Big Shock: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రజల బతులకు భారంగా మారుతున్నాయి. పెరిగిన రేట్లు షాకిస్తున్నాయి. ఏం కొనేట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అనేలా పరిస్థితి ఉంది.. రోజు అవసరం అనుకునే ప్రతి వస్తువు ధర పెరుగుతోంది. కూరగాయల ధరలు అయితే చుక్కలు చూపిస్తున్నాయి. ఇక పప్పు.. నూనెల ధరలు (Oil Price) చూసి గుండె గుభేల్ మంటోంది. పెరిగిన ధరలతో నూనె వడకం తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక విద్యుత్ ఛార్జీలు (Current Charges).. పన్నుల పేరుతో మరో బాదుడు తప్పడం లేదు. సరదగా కుటుంబం ఒకపూట బయటకు వెళ్లి.. ఇంటికి రావాలి అంటే.. రెండు వేలకుపైగా ఖర్చు అవుతోంది. గతంలో రెండు వేల రూపాయలతో తో నెల రేషన్ (Ration) అంతా వచ్చేది.. ఇప్పుడు పది వేలు పెట్టినా కావాల్సినవి కొనుక్కునే పరిస్థితి లేదు. ఇక పెట్రోల్ ధరలు (Petrol Price) అయితే లీటర్ ధర ఎప్పుడో సెంచరీ దాటింది.. అక్కడ నుంచి కిందకు దిగడం లేదు. ఇక సామాన్యుల ప్రయాణ సాధనం ఆర్టీసీ ఛార్జీలు (RTC Charges) సైతం పెరిగాయి. పెరగని ధర అంటూ ఏదీ లేదు. కానీ సామాన్యుల ఆదాయం మార్గాలు మాత్రం పెరగడం లేదు. ఇప్పుడు మరో షాక్ తగలనుంది..
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న సామాన్యుడికి.. నిజంగా ఇది షాకే.. ఏపీలో నవంబర్ 1 నుంచి విజయ పాల ధరలు పెరుగుతున్నాయి. ఈ మేరకు విజయ ఫుల్ క్రీమ్, గోల్డ్ పాల ధర లీటర్కు 2 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. అది కూడా ఈ నవంబర్ నుంచే కొత్త రేట్లు అమలు చేస్తున్నట్టు కృష్ణా మిల్క్ యూనియన్ పేర్కొంది.
ప్రస్తుతం విజయ ఫుల్ క్రీమ్ అర లీటర్ ప్యాకెట్ ధర 34 ఉండగా అది 35 రూపాయలకు పెరుగుతుంది. ఇక విజయ గోల్డ్ ప్యాకెట్ అర లీటర్ ధర 35 రూపాయలు ఉండగా.. 36 రూపాయలకు విక్రయిస్తామని తెలిపింది. రవాణా ఖర్చులు, ప్యాకింగ్ మెటీరియల్ ధర, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే పాల ధరలను పెంచక తప్పడం లేదని.. కృష్ణా మిల్క్ యూనియన్ పేర్కొంది.
ఇదీ చదవండి : సండే సరదాగా చికెన్ తినాలి అనుకుంటున్నారా..? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..?
ఇక్కడ ఊరట కలిగించే అంశం ఏంటంటే? పేద వినియోగదారులు ఉపయోగించే లోఫ్యాట్(డీటీఎం), ఎకానమీ (టీఎం), ప్రీమియం (ఎస్టీడీ) పాల ధరల్లో ఎటువంటి మార్పు లేదని కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు తెలిపారు. పాలు, పాల పదార్థాలకు సంబంధించిన ముడిసరుకులకు ఇతర దేశాల నుంచి ఎక్కువ డిమాండ్ ఉందని.. దీంతో మన దేశంలో కొన్ని రాష్ట్రాల నుంచి సేకరిస్తున్న పాలు, పాల పదార్థాల ముడి సరకుల ధరలు పెరిగాయని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని ఆయన కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Krishna District, Milk price