Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM BEST TOURIST SPOT IN VISAKHAPATNAM IT IS NEAR BY KAILASAGIRI CALLED TENNTI PARK NGS VSJ NJ

Vizag: హోరుమని సముద్ర కెరటాల హోరు.. మనసును ఆహ్లాదపరిచే ఉద్యానవనం మరోవైపు.. తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది

ప్రత్యేక

ప్రత్యేక ఆకర్షణగా తెన్నీటి పార్క్

ఆ పార్క్ కి వెళ్తే సుందర సాగరతీరం తో పాటు ఉద్యానవనంలో ఆడుకునేందుకు మంచి వాతావరణం. చిన్న వయసు నుండి , పెద్ద వయస్సు వారు వరకు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఎంతో మంచి ప్రదేశం. ఎక్కడుందంటే…!

  Setti Jagadeesh, News 18, Visakhaptnam

  Vizag: విశాఖపట్నం (Visakhapatnam) లో తెన్నేటి పార్క్ (Tenneti Park) ఫ్యామిలీతో కలిసి వీకెండ్స్‌లో ఎంజాయ్‌ చేయడానికి ది బెస్ట్‌ స్పాట్‌. అలల హోరును వింటూ చల్లని వాతావరణంలో కూర్చుని ఎంజాయ్‌ చేయాలనుకుంటే… ఈ పార్క్‌కు వెళ్లాల్సిందే. విశాఖ నగరంలో మొట్టమొదటి పిల్లల ఉద్యానవనం, విశాఖపట్నంలోని పురాతన పార్కులలో  ఇది ఒకటి అని చెప్పాలి. విశాఖపట్నం  రాజకీయ ప్రముఖుడు, స్వాతంత్ర్య సమరయోధుడు  తెన్నేటీ విశ్వనాధం (Tenneti Viswanadham) పేరు మీద ఈ పార్క్ పేరు పెట్టారు. పార్క్ ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ పార్కులో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటుచేసింది గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పోరేషన్‌.

  ఒకవైపు ఉద్యావనం మరోవైపు సాగరతీరం                                          ఉద్యానవనం మధ్యలో ఉన్న భారీ వృత్తాకార రాతి నిర్మాణం ఈ ప్రదేశానికి మంచి గుర్తింపు పెంచుతుంది. ఇక్కడ తెన్నెటి పార్క్ బీచ్ నుండి సుందరమైన సూర్యాస్తమయాలను, అలల హోరును ఆస్వాదించవచ్చు. పార్కులో ఆడుకుంటూ, చిందులు వేసుకుంటూ గడిపిన తరువాత.. వెనుక ఉన్న మెట్ల మార్గం ద్వారా సాగర తీరానికి వెళ్లి…. అలల నడుమ పర్యాటకులు ఎంజాయ్ చేయవచ్చు. ఒకపక్క ఉద్యానవనం, మరొక పక్క సాగరతీరం ఒకే దగ్గర ఉండడంతో ఈ ఉద్యానవనానికి పర్యాటక ప్రేమికులు తాకిడి ఎక్కువ. 

  ఎన్నో సినిమా షూటింగ్‌కు అడ్డా…!
  ఈ ప్రదేశం అనేక హిందీ, తమిళం, తెలుగు మరియు ఒరియా సినిమా షూటింగ్‌లకు కేరాఫ్‌గా ఉంటుంది. ఈ బీచ్ భారతదేశంలోని అత్యంత అందమైన బీచ్‌లుగా ప్రసిద్ధి చెందింది. దాని చుట్టూ ఒకవైపు పర్వతాలు మరియు మరోవైపు సముద్రం ఉంది. అవుట్‌డోర్‌లో అద్భుతమైన ల్యాండ్‌స్కేప్ షాట్‌లను క్లిక్ చేయాలనుకునే ఫోటోగ్రాఫర్‌లకు కూడా ఇది అనువైన ప్రదేశం.

  ఇదీ చదవండి : వెడ్డింగ్ ఫొటో షూట్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌.. సహజంగా ఏర్పడ్డ శిలా తోరణం.. ప్రత్యేకత ఏంటంటే

  ఏ కాలమైనా చల్లని వాతావరణం                                                        బంగాళాఖాతం తీర సమీపంలో ఈ పార్క్ ఉండడంవల్ల ఇక్కడ వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. ఈ ఉద్యానవనంలో వేడి తేమతో కూడిన వాతావరణాన్ని కలిగిస్తుంది. వేసవి కాలంలో, ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు నలభై-ఐదు డిగ్రీల వరకు కొన్నిసార్లు అంతకంటే ఎక్కువగా ఉంటాయి. చలికాలం దాదాపు పద్దెనిమిది నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ వరకు చాలా చల్లగా ఉంటుంది. ఏ కాలంలోనైనా చల్లని వాతావరణాన్ని అందిస్తూ ఎంతో మంది పర్యాటకులను ఈ పార్క్ ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో బీచ్‌లో సగటున తొమ్మిది వందల నలభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతంతో భారీ వర్షాలు కురుస్తాయి.

  ఇదీ చదవండి : ఏయూలో గిరిజన జాతర.. ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు.. ప్రత్యేకత ఏంటంటే?

  కైలాసగిరికి కూడా వెళ్లొచ్చు..!                                                                          పర్యాటక ప్రయోజనాల కోసం తెన్నేటి పార్క్ ను ఇటీవల పునరుద్ధరించారు. ఇక్కడినుండి పార్క్ వెనుక ఉన్న కైలాసగిరి కొండలకు కూడా వెళ్ళవచ్చు. పార్క్ లో ఉన్న రైలు ప్రయాణం ద్వారా సమీప కొండ సహజ దృశ్యాలు చూడవచ్చు.  హుదూద్‌ తుఫాను కారణంగా ధ్వంసమైన ఈ పార్క్‌ను పునరుద్ధరించడానికి ఉత్తర అమెరికాకు చెందిన గీతం పూర్వ విద్యార్థులు కలిసి సుమారు 60 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీకెండ్స్‌ వచ్చాయంటే నగర వాసులంతా ఫ్యామిలీలతో ఇక్కడ వాలిపోతుంటారు. పిల్లలు పెద్దలు ఎంజాయ్‌ చేయడానికి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.

  ఇదీ చదవండి : వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభం.. 30 ఏళ్ల పాటు రాబడి..? ఇంకా ప్రయోజనాలు ఎన్నో

  టైమింగ్స్‌: పార్క్ ఉదయం 6:00 నుండి రాత్రి 9:00 వరకు తెరిచి ఉంటుంది. వారంలోని అన్ని రోజులలోనూ తెరిచే ఉంటుంది. పార్కులోకి ప్రవేశించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము అవసరం లేదు. 

  అడ్రస్‌: బీచ్‌ రోడ్‌, కైలాస్‌గిరి హిల్స్‌ ఎదురుగా, జడుగుపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌- 530001

  ఎలా వెళ్లాలి?
  బస్టాండ్‌ నుంచి నేరుగా బస్సులు, ఆటోలు, క్యాబ్‌లలో అక్కడకు వెళ్లొచ్చు. రైలు మార్గం ద్వారా అయితే వైజాగ్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడ నుంచి నేరుగా బస్సులో, ఆటోలో అక్కడకు వెళ్లొచ్చు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు