VISAKHAPATNAM BETECH STUDENT SMART THEFT HE TARGETED MLAS AND MINSTER HE LOOTED ONE CRORE 8O LAKHS RUPEES NGS VSP
AP Crime: మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కోటి 80 లక్షలు గుంజాడు, ప్రియురాలి కోరిక కోసం.. ఏం చేశాడో తెలుసా?
మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర కోటీ 80 కాజేసిన కేటుగాడు
AP Crime: ప్రేయసి కోసం ఏం చేయడానికైనా సిద్ధమంటారు కొందరు.. లక్షలకు లక్షలు కూడా ఖర్చు చేస్తారు.. కానీ వీడు మామూలోడు కాదు.. ప్రియురాలు కోరిందని.. ఏకం ఎమ్మెల్యేలు, మంత్రులను టార్గెట్ చేశారు. కోటీ 80 లక్షలు కాజేశాడు.. చివరికి ఆ డబ్బులతో ఏం చేశాడో తెలుసా..?
AP Crime: ఈ రోజుల్లో ఈజీ సంపాదన కోసం చాలామంది అడ్డదారులు తొక్కుతున్నారు. అయితే జల్సాల కోసం.. చాలామంది అడ్డదారులు తొక్కుతారు.. చిన్న చిన్న తప్పులు చేసి.. చివరికి పోలీసులకు చిక్కుతారు.. వారందరిలాంటి వాడు కాదు ఈ కేటుగాడు.. ప్రియురాలి కోరిక తీర్చడానికి భారీగానే ప్లాన్ వేశాడు.. ఏం చేశాడో తెలిసి పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. అది కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ (B tech Computer Since ) చదివాడు. అంతేకాదు చాలా టాలెంట్ కూడా ఉంది. టెక్నికల్ గా మంచి ఎక్స్ పర్ట్ (Technically Super Export).. ఆ ప్రతిభ ఉపయోగించుకుని ఉంటే.. మంచి ఉద్యోగంలో చేరేవాడు.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేవాడు కూడా.. అలా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాల్సినోడు పక్కదారి పట్టాడు. ప్రియురాలి మోజులో.. ఆమెను బాగా చూసుకోవాలని కోరికతో.. బద్ధకస్తుడిగా మారాడు.. ఈజీ మనీకి బాగా అలవాడు పడిపోయి నేరాలకు తెరలేపాడు. అలా అని చిన్న చిన్ననేరాలు చేస్తే చీప్ అనుకున్నాడో ఏమో.. ఏకంగా రాజకీయ నాయకుల (Political Leaders) పై ఫోకస్ చేశారు. ఫోన్ కొట్టుడు, కోట్లు పట్టుడు అనే గేమ్ షో ప్లాన్ చేశాడు.
పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. అతడి పేరు విష్ణుమూర్తి (Vishnu Murthy) అలియాస్ సాగర్ (Sagar). పార్యాటక ప్రాంతం విశాఖపట్నం (Visakha) లోని గాజువాక (Gajuwaka)లో ఉంటుంన్నాడు. ఈజీ మనీ (Easy Money) కి అలవాటు పడ్డ అతడు.. సరికొత్త దారి ఎంచుకున్నాడు. పాలిటిక్స్ లో కాకలు తీరిన నేతలనే బురిడీ కొట్టించాడు. కోట్ల రూపాయలు కొల్లాగొట్టాడు.. అయితే దీనికి సాగర్ ఎంచుకున్న రూటు తెలిసి అంతా షాక్ అవుతున్నారు. బాబోయ్ వీడు మామూలోడు కాదు అంటూ.. అతడి స్కెచ్ గురించి తెలిసి నోరెళ్ల బెడుతున్నారు. సాక్ష్యాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలే వలలో పడ్డారంటే విష్ణు మాయ ఏ రేంజ్ లో ఉండి ఉంటుందో ఆలోచించండి.
వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ ద్వారా అతడు మోసాలకు తెరలేపాడు. తాను సీఎం అశోక్ గెహ్లాట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా అంటూ ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్ చేస్తాడు. నా బ్యాంకు అకౌంట్ కి వెంటేనే 20 లక్షలు పంపండి అని చెబుతాడు. మీకు అందించే సెక్యూరిటీకి అది చాలా అవసరం అంటాడు. ముందు జాగ్రత్తగా వాట్సాప్ ప్రొఫైల్ పిక్ గా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫ్యామిలీ ఫొటో పెట్టుకునేవాడు.
ఈ ఏడాది ఏప్రిల్ 24న తిజార నియోజకవర్గం ఎమ్మెల్యే సందీప్ యాదవ్ కి మనోడు ఫోన్ కొట్టాడు. అవే చిలక పలుకులు పలికాడు. అయితే, ఎమ్మెల్యే యాదవ్ కి ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అంతే, సీన్ రివర్స్ అయ్యింది. విష్ణు మాయ గురించి వెలుగులోకి వచ్చింది.. అక్కడ తీగ లాగితే.. పెద్ద డొంకే కదిలింది. తీగ కోసం రాజస్తాన్ పోలీసులు వెతికితే.. ఆ కేటుగాడి అతి తెలివి బయట పడింది. ఫోన్ కాల్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడు విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన విష్ణుమూర్తిగా తెలుసుకున్నారు. వెంటనే స్థానిక పోలీసుల సహకారంతో విశాఖ వచ్చిన రాజస్తాన్ పోలీసులు విష్ణుని అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ పై అతడిని రాజస్తాన్ తీసుకెళ్లారు. పోలీసుల విచారణలో విష్ణు లీలలు బయటపడ్డాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అతడు డబ్బులు గుంజాడని తెలుసుకున్నారు. అయితే అలా దోచిన డబ్బుతో ఏం చేశాడంటే.. ప్రియురాలి కోరికపై ఆమెకు 80 లక్షల ఖరీదైన ఇంటిని కొన్నాడని పోలీసులు గుర్తించారు.
ఏపీలోనూ విష్ణూమూర్తి ఇలాంటి మోసాలకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. 2019లో ఏపీలో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి రూ.కోటి 80 లక్షలు వరకు వసూలు చేసినట్లుగా తెలుసుకున్నారు. దీనికి సంబంధించి విశాఖ సైబర్ క్రైమ్, శ్రీకాకుళం జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చివరికి రాజస్తాన్ పోలీసులే విష్ణు మాయని తెలుసుకోగలిగారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.