటపెట్టారు.

ఇది చదవండి: ప్రియుడి కోసం దేశంకాని దేశం వచ్చిన యువతి... ఇంతలోనే ఊహించని కష్టం.. పోలీసులే ఆమె పాలిట దేవుళ్లు..



అంతేగాక అహ్మద్ వద్ద కూడా ఇలా రీమోడలింగ్ బైక్ లను కొనుగోలు చేసి అమ్మకుంటున్న బ్లాక్ బిజినెస్ కూడా బయటపడింది. దీంతో ఎవరెవరు ఇలా అహ్మద్ వద్ద బైక్ లు రీమోడలింగ్ వి కొని అమ్ముకుంటున్న ముఠా ను కూడా పోలీసులు ఛేదించారు. వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు. మొత్తానికి విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 76 బైక్ లతో పాటుగా సూత్రధారి మెకానిక్ అహ్మద్ తో పాటుగా రీమోడలింగ్ బైక్ లు కొని అమ్ముతున్న మరికొందరి ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు పోలీసులు పంపారు.

First published:

Tags: Andhra Pradesh, Bike theft, Crime news, Visakhapatnam

ఉత్తమ కథలు