Mahendra Hills: ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర (Uttarandhra)లో కొత్త కొత్త పర్యాటక ప్రదేశాలు (Tourist Spots) వెలుగులోకి వస్తున్నాయి కూడా.. విశాఖ (Visakha), విజయనరం జిల్లా (Vizianagaram District) ఏజెన్సీల్లో ఇప్పటికే ఎన్నో అందాలను కునుగొన్నారు. అవన్నీ ఇప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగు గుర్తింపు పొందాయి. భారీగా పర్యాటకులు అక్కడకు వస్తున్నారు. తాజాగా ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న మహేంద్రగిరి హిల్స్ (Mahendragiri Hills).. పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది. మనసకు ఆహ్లాదాన్ని పంచే చల్లటి ప్రదేశం అది.. మేఘాలు ముద్దాడుతున్నాయా అనేలా పర్వతాలు దర్శనిమిస్తాయి. పాండవలు నడయాడిన పర్వత ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అనతి కాలంలోన అద్బుతమైన పర్యాటక ప్రాంతం (Tourist Spot)గా గుర్తింపు తెచ్చుకుంది. ఆంద్రా ఒడిశా మధ్యలో గజపతి జిల్లా (Gajapati District) ఉన్నాయి మహేంద్రగిరి హిల్స్. అయితే ఇది.. కేవలం సుందరమైన ప్రదేశం మాత్రమే కాదు, ఇది అపారమైన పౌరాణిక ప్రాముఖ్యతతో పాటు అ.. రుదైన ఔషద జాతుల వృక్షజాలం, జంతుజాలానికి ఆవాసంగా ఉంది. ముఖ్యంగా సన్ రైజ్ .. సన్ సెట్ రెండు దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుంది.
సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఇటు ఆంధ్రా ప్రాంతంలోని కళింగదళ్ నుంచి అటు ఒడిశా ప్రాంతమైన గొసాని, గజపతి జిల్లాల వరకూ మహేంద్రగిరులు వ్యాపించి ఉన్నాయి. ఈ కొండ తూర్పు కనుమల మధ్య 4,925 అడుగుల ఎత్తులో ఉంది. ఏపీలో ఉన్న గంజాం ప్రాంతం.. శ్రీకాకుళం సరిహద్దులో విస్తరించి ఉంది. అంతేకాదు మహేంద్రగిరి ఒడిశాలో రెండవ ఎత్తైన పర్వత శిఖరంగా గుర్తింపు పొందింది. మహేంద్రగిరిని సందర్శించాలంటే మొదట బురుఖత్ చేరుకోవాలి. అక్కడి నుంచి కొండపైకి చేరుకోవాలంటే ఘాట్ రోడ్లలో సుమారు 7 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
Best Tourist Spot in Rainy Season || Mahendra Giri Hills || ఆంధ్రా బోర్డ... https://t.co/PmjcxgIVWk via @YouTube #Tourist #Tourism #tourofscandinavia #Tourists #tour #AndhraPradesh #Odisha @thelocaltourist @thegrandtour @AndhraTourism
— nagesh paina (@PainaNagesh) August 14, 2022
ఇప్పటికే అధికార యంత్రాంగం బురుఖత్ నుండి మహేంద్రగిరి పైన ఉన్న గోకర్ణేశ్వర్ దేవాలయం వరకు రోడ్లను నిర్మించింది. మొత్తం ఘాట్ రోడ్డు కావడంతో రహదారి పనులు ఛాలెంజ్ గా నిలిచాయి. గతంలో రోడ్లు లేకపోవడంతో పర్యాటకులు ఇక్కడికి చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. శ్రావణ మాసంలో ఇటీవల అక్కడి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది అంటున్నారు. ఎందుకంటే శిడుడికి ఇష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ సమయంలో కొంతమంది బోల్ బోమ్ భక్తులు శివలింగంపై పోయడానికి పవిత్ర జలంతో ఈ ప్రదేశానికి చేరుకుంటారు.
అత్యధికంగా కార్తీక మాసంతో పాటు.. శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కొండపై ఉన్న శివుడుని ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు. శ్రావణ మాసంలో భారీగానే పర్యాటకులు వస్తున్నారు. చిన్నచిరు జల్లులు ఉన్నప్పుడు మేఘాలు పర్వాలను తాకేలా ఉంటాయని.. ఆ అందాలను ఈ సీజన్ లో చూడొచ్చు అంటున్నారు. భారీ వర్షాలు ఉన్నప్పుడు ఈ రోడ్డుల్లో ప్రయాణం కాస్త ఇబ్బందికరమే.
కేవలం ఇది పర్యాటక ప్రాంతమే కాదు.. ఇక్కడ చాలా అరుదైన ఔషదాలు లభిస్తాయి.. పారిజాత, పుత్రజీవక, అర్జుర, కీతకి, కృష్ణబీజ, నాగదంతి, రక్తనిర్వాసం, రక్తచందనం, రోహిష, వనవలాండు, వికంకత, శతావరి, నేలమేవు, తిప్పతీగ(గుడుచి), నల్లేరు, విషముష్టి, లంకామొదం, సుగంధపాలు, జిల్లేడు, నెల్లఉప్పి, కోరింత, ఊడుగాం, సరస్వతి, తెల్లఈశ్వరి, నల్లఈశ్వరితో పాటు అనేక రకాల వనమూలికలు ఈ ప్రాంతంలో ఉండేవని సమాచారం. వనవాసం సమయంలో పాండవులు ఈ ప్రాంతంలో వనమూలికల మొక్కలు వేసినట్టు ప్రతీతి. అందుకే ఇది కేవలం అందమైన ప్రాంతమే కాదు.. సంజీవని కూడా అంటూ ఉంటారు. ప్రస్తుతం మహేంద్రగిరి పర్వతాల్లో దాదాపు 300 రకాల వనమూలికలు లభ్యమవుతున్నాయి అని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ap tourism, Best tourist places, Odisha, Srikakulam