హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Investments: ఏపీ మ‌రో కంపెనీ బిగ్ షాక్..? 2,200 కోట్ల పెట్టుబ‌డులు వెనక్కి..!

AP Investments: ఏపీ మ‌రో కంపెనీ బిగ్ షాక్..? 2,200 కోట్ల పెట్టుబ‌డులు వెనక్కి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనేది ప్రతిపక్షాల వాదన. వారి ఆరోపణలకు తగ్గట్లే ఏపీలో త‌మ పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకుంటున్నట్లు అబుదాబికి చెందిన అగ్ర సంస్థ లులు గ్రూప్ (LuLu Group International) ప్ర‌క‌టించింది.

ఇంకా చదవండి ...

  M. Bala Krishna, Hyderabad, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనేది ప్రతిపక్షాల వాదన. వారి ఆరోపణలకు తగ్గట్లే ఏపీలో త‌మ పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకుంటున్నట్లు అబుదాబికి చెందిన అగ్ర సంస్థ లులు గ్రూప్ (LuLu Group International) ప్ర‌క‌టించింది. ఏపీలో రూ.2,200 కోట్ల‌ను పెట్టుబడి పెట్టాలన్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్నట్లు స్ప‌ష్టం చేసింది ఆ సంస్థ‌. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్ర‌భుత్వంతో త‌లెత్తిన వివాదమే కార‌ణ‌ణంగా తెలుస్తోంది. కేటాయించిన భూమిని రద్దు చేయాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై విసిగిపోయిన లులు గ్రూప్ తాము రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోమని ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సమాచారం. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు విశాఖపట్నంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు లులు గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

  ఐతే బీచ్ ద‌గ్గ‌ర‌ హార్బర్ పార్క్ సమీపంలో కేటాయించిన భూమిని రద్దు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్టోబర్ 30న తీసుకున్న నిర్ణయంతో ప్రాజెక్టు నుంచి వైదొలగాలని లులు గ్రూప్ నిర్ణయించింది. దీంతో ఇప్పుడ ఏపీ నుంచి మ‌రో కీల‌క సంస్థ వెళ్లిపోయినట్లైంది. ఇప్ప‌టికే రాజ‌ధాని అంశంపై క్లారిటీ లేక ఉన్న ఏపీకి కొత్త పెట్టుబడులు రాకపోగా.., గ‌తంలో వచ్చి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ‌లు కూడా వెన‌క్కి వెళ్లిపోవ‌డం కాస్త ఇబ్బందిగా మారింది.

  ఇది చదవండి: ఏపీలో వారందరికీ పెన్షన్లు కట్..? ఓటీఎస్ తో లింక్ పెట్టడంపై విమర్శలు..


  మ‌రో వైపు ఏపీ ప్ర‌భుత్వాన్ని ఇదే అంశంపై ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం కార్న‌ర్ చేస్తోంది. లులు గ్రూప్‌ రూ. 2,200 కోట్ల పెట్టుబడులు పెట్ట‌డానికి నిర్ణ‌యం తీసుకుంది, దీని వల్ల 7,000 మందికి ఉపాధి ఇవ్వ‌నున్న‌ట్లు ఆ కంపెనీ గ‌తంలో ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఈ సంస్థ త‌మ పెట్టుబడులు వెన‌క్కి తీసుకోవడంతో ప్ర‌భుత్వం 7000 మందికి ఉపాధి క‌ల్ప‌న‌కు అవ‌కాశం లేకుండ పోయింది. “ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఏపీలో ఎటువంటి పెట్టుబ‌డులు పెట్ట‌డానికి మా సంస్థ సిద్దంగా లేద‌ని ఆ సంస్థ లులు గ్రూప్ ఇండియా డైరెక్టర్ అనంత్ రామ్ తెలిపారు.

  ఇది చదవండి: జవాద్ మళ్లీ వస్తోందా..? ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలర్ట్..!


  గతంలో కేరళలో పెట్టుబడులు పెట్టిన లులు గ్రూప్ తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులు అన్ని షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి ఆయ‌న తెలిపారు.” “మేము చాలా పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాము మరియు ఈ ప్రాజెక్ట్ కోసం భూమిని లీజుకు తీసుకున్నాము. మేము చాలా పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాము అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ కోసం భూమిని లీజుకు తీసుకున్నాము. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కన్సల్టెంట్‌లను నియమించడం మరియు ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్‌లచే ప్రాజెక్ట్‌ను రూపొందించడం వంటి ప్రాజెక్ట్ అభివృద్ధి ఖర్చుల కోసం మేము పెద్ద మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టిన‌ప్ప‌టికి, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒప్పందాల‌ను ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపులను రద్దు చేసింది” అని లులు గ్రూప్ ఇండియా డైరెక్టర్ అనంత్ రామ్ అన్నారు.

  ఇది చదవండి: జగనన్న విద్యాదీవెన నగదు జమ.. ఆ పరిస్థితి తీసుకురావొద్దన్న సీఎం


  2019 ఫిబ్రవరిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 10,000 కెపాసిటీ కన్వెన్షన్ సెంటర్, 20 లక్షల చదరపు అడుగుల షాపింగ్ మాల్ మరియు విలాసవంతమైన హోటల్ కోసం సివిల్ పనులు ప్రారంభమయ్యాయి. అక్కడి లులు మాల్‌ను చూసేందుకు అప్పటి సీఎం చంద్రబాబు కూడా కొచ్చి వెళ్లారు. అయితే, లులు గ్రూప్‌కు భూమిని కేటాయించే సమయంలో అప్పటి ప్రభుత్వం సిఆర్‌జెడ్ (కోస్టల్ రెగ్యులేషన్ జోన్) నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపణ‌లు కూడా ఉన్నాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, Visakhapatnam

  ఉత్తమ కథలు