VISAKHAPATNAM BIG SHOCK TO MANGO LOVERS THIS SUMMER BECAUSE ASANI CYCLONE AFFECT ON MANGO FARMERS NGS VSJ NJ
Mango Loss: నోరూరించే పండ్లు.. చేతికి వచ్చిన పంట చేజారిపోయింది..
ప్రతీకాత్మకచిత్రం
Mango Loss: చేతికి వచ్చిన పంట చేజారిపోయింది. రైతులు ఆశలపై అకాల వర్షం నీళ్ళు జల్లింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పంట నేలపాలయ్యింది. ముఖ్యంగా పండ్లలో రారాజు మామిడి పంట నాశనం అయ్యింది. దీంతో అన్నదాలకు ఆక్రందనే మిగిలింది.
Mango Loss: వేసవి కాలం (Summer) ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తుంటారు.. అందుకు ప్రధాన కారణం.. ఈ సిజన్ లో మాత్రమే దొరికే మామిడి పండ్లు (Mango Fruits).. వాటిని ఇష్టపడని వారు అంటే చాలా అరుదుగా ఉంటారేమో..? ధర ఎంత ఉన్నా మామిడి తిననిదే చాలామందికి నిద్ర పట్టదు.. కేవలం పండుగా మామిడి తినడమే కాదు.. దాదా 70 శాతానికి పైగా ఇళ్లలో ఊరగాయలు (Mango Pickle) కూడా పెడుతుంటారు. కారణం ఏదైనా వేసవిలో మామిడికి ఉన్న డిమాండ్ మరే ఇతర వాటికి ఉండదన్నదని బహరంగ రహస్యం. ఇప్పటికే గతంతో పోల్చుకుంటే దిగుబడి తక్కువగా ఉండడంతో భారీ ధరలు భయపెడుతున్నాయి. ఇంత ధరలు ఉంటే కొనేది ఎలా అని మధన పడుతున్నారు. అయితే మామిడి పంటపై ఊహించని విధంగా తుఫాను ప్రభావం చూపించింది.
అసని తుపాన్ (Asani Cyclone) అల్లకల్లోలం సృష్టించింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలపై తుపాన్ పడగ విప్పి.. భారీ నష్టాన్ని మిగిల్చింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, బలమైన గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తుపాన్ కారణంగా తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి (Dangerous Waves).
విశాఖపట్నం జిల్లాలో అసని తుఫాన్ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మామిడి, జీడి తోటలు ధ్వంసం అయ్యాయి. తుఫాన్ దెబ్బకు జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాల్లో తక్కువ మోతాదులో కాసిన కొన్ని కాయలు కూడా నేలమట్టం అయ్యాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాస్తవానికి ఈ ఏడాది మామిడి, జీడిమామిడి పూత తక్కువగా పూసాయి. కాపు కూడా అదే తక్కువ స్థాయిలో వచ్చింది. వేలాది ఎకరాల్లో మామిడి, జీడి మామిడి తోటలు విస్తరించి ఉన్న విశాఖ జిల్లాలో వాటిపై ఆధారపడి జీవించే వారు అధికం. అలాంటిది మామిడి కాయలు పండే దశలో ఉండగా.. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులతో మామిడి చెట్లు నేలకూలగా.. మామిడి కాయలు నేలరాలాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
రాలిన కాయలను, వాలిపోయిన చెట్లను చూసి రైతుల బోరున విలపిస్తున్నారు. ఇంకా పూర్తిగా పక్వానికి రాని సమయంలో కిందపడి కాయలు దెబ్బతినటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. చెట్ల కొమ్మలతో సహా అక్కడక్కడ విరిగిపడ్డాయి. రాలిన కాయలు ఎందుకూ పనికి రాకుండా పోయాయని, అమ్ముదామన్నా కొనే వారే ఉండరంటూ విలపిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.