హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakha: లంబసింగిలో సరికొత్త ఆహ్లాదంతో పాటు థ్రిల్లింగ్.. ఆహ్వానం పలుకుతున్న బోటు షికారు..

Visakha: లంబసింగిలో సరికొత్త ఆహ్లాదంతో పాటు థ్రిల్లింగ్.. ఆహ్వానం పలుకుతున్న బోటు షికారు..

X
లంబసింగిలో

లంబసింగిలో ఆహ్లాదంతో పాటు థ్రిల్లింగ్

Visakha: ఆంధ్రకశ్మీర్‌ లంబసింగిలో తాజంగి రిజర్వాయర్‌ బోట్ షికార్ పర్యటికలను ఎంతగానో కట్టుకుంటుంది. లంబసింగి వచ్చే పర్యాటకలందరూ బోటు షికారు చేసి ఎంతో ఆనందిస్తున్నారు. ఐటీడీఏ, పర్యాటక  అధ్వర్యంలో లో ఈ బోటు షికార్‌ నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

ఉమ్మడి విశాఖపట్నం (Visakhapatnam) మన్యంలో శీతాకాలం (Winter) వచ్చిందంటే చాలు వర్షంలా కురుస్తున్న మంచుతో లంబసింగి (Lambasinghi) , పాడేరు (Paderu), అరకు (Araku) ప్రాంతాలు అన్ని మంచు అందాలుతో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆంధ్రా ఊటీ (Ooty)గా పిలవబడే మన్యం డిసెంబరు నుంచి జనవరి చివరి వరకూ చాలా చల్లటి వాతావరణం, మంచు దుప్పటి కప్పినట్టు కనిపిస్తుంది. ఈ మన్య ప్రాంతమంతా కూడా సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉదయంచాలా చల్లగా వుంటుంది. శీతాకాలం వచ్చింది అంటే మన్యం ప్రాంతం అంతా కూడా సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. గిరిజన గ్రామాల్లో ఉదయం పదిగంటలైనా సరే సూర్యుడు మనకి కనిపించడం జరగదు.

అంతేకాదు లంబసింగికి మరో ప్రత్యేకత కూడా ఉంది. తాజంగి రిజర్వాయర్‌ బోట్ షికార్ పర్యటికలను ఎంతగానో కట్టుకుంటుంది. లంబసింగి వచ్చే పర్యాటకలందరూ ఈ బోటు షికారు చేసి ఎంతో ఆనందిస్తున్నారు. ఐటీడీఏ , పర్యాటక ఆధ్వర్యంలో ఈ బోటు షికార్‌ నిర్వహించడం జరిగింది. ఒక్కో పర్యాటకులకు వంద రూపాయలు చొప్పున నిర్వాహకులు తీసుకోవడం జరుగుతుంది. 20 నిమిషాల పాటు తిరిగే ఈ బోట్ షికారు ఎంతో ఆహ్లాదంగా థ్రిల్లింగ్ ఉందంటున్నారు పర్యాటకులు.

శీతాకాలం వచ్చిందంటే పెద్ద ఎత్తున వంజంగి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ పాడేరు చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. మన్యం వచ్చే ప్రతి ఒక్కరికి తాజంగి రిజర్వాయర్ లో బోట్ షికారు చేసి మిగతా ప్రదేశాలకు వెళ్లి పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి : విద్యార్థులకు మరో శుభవార్త.. రేపు తల్లుల ఖాతాలోకి నగదు జమ చేయనున్న సీఎం జగన్

పాడేరు ఐటీడీఏ సహకారంతో పర్యాటక వికాస్‌ సభ్యులు తాజంగి రిజర్వాయర్‌ వద్ద అడ్వంచర్‌ టూరిజం(సాహస క్రీడలు) ఏర్పాటు చేశారు. జిప్‌లైన్‌, ఆర్చరీ, బంగీజంప్‌ తదితర క్రీడలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పర్యాటక వికాస్‌ ఒక్కో బోటు రూ.ఆరు లక్షలు వెచ్చించి బోటు నీ కొనుగోలు చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఇదీ చదవండి: తెలుగు మహిళకు మిసెస్ ఆసియా టైటిల్.. తొలి దక్షిణ భారత మహిళగా అరుదైన గుర్తింపు

మూడు నెలలుగా పర్యాటక వికాస్‌ సభ్యులు రిజర్వాయర్‌లో బోటు షికార్‌ నిర్వహిస్తున్నారు. ఇది ఇలావుండగా తాజంగి రిజర్వాయర్‌ పరిధిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో గిరిజన మత్స్యకారుల సంఘం నడుస్తున్నది. ఈ సంఘం పరిధిలోనున్న గిరిజన రైతులు రిజర్వాయర్‌లో చేపలు పెంచుకొని ఉపాధి కూడా పొందుతున్నారు.

ఇదీ చదవండి : ఆ నెలలోనే అసెంబ్లీ రద్దు.. ఎన్నికలు ఎప్పుడంటే..? నేతలకు సమాచారం అందిందా..?

లంబసింగి వచ్చే పర్యాటకులకు టిఫిన్,టీ దుకాణాలతో పాటు రాత్రి పూట పడుకునేదుకు గుడారాలు అద్దెకివ్వడం, పర్యాటకులు కోరిక మేరకు వారికి కావాల్సిన భోజన సౌకర్యాలు అందించడం చేస్తూ స్థానికంగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ యువతకుకావలసిన గుడారాలు, ఫ్యామిలీకి సంబంధించిన గుడారాలు అందరికీ అన్ని రకాల సౌకర్యాలతో అందుబాటులో ఉంటున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Araku, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు