Big Surprise: విశాఖ సాగర తీరం (vizag beach)లో డాల్ఫిన్ సందడి చేసింది. చాలా అరుదుగా.. తీరానికి సుదూరంగా సముద్రం లో కనిపించే జీవి ఒడ్డుకు వచ్చి కనువిందు చేసింది. విశాఖపట్నం (Visakhapatnam) నుంచి వెళ్లే మార్గంలో తీరానికి డాల్ఫిన్ (Dholphin)కొట్టుకు వచ్చింది. అప్పటికి ఇంకా ఆ డాల్ఫిన్ కు ప్రాణం ఉందని గమనించిన స్థానికులు తిరిగి సముద్రంలోకి పంపించారు. అసలు సముద్ర తీరంలో అరుదుగా కనిపించే డాల్ఫిన్ తీరానికి రావడంతో ఆ సమయంలో బీచ్లో ఉన్న సందర్శకులు ఆసక్తిగా గమనించారు. సాధారణంగా డాల్ఫిన్‌లు లోతైన ప్రాంతంలో సంచరిస్తుంటాయి. ఇవి చాలా అరుదుగా తీరం సమీపంలోకి వస్తుంటాయని మత్స్యకారులు (Fisherman)చెబుతున్నారు. కానీ దాన్ని సముద్రంలోకి పంపించే ప్రయత్నం చేసినా.. పాపం వారి ప్రయత్ని విఫలమైంది..
దూరం నుంచి అయినా డాల్ఫిన్ ఒక్కసారి చూడాలనిచాలామంది కోరుకుంటూ ఉంటారు. అలాంటిది డాల్ఫిన్ ఇంత దగ్గరగా కనిపించే సరికి దాన్ని చూసేందుకు అంతా ఎగబడ్డారు. అయితే ప్రాణంతో ఉండడంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు సముద్రంలోకి పంపించే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది..
Big Surprise || పర్యాటకులను సర్ ప్రైజ్ చేసిన భారీ ఢాల్పిన్ || మత్స్యకారు... https://t.co/4CJw6PtaaZ via @YouTube #Dolphins #Visakhapatnam #VisakhaSummit #VizagTourism #Vizag #fishing #FishingGirls #fishingpics #fishingislife
— nagesh paina (@PainaNagesh) March 9, 2023
సముద్రంలో బోట్లు తగలడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇలా కొట్టుకు రావడం సహజం జరుగుతుందంటున్నారు స్థానికులు. అలాగే ఈ డాల్ఫిన్ కూడా తీరానికి కొట్టుకు వచ్చినట్టు భావిస్తున్నారు. ఇలా బోట్లు తగులుతుండడంతో చాలా వరకు డాల్పిన్ జాతి అంతరిస్తోందని ఆందోళన చెందుతున్నారు జంతు ప్రేమికులు..
ఇంతకీ ఈ ఢాల్పిన్ ఎక్కడ కనిపించింది అంటే.. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం తంతడివాడపాలెం తీరానికి అనుకోకుండా ఇలా కొట్టుకు వచ్చింది. అనారోగ్యమో, మరే ఇతర కారణమోగానీ సముద్ర తీరానికి వచ్చి చాలాసేపు అక్కడే తిరిగింది. ఇసుక వైపు వచ్చేస్తున్న ఆ సముద్రపు డాల్ఫిన్‌ను.. గుర్తించిన మత్స్యకారులు, స్థానిక యువకులు తిరిగి లోపలకు పంపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రాణాల విడిచి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.
ఇదీ చదవండి : జగన్ సర్కార్ కు షాక్.. యధావిధిగా ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ.. ఏపీ జేఏసీ కీలక ప్రకటన
వాడపాలెం తీరానికి బుధవారం మధ్యాహ్నం డాల్ఫిన్ కొట్టుకువచ్చింది. దానిని కొవిరి గోవిందరావు, వంకా ప్రశాంత్ అనే యువకులు చూశారు. కొనఊపిరితో వున్న డాల్ఫిన్‌ను మత్స్యకారుల సహకారంతో అతి కష్టం మీద సముద్రంలోకి నెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. చనిపోయి తిరిగి తీరానికి కొట్టుకు వచ్చింది. మత్స్యకారులు డాల్ఫిన్‌ను తినరు. అందుకే వలలకు చిక్కినా తిరిగి సముద్రంలోనే వదిలేస్తారు. లోతైన సముద్రంలోనే తప్ప… తీరంలో ఈ డాల్ఫిన్లు కనబడవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag