Karthika Masam 2022: నేటి నుంచి కార్తీక మాసం (Karithika Masam) ప్రారంభమైంది. అత్యంత పవిత్రంగా భావించే ఈ నెలలో.. శివుడు అభిషాకలు చేయడమే కాదు.. పికినిక్ ల పేరుతో పర్యాటక ప్రాంతాలు చుట్టేయాలని చాలామంది ఆరాటపడతారు. చలికాలం మొదలవ్వడంతో.. అందమైన పర్యాటక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయా అని ఆరా తీస్తుంటారు.. అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు మనసుకు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆహ్వానం పంపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర (Uttarandhra)లో కొత్త కొత్త పర్యాటక ప్రదేశాలు (Tourist Spots) వెలుగులోకి వస్తున్నాయి కూడా.. విశాఖ (Visakha), విజయనరం జిల్లా (Vizianagaram District) ఏజెన్సీల్లో ఇప్పటికే ఎన్నో అందాలను కునుగొన్నారు. అవన్నీ ఇప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగు గుర్తింపు పొందాయి.
తాజాగా ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న మహేంద్రగిరి హిల్స్ (Mahendragiri Hills).. పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది. మనసకు ఆహ్లాదాన్ని పంచే చల్లటి ప్రదేశం అది.. మేఘాలు ముద్దాడుతున్నాయా అనేలా పర్వతాలు దర్శనిమిస్తాయి. పాండవలు నడయాడిన పర్వత ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అనతి కాలంలోన అద్బుతమైన పర్యాటక ప్రాంతం (Tourist Spot)గా గుర్తింపు తెచ్చుకుంది.
Karithika Masam Best Tourist Spot ||ఆహ్వానం పలుకుతున్న భూతల స్వర్గం ||పు... https://t.co/XKX9IoMBXF via @YouTube #Karthikamasam #tourist #Tourism #TouristCats #Tours #tourismday #AndhraPradesh #OdishaFC
— nagesh paina (@PainaNagesh) October 26, 2022
ఆంద్రా ఒడిశా మధ్యలో గజపతి జిల్లా (Gajapati District) ఉన్నాయి మహేంద్రగిరి హిల్స్. అయితే ఇది.. కేవలం సుందరమైన ప్రదేశం మాత్రమే కాదు, ఇది అపారమైన పౌరాణిక ప్రాముఖ్యతతో పాటు అ.. రుదైన ఔషద జాతుల వృక్షజాలం, జంతుజాలానికి ఆవాసంగా ఉంది. ముఖ్యంగా సన్ రైజ్ .. సన్ సెట్ రెండు దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుంది.
సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఇటు ఆంధ్రా ప్రాంతంలోని కళింగదళ్ నుంచి అటు ఒడిశా ప్రాంతమైన గొసాని, గజపతి జిల్లాల వరకూ మహేంద్రగిరులు వ్యాపించి ఉన్నాయి. ఈ కొండ తూర్పు కనుమల మధ్య 4,925 అడుగుల ఎత్తులో ఉంది. ఏపీలో ఉన్న గంజాం ప్రాంతం.. శ్రీకాకుళం సరిహద్దులో విస్తరించి ఉంది. అంతేకాదు మహేంద్రగిరి ఒడిశాలో రెండవ ఎత్తైన పర్వత శిఖరంగా గుర్తింపు పొందింది.
మహేంద్రగిరి పైన ఉన్న గోకర్ణేశ్వర్ దేవాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అత్యధికంగా కార్తీక మాసంతో పాటు.. శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కొండపై ఉన్న శివుడుని ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు. కేవలం ఇది పర్యాటక ప్రాంతమే కాదు.. ఇక్కడ చాలా అరుదైన ఔషదాలు లభిస్తాయి.. వనవాసం సమయంలో పాండవులు ఈ ప్రాంతంలో వనమూలికల మొక్కలు వేసినట్టు ప్రతీతి. అందుకే ఇది కేవలం అందమైన ప్రాంతమే కాదు.. సంజీవని కూడా అంటూ ఉంటారు. ప్రస్తుతం మహేంద్రగిరి పర్వతాల్లో దాదాపు 300 రకాల వనమూలికలు లభ్యమవుతున్నాయి అని చెబుతున్నారు.
ఎలా వెళ్లాలి..? మహేంద్రగిరిని సందర్శించాలంటే మొదట బురుఖత్ చేరుకోవాలి. అక్కడి నుంచి కొండపైకి చేరుకోవాలంటే ఘాట్ రోడ్లలో సుమారు 7 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. మొదట విశాఖ చేరుకుని.. ఉత్తరాంధ్రలో ఉన్నవారికి చాలామందికి ఈ ప్రాంతానికి ఎలా వెళ్లాలో తెలుస్తుంది. హైదరాబాద్ లేదా ఇతర పట్టణాల నుంచి వచ్చే వారు మొదట విశాఖ చేరుకుని.. అక్కడ నుంచి ఒడిషా వెళ్లే బస్సులు లేదా ట్రైన్లను ఆశ్రియించవచ్చు.. ప్రైవేటు ట్రావెల్స్ ను బుక్ చేసుకున్నా విశాఖ నుంచి అందుబాటులో ఉంటాయి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Best tourist places, Tourist place