హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: వెడ్డింగ్ ఫొటో షూట్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌.. సహజంగా ఏర్పడ్డ శిలా తోరణం.. ప్రత్యేకత ఏంటంటే?

Vizag: వెడ్డింగ్ ఫొటో షూట్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌.. సహజంగా ఏర్పడ్డ శిలా తోరణం.. ప్రత్యేకత ఏంటంటే?

వెడ్డింగ్

వెడ్డింగ్ షూట్ లకు కేరాఫ్

Vizag: విశాఖపట్నంలో ఆర్కేబీచ్‌తో పాటు ఎన్నో ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి మరొక బీచ్ కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. అక్కడ ప్రత్యేకత ఏంటంటే..? సహజ సిద్ధంగా ఏర్పడిన తోరణం పర్యాటకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఆ బీచ్‌ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

  Neelima Eaty, News18 Visakhapatnam

  Vizag: విశాఖపట్నం (Visakhapatnam) అనగానే అందరికి ఠక్కున ఆర్కే బీచ్‌ (RK Beach) మాత్రమే గుర్తుకొస్తుంది. తొట్లకొండ బీచ్ (Thotlakonda Beach)..  చాలా తక్కువ మందికి తెలిసిన బీచ్. అయితే ఈ ప్రదేశం ఇటీవలే  చాలా ట్రెండ్ అవుతుంది. అందుకు కారణం కూడా ఉంది. అది ఏంటంటే..? అక్కడ ఉన్న సహజ తోరణం.. ప్రకృతి స్వయంగా తయారు చేసిన..  అక్కడి అందాలు అటు వచ్చిన పర్యాటకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీ (MVP Colony) కి కేవలం 15 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ సహాజ తోరణం చూసేందుకు ఫొటోలు దిగేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఫోటోషూట్స్ కోసం ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ (Pre Weddingshoot) , కపుల్ షూట్స్ కోసం బాగా పాపులర్ అయ్యింది.

  సన్‌రైజ్‌ వ్యూ అద్భుతం

  వైజాగ్‌లోని ఇతర బీచ్‌ల మాదిరిగానే, మంగమారిపేట బీచ్ కూడా సన్‌రైజ్ బీచ్ (Sunrise Beach) (సముద్రంపై సూర్యుడు ఉదయించే బీచ్). అందుకే ఈ బీచ్‌ని సందర్శించడానికి ఉత్తమ సమయం ఉదయమే. సూర్యోదయ సమయంలో ఈ అర్చరీ చూడడానికి  రెండు కళ్ళు సరిపోవు. బీచ్‌లోని సహజ వంపు ద్వారా సూర్యోదయాన్ని వీక్షించడం ఒక అద్భుతమైన దృశ్యమనే చెప్పాలి..

  వారసత్వ ప్రదేశం

  అనేక ఇతర భారతదేశ భౌగోళిక వారసత్వ ప్రదేశాల మాదిరిగానే, విశాఖపట్నం మరియు భీమునిపట్నం మధ్య ఉన్న మంగమారిపేట బీచ్‌లో సహజంగా ఏర్పడిన ఆర్చ్ నిర్మాణం. తీరం వెంబడి వేల సంవత్సరాల క్రితం గాలి మరియు ఇసుక చర్య ఫలితంగా ఏర్పడిన ఈ సహజ తోరణం నేడు ప్రమాదకర స్థితిలో ఉంది, ప్రజలు అక్కడికి చేరుకోవడం మరియు పెళుసైన నిర్మాణాలపై ఎక్కడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

  ఇదీ చదవండి : ఏయూలో గిరిజన జాతర.. ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు.. ప్రత్యేకత ఏంటంటే?

  వారాంతాల్లో కిటకిటలాడుతుంది…

  వారాంతాల్లో ఒకప్పుడు ఏకాంతంగా ఉన్న బీచ్ సందర్శకులతో కిటకిటలాడుతోంది, సహజ వంపుపై సెల్ఫీలు క్లిక్ చేయడం మరియు కొందరు భౌగోళికంగా సున్నితమైన ప్రదేశంలో బైక్ విన్యాసాలు కూడా చేసేవారు. అయితే ఈ ప్రాంతం ఎలాంటి డెవలప్‌మెంట్‌ లేకుండా ఇలానే ఉండిపోయిందని… కాస్త అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అక్కడే ఉండే ఫొటోగ్రాఫర్‌ చెబుతున్నారు.

  ఇదీ చదవండి : అంతర్జాతీయ వేదికపై మెరిసిన తెలుగు కుర్రాడు.. గోల్డ్ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు.. ఎందులోనో తెలుసా..?

  తొట్లకొండ ప్రాంతంలో బౌద్ధ ఆనవాళ్లు

  వందల ఏళ్ల క్రితం తొట్లకొండ బౌద్ధ సముదాయం విశాఖపట్నం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో భీమిలీ వెళ్లే దారిలో ఈ సముద్రతీరానికి అభిముఖంగా 128 మీటర్ల ఎత్తున్న ఒక కొండపై ఉంది. కొండపై వర్షపు నీటిని సేకరించడానికి రాతిలో తొలచిన అనేక తొట్లు ఉండటంవళ్ళ తొట్లకొండ అని పేరు వచ్చింది. తొట్లకొండ ప్రాచీనకళింగ ప్రాంత ప్రభావంలో ఉండి ఇక్కడ నుండి బౌద్ధ సంస్కృతి శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాలలో వ్యాపించేందుకు ప్రధాన కేంద్రంగా దోహదం చేసింది. తొట్లకొండ, భారతీయ సంస్కృతి ముఖ్యంగా బౌద్ధం ఖండాంతర ప్రదేశాలకు ప్రసరించిన పద్ధతికి అద్దంపడుతుంది.

  ఇదీ చదవండి : సీఎం సొంత జిల్లాల్లో టీడీపీలో చేరికలకు ఎందుకంత డిమాండ్.. ఆ నియోజకవర్గంపై ముగ్గురు కర్ఛీఫ్..

  ఇక్కడ చూడదగ్గ మరికొన్ని ప్రదేశాలు:

  రీ.పూ మూడవ శతాబ్దానికి చెందిన తొట్లకొండ బౌద్ధ స్థూపం శిథిలాలు, తొట్లకొండ వద్ద గజవృశష్టాకార స్థూపం శిథిలాలు, తొట్లకొండ వద్ద మొక్కుబడి స్తూపాలు , తొట్లకొండ దారిలో బుద్ధ విగ్రహం, తొట్లకొండ స్తూపాలు ఇలా ఎన్నో బౌద్ధ ఆనవాళ్లను మనం అక్కడ సందర్శించవచ్చు.

  ఇదీ చదవండి : చంద్రబాబుకు ఎమ్మెల్యే అభినందనలు.. కాదంటూ మంత్రి విమర్శ.. ఒకే వేదికపై ఇద్దరూ ఇలా?

  షూటింగ్‌లకు అడ్డాగా…

  జనాల రద్దీ కూడా ఎక్కువగా లేకపోవడం…సీనరి చూసేందుకు చాలా బాగుండటంతో సినిమా షూటింగ్‌లు, షార్ట్‌ ఫిల్మ్‌ షూటింగ్‌లకు ఈ ప్లేస్‌ అడ్డాగా మారింది. టూరిస్టులు ఎప్పుడైనా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. సాయం కలం సరదాగా అ స్పాట్‌ని చూడడానికి వెళ్తే ఎంతో అహ్లాదంగా ఉంటుంది.


  అడ్రస్: RCH5 CM3, తొట్లకొండ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530048

  ఇదీ చదవండి : యువత అంటే అంత చులకనా..? ఆ హామీ అమలయ్యేదెప్పుడు అని చంద్రబాబు ప్రశ్న

  ఎలా వెళ్లాలి?

  ఈ తొట్లకొండ బీచ్ లేదా మంగమారిపేట బీచ్ కి మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా? అయితే బీచ్ రోడ్డు మీదుగా భీమిలి వైపు వెళితే సరిపోతుంది. మీరు 900k బస్సు ఎక్కి వెళ్ళచ్చు లేదు ఏంవిపి లో ఆటో, రిక్షా మీద కూడా వెళ్ళచ్చు బడ్జెట్లో. సంతోంగా వాహనము తో వెలవచ్చును. లంచ్ చేయాలి అనుకుంటే దానికి దగ్గరలో బే బ్రీజ్ రెస్టారంట్ కూడా ఉంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Best tourist places, Local News, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు