Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18
Shock to Common Man: సామాన్యుడి బతుకు భారమవుతోంది. రోజు రోజుకూ ఊహించని స్థాయిలో పెరుగుతున్న ధరలు నడ్డి విరుస్తున్నాయి. ఆదాయం పెరగం లేదు కానీ.. ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా వేసవి ఎఫెక్ట్ (Summer Effect) తో మరింత భారం పడుతోంది. సాధారణంగా మాడు పగిలే ఎండలు పెరుగుతుంటే..? మండే ఎండలో చల్లని నిమ్మరసం (Lemon Juice) తాగాలనే ఆశిస్తారు. కానీ అలాంటి వారికి ఇప్పుడు షాకే అని చెప్పాలి. నిమ్మకాయ పులుపే కాదు.. రేటుతో గుబ గుయ్యమనేట్టు చేస్తోంది. ప్రస్తుతం నిమ్మ ధరలు (Lemon Price) ఆకాశాన్నంటుతున్నాయి. ఓ మోస్తరుగా ఉండే కాయ ఒక్కటైనా పది రూపాయలకి ఇవ్వడం లేదు. పెద్ద కాయలైతే కనీసంగా ఇరవై రూపాయలవరకూ ఉంటున్నాయి. కేజీ నిమ్మకాయల ధర మార్కెట్లో 150 నుంచి 200 రూపాయల వరకూ ఉందంటే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేనంతంగా ఈ ధరలు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి అంటున్నారు నిపుణులు.. కేవలం నిమ్మకాయే కాదు.. అల్లం కూడా అదే బాటలో నడుస్తోంది.
వేసవి కావడంతో గతంలో 10 రూపాయలకు తక్కువలో తక్కువ 5కు పైగానే కాయలు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం 10కి రెండు కాయలు ఇవ్వడానికి బేరం ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఇటు తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి, మురారి,ల్కోరుకొండ మండలాల్లో నిమ్మసాగు ఎక్కువగా ఉండేది. అప్పట్లో ధర లేకపోవ డంతో రానురాను నిమ్మతోటలను తగ్గించి.. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టారు. దీంతో నిమ్మకాయల పంట తగ్గిపోయింది.
వారం నుంచీ నాలుగైదు రోజుల్లో కిలో ధర 100 నుంచి 150 రూపాయలకు పెరిగింది. ఇదే ధర కొనసాగితే.. వేసవి మధ్యకు వచ్చే సరికి.. 200 రూపాయలకు పలికినా ఆశ్చర్యపోవాల్సింది లేదని వ్యాపారులు అంటున్నారు. అదే బాటలో చిక్కుడు, బెండకాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కిలోకి 30 పెరిగింది. ప్రస్తుతం బెండ కాయ కిలో 70 రూపాయలు ఉండగా, చిక్కుడు కిలో 55 రూపాయలు ఉంది. మిగతా కూరగాయలు కూడా పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : ఇటు అలంకరణ.. అటు పరాదాలు.. మురికివాడల్ని కప్పేసిన అధికారులు.. ఎందుకంటే..?
అటు అల్లం కూడా ఇదే బాటలో ఉంది. బహిరంగ మార్కెట్లో అల్లం ధరలు భారీగా పెరిగాయి. పదిరోజుల కిందట కిలో 60 ఉన్న అల్లం ఒక్కసారిగా సెంచరీ కొట్టింది. ప్రస్తుతం మార్కెట్లోకి మహారాష్ట్ర , కర్ణాటక , విశాఖ ఏజెన్సీల నుంచి అల్లం దిగుమతి అవుతోంది. 60 కిలోలు ప్రస్తుతం 5,600 ధర ఉంటోందని, వీటిలో తరుగు తీస్తే నికరంగా 50 కేజీలు మాత్రమే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఏజెన్సీ నుంచి అల్లం రాకపోవడంతోపాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో పంట అంతంత మాత్రంగా ఉండడంతో దిగుమతులు తగ్గి, ధర పెరిగిందని అంటున్నారు. రవాణా చార్జీలు పెరుగుదల కూడా ఒక కారణమని ఆవేదన చెందుతున్నారు. అలాగే ప్రతి వేసవి కాలంలో శొంఠితయారీకి భారీగా అల్లాన్ని వినియోగించటం వల్ల సహజంగానే రేటు పెరుగుతుందని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Charging, Lemon, Price hikes, Visakhapatnam