Vizag: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లో ప్రధాన పర్యాటక ఆకర్షణ కలిగిన నగరంగా విశాఖపట్నం (Visakhapatanam) కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి కారణం ఇక్కడ ఉండే పర్యాటక ప్రదేశాలే (Best Tourist Spots). విశాఖలో అడుగు పెట్టిన దగ్గర నుంచి.. చూపు తిప్పుకోనీయకుండా చేస్తాయి అక్కడి అందాలు.. సువీశాల సముద్ర తీరం ఉండడం అదనపు ఆకర్షణ.. నగరంలో కేవలం బీచ్ లు మాత్రమే కాదు.. ఆహ్లాదాన్ని పంచే పార్కులు సైతం ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది కైలాసగిరి.. ముఖ్యంగా కార్తీక మాసంలో తప్పక చూడాల్సిన ప్రదేశం కైలాసగిరి' (kailasa Giri). పేరుకు తగినట్లే భువిపై ఉన్న కైలాసంలా ఈ ప్రాంతం అనిపిస్తుంది. విశాఖ నగరానికి ప్రధాన ఆకర్షణగా, ఏ మూల నుంచి చూసినా కనిపించే విధంగా ఈ పర్వత ప్రాంతం ఉంటుంది.
కైలాసగిరిని వినోదానికి కేరాఫ్ గా చెబుతారు. సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశంలో పర్యాటకులు ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతారు. ఎత్తైన తెల్లని శివ పార్వతుల విగ్రహ రూపాలు టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. కార్తీక మాసంలో పత్యేకంగా ఇక్కడకు చాలామంది వస్తారు. ఇక్కడ ఫోటోలు దిగేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తారు.
Kailasagiri is the Best Picnic Spot in Kartikaasam|| కార్తీక మాసంలో తప్ప... https://t.co/OnAqM8uub4 via @YouTube #Visakhapatnam #tourist #Tourisme #AndhraPradesh #Karthikamasam
— nagesh paina (@PainaNagesh) October 31, 2022
కైలాసగిరి అని పేరు ఎలా వచ్చింది?
కైలాసనాధుడి ఆలయం కారణంగానే ఈ ప్రాంతానికి కైలాసగిరిగా పేరు వచ్చిందని చెబుతారు. ఓంకార స్వామీజీ అనే వ్యక్తి తన తపో శక్తిని ధారపోసి 1951 జనవరి 21న కైలాసనాధుని శివలింగాన్ని ప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇక్కడ పరమశివుణ్ణి మనసారా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం ఉంది.
మరెన్నో ఆకర్షణలు
కైలాసగిరిలో వివిధ పర్యాటక ఆకర్షణలను వీక్షించేందుకు టాయ్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇందులో ఏసీ, నాన్ ఏసీ అనే రెండు విభాగాలు ఉంటాయి. దాని రేట్లు కూడా వేరువేరుగానే ఉంటాయి. పెద్దలకు 150, పిల్లలకు 100 రుసుము వసూలు చేస్తారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితులతో కలిసి ఇందులో సరదాగా షికారు చేయడం ఎంతో బాగుంటుంది. కైలాసగిరి ప్రాంతం ఎప్పుడూ దేశీ, విదేశీ పర్యాటకులతో సందడిగా ఉంటుంది.
ఇదీ చదవండి : వరుస వివాదాల్లో కాణిపాకం సిబ్బంది.. శ్రీవారి దర్శన టిక్కెట్లలోనూ చేతివాటం
కైలాసగిరి వ్యూపాయింట్ అదుర్స్
కైలాసగిరిలో వ్యూపాయింట్ గురించి చాలా చెప్పుకోవాలి. ఒక పక్క నీలి సముద్రం, మరోపక్క వైజాగ్ సిటీ, ఆర్కేబీచ్ రోడ్ …. ఎంత చూసినా చూడాలనిపించే సోయగం. ఇంకో అద్భుతమైన విషయం, శివ పర్వతాల విగ్రహం. కైలాసగిరి అనగానే గుర్తువచ్చేది ఈ విగ్రహాలే అంటుంటారు పర్యాటకులు.
ఇదీ చదవండి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఏపీకి లింకు.. నారాయణ విద్యాసంస్థల్లో సింహయాజీ స్వామి పని చేశారా?
రోప్ వే అనుభూతి మాటల్లో చెప్పలేం..
కేవలం 80/- తో కొండ దిగువన నుండి పై వరకు మనం రోప్‌వే ద్వారా వెళ్ళవచ్చు. వెళ్లి రావడానికి( రెండు ట్రిప్‌లు) రూ. 150 చెల్లించాలి. ఈ రోప్ వే ద్వారా కైలాసగిరి కొండపైకి వెళ్లొచ్చు. మెల్లగా కొండ అంచు నుండి వైజాగ్ అందాలు మరియూ బీచ్ ని తిలకిస్తూ పైకి వెళ్ళడం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. టైమింగ్స్ : ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పర్యాటకుల కోసం తెరిచి ఉంటుంది.
ఎలా వెళ్లాలి ?
ఈ కైలాసగిరికి చేరుకోవడానికీ ఎన్నో దారులు వున్నయ్. మీరు బైక్ లేడా కార్ లో హనుమంత వాక జంక్షన్ నుచ్చి లేడ బీచ్ రోడ్ నుండి కొండ ఎక్కవచ్చు లేదా కాళీ నడక కూడా ఈ గిరి ఎతును చేరుకోవచ్చు. సిటీ బస్సులు కూడా మిమ్మల్ని కొండ పైకి చేరుతాయి. బస్టాండ్ నుంచి 10K బస్సు ఎక్కితే కైలాసగిరికి తీసుకెళ్తుంది. లేదా ఆటోకానీ, క్యాబ్గానీ బుక్ చేసుకుంటే ఫ్యామిలీతో సరదాగా వెళ్లిరావచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Best tourist places, Visakhapatnam