Setti Jagadeesh, News 18, Visakhapatnam
Big Alert: మందుబాబులతో సామాన్యులకు కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా కొందరి మందుబాబుల ఆగడాలు విశాఖపట్నం (Visakhapatnam) లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా మద్యపానం చేస్తూ.. రోడ్డుపై వెళ్లేవారిపై పడేందుకు ప్రయత్నించడంతో.. వారిని తిట్లు తిడుతూ కొందరు వింత వింతగా ప్రవర్తిస్తూ.. వీరంగం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా బీచ్, సిటీ పరిధిలో చీకటి పడితే చాలు మందుబాబులు వాలిపోతూ హల్ చల్ చేస్తున్నారు. అక్కడ అక్కడ చిమ్మ చీకటిగా ఉండడం, ఎవరూ చూడని బహిరంగ ప్రదేశాలు మందుబాబులకు అడ్డాగా మారిపోయాయి.
చీకటి ప్రదేశాల్లో కానీ, బీచ్ రోడ్డులో మందు కొట్టినా ఎవరూ రారులే అన్న ధీమాతో జల్సా చేసుకుంటున్నారు. తాగిన వీళ్ళు చడి చప్పుడు కాకుండా అక్కడ నుంచి వెళ్లిపోతారు అనుకుంటే అది లేదు. తాగిన సీసాలను రోడ్లపై పగులకొట్టి పైశాచిక ఆనందం పొందుతారు. దీంతో బీచ్ లో ఉదయం, సాయంత్రం వాకింగ్ కి వచ్చే వారు స్థానిక నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇసుకలో గాజు పెంకులు ఉండడంతో ఆ దారిలో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
మందుబాబులకు పుల్ స్టాప్ పెడుతూ విశాఖపట్నంలో ప్రత్యేక డ్రైవ్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వాళ్లపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్, ఆనంద రెడ్డి అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ పోలీసుఆదేశాలు మేరకు, ముడసర్లోవ.. రవీంద్రనగర్, తోటగరువు హైస్కూల్ ఏరియాలలో గంజాయి మరియు మద్యం బహిరంగంగా తాగుతున్నారనే సమాచారం మేరకు త్రినాద్ రావు, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది, SEB సిబ్బంది కలిసి సదరు ప్రదేశాలపై నిఘా ఉంచి ఆరిలోవ కాలనీ ఏరియాలో బహిరంగంగా మద్యం తాగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు.
ఇదీ చదవండి : చంద్రగ్రహణం వీడడంతో తెరుచుకున్న ఆలయాలు.. ఇత్తడి పళ్లెంలో రోకలి నిలబెట్టి ప్రత్యేక పూజలు
ఇక తదుపరి చర్య నిమిత్తం SHO, ఆరిలోవ వారికి అప్పగించారు. బహిరంగ ప్రదేశాల్లోఎక్కడైనా వెహికల్స్ దగ్గర కానీ చీకటి ప్రదేశాల్లో గాని మద్యపానం చేస్తే తస్మాస్ జాగ్రత్త అంటూ ఎక్కడపడితే అక్కడ అనన్సౌమెంట్లు చేస్తున్నారు. విశాఖ నగరంలో వయస్సులోనే యువకులు మద్యానికి అలవాటు పడి వ్యసనాలకు బానిసలు అవుతున్నారు.
ఇదీ చదవండి : ఔను నిజమే జగన్ పై వ్యతిరేకతకు అదే కారణం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
వైన్స్లో, బార్లలో తాగితే ఇంట్లో తెలుస్తుందని బయట ప్రదేశాల్లో మద్యపానంతో పాటు ధూమపానం, గంజాయి తదితర అలవాట్లను సైతం చేస్తున్నారు.అసలు కాలేజీకి వెళ్తున్నారా లేదా అని తల్లిదండ్రులు ఆరా తీసే సమయం లేకపోవడంతో యువత పెడదారి పడుతున్నారనీ, పట్టించుకోని జాగ్రత్తలు చెప్పాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Liquor sales, Local News, Visakhapatnam