హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Bride Death: పెళ్లింట విషాదంలో సంచలనం.. పెళ్లికూతురు గన్నేరుపప్పు తిందా..? ఎందుకంటే..?

Bride Death: పెళ్లింట విషాదంలో సంచలనం.. పెళ్లికూతురు గన్నేరుపప్పు తిందా..? ఎందుకంటే..?

పెళ్లింట పెను విషాదంలో ట్విస్ట్

పెళ్లింట పెను విషాదంలో ట్విస్ట్

Bride Death: పెళ్లింట పెను విషాదం నింపిన ఘటనలో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సరిగా వరుడు జీలకర్రా బెల్లం తలపై పెడుతున్నప్పుడు.. వధువు కుప్పకూలి పడిపోయింది. పెళ్లి పనుల్లో అలసట కారణంగా.. గుండెపోటు వచ్చి ఆమె పడిపోయింది అని అంతా అనుకున్నారు.. కానీ పోలీసుల విచారణలో.. ఆమె శరీరంలో విషపదార్ధాలు ఉన్నట్టు నిర్ణారించారు.

ఇంకా చదవండి ...

P Anand Mohan, Visakhapatnam, News18.

Bride Death: మెడలో మూడు ముళ్లు పడి.. ఒకరి చేయి ఒకరు పట్టుకుని.. ఏడు అడుగులు వేయాల్సిన సమయం.. కాసేపట్లో ఆ వధూవరుల జంట ఒక్కటవుతోంది.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతోంది.. దీంతో అక్కడ అంతా సందడిగా మారింది. ఇక కన్న కూతురు పెళ్లి  (Marriage) గ్రాండ్ గా చేయాలని అనుకున్న ఆ తల్లిదండ్రులు (Parents).. అంతా హ్యాపీగా సాగుతుండడంతో చాలా ఆనందంలో కనిపించారు. అనుకున్నట్టే అందరినీ పిలిచి.. భారీ హంగులతో ఆ పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లి కొడుకు కుటుంబానికి రాజకీయ నేపథ్యం కూడా ఉండడంతో.. భారీగానే బంధువులు, సన్నిహితులు, అనుచరులు వచ్చారు.. వివాహ తతంగమంతా చాలా గ్రాండ్ గా జరుగుతోంది. పెళ్లి మండపం (Function Hall) అంతా సందడిగా కనిపించింది. నవ వధువు (Bride), వరుడు (Bridegroom) కూడా చాలా సంతోషంగా కనిపించారు. వచ్చిన బంధువులను పలకరిస్తూ.. నవ్వుతూ.. ఎంతో ఆనందంగా ఉన్న ఆ జంటనను అంతా ఆశ్వీరదిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఊహించిన విషాదం (Tragedy) కన్నీరు పెట్టించింది. ఈ విషాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలి..ఆ తరువాత వెంటనే మృతి చెందింది. విశాఖలోని మధురవాడలో గురువారం జరిగిన ఈ విషాద ఘటనలో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నవ వధువు సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పీటలమీదనే కుప్పకూలిన సృజనను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది అని డాక్టర్లు నిర్దారించారు. అయితే పెళ్లి పనుల్లో భాగంగా అలసట చెంది.. గుండెపోటుతో మరణించిందని అంతా అనుకున్నారు.. కానీ సోలీసుల విచారణలో మరో అనుమానం వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి : ఫోన్ ట్యాపింగ్ పై క్లారిటీ ఇచ్చినా మంత్రి పెద్దిరెడ్డి.. ఎవరి ఫోన్ ట్రాక్ చేశారంటే?

తాజాగా ఆమె బ్యాగ్ లో గన్నేరు పప్పును గుర్తించారు. అంటే పెళ్లికి ముందు ఆమె గన్నేరు పప్పు తీసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. అందుకే గన్నేరు పప్పు తిని చనిపోవాలని అనుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే సృజన మృతదేహాన్ని కేజిహెచ్ కు పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆమె పోస్టు మార్టం తరువాత అన్ని విషయాలు స్పష్టంగా చెబుతామన్నారు పోలీసులు.. 

ఇదీ చదవండి : సీఎం జగన్ సొంత జిల్లాలో దారుణం.. బాలికపై పది మంది పలు మార్లు అత్యాచారం..

కారణం ఏదైనా..? కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని భావించిన ఆ పెళ్లి కూతురుకి..పీటలపైనే నిండు నూరేళ్లు నిండాయి. పసుపు వస్త్రాల్లో కొత్త పెళ్లికూతురిలా తమ కుమార్తెను చూసి ఆనంద బాష్పాలు కార్చిన ఆ తల్లిదండ్రులకు..తీరని దుఃఖం మిగిలింది. పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలి, అనంతరం మృతి చెందింది. తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ వివాహం సృజనతో నిశ్చయించారు పెద్దలు. బుధవారం సాయంత్రం 7 గంటలకు వివాహ ముహూర్తం కాగా, సరిగా ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది అని డాక్టర్లు తెలిపారు.

ఇదీ చదవండి : : మంత్రులకు షాక్.. సమస్యలపై ప్రశ్నల వర్షం.. గడప గడపకు ప్రభుత్వం తొలి రోజే నేతలకు చుక్కలు

అయితే ఆమె గన్నేరు పప్పు తీసుకుందా? లేక వేరే ఎదైనా విషం సేవించిందా..?  అసలు అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది. పెళ్లి ఇష్టం లేకుండా సిద్ధమైతే.. ఉదయం నుంచి అంత సంతోషంగా ఎందుకు ఉంది.. ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Marriage, Vizag

ఉత్తమ కథలు