Best Tourist Spot: వింటర్ అందాలకు కేరాఫ్ గా నిలుస్తోంది విశాఖ ఏజెన్సీ (Visakha Agency).. ఊటీని మించిన అందమైన ప్రదేశాలు కొత్త కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. వింటర్ సీజన్ ప్రారంభం అయ్యింది అంటే.. అందరి చూపు పర్యాటక ప్రాంతాలపైనే ఉంటుంది. కొత్త స్పాట్ లు ఏవేనా ఉన్నాయా అని చాలామంది ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి ఆహ్వానం పలుకుతోంది ఓ భూతల స్వర్గం.. ఈ ప్రదేశం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఆంధ్ర ఊటీ అరకులోయ (Araku Valley) అంటే ప్రకృతి అందాలకు నెలవు. శీతాకాలం వచ్చిందంటే చాలు.. అందమైన ప్రకృతి సుందర దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. ప్రకృతి సోయగాలు మరింత పులకిస్తూ పర్యాటకలను రా రా రమ్మని పిలుస్తూ ఉంటాయి. లంబసింగి (Lambasingi).. వంజంగి (Vanjangi) లాంటివి ఇప్పటికే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
ఆ జాబితాలో మరో ప్రకృతి రమణీయ ప్రదేశం చేరింది. కొండల మధ్య పాల కడలిని తలపించేలా మాడగడ (Madagada) లో ప్రకృతి సోయగం కనువిందు చేస్తోంది. భూతల స్వర్గాన్ని తలపించే మాడగడ ప్రకృతి సోయగం పర్యాటకులను మెస్మరైజ్ చేస్తుంది. కొండల మధ్య పాలసముద్రం మాదిరిగా కమ్మిన మంచు మేఘాలు కనువిందు చేస్తున్నాయి.
Madagada || New Best Tourist Spot || ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలని... https://t.co/TwKIaMPxQd via @YouTube #Vizag #visakhagarjana #Tourist #Tourism #Tours #Tourisme #Tourism_Development_Fund
— nagesh paina (@PainaNagesh) October 27, 2022
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే..? సూర్యోదయాన్నే లేలేత కిరణాలు ఆ మంచు మేఘాలను తాకితే వెండి వర్ణంలో తల తల మెరిసిపోతోంది ఆ ప్రాంతం. తాజాగా ఆంధ్రా ఓటి అరకులోయ పరిసర ప్రాంతంలో బయటపడిన ఈ మాడగడ అద్భుత సుందర దృశ్యాలు పర్యాటకులను చాలా ఆకట్టుకుంటున్నాయి. అరకులోయకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. ఈ వ్యూ పాయింట్ కి చేరుకోవాలంటే అరకు నుంచి రోడ్డు మార్గంలో ప్రయానించ్చాల్సి ఉంటుంది.
అరకు లోయ అంటే ఇప్పటి వరకు వంజంగి, లంబసింగి అందాలు మాత్రమే పర్యాటకులను మంత్ర ముగ్దులు చేసేవి. ఆ రెండు ప్రాంతాలకు ఇప్పటికే పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో ఇప్పుడు అంతా మాడరడ పాల కడలిలా ఉండే మంచు మేఘాల అందాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. అయితే.. ఈ మధ్యనే వెలుగులోకి వచ్చిన మాడగడ ప్రాంతంలోని ఈ అద్భుత ప్రకృతి దృశ్యాలు వాటికి తలదన్నేలా ఆకర్షిస్తున్నాయి.
ఇదీ చదవండి : ఎట్టకేలకు అలీకి కీలక పదవి.. అయినా అసంతృప్తి వీడలేదా..? పార్టీ మారుతున్నారా?
ప్రస్తుతం విశాఖ పరిశర జిల్లా వారికి మాత్రమే దీని గురించి తెలిసేది. ఇప్పుడు ఆ నోటా ఈనోటా అందరికీ తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు పర్యాటకులు. కొండల మధ్య మంచు అందాలను కెమెరాల్లో బందిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. మాడగడపై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు టూరిజం అధికారులు. పాడేరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి వారికి నివేదిక సమర్పిస్తామని, తగిన సౌకర్యాలు మౌలిక అవసరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని ఐటీడీఏ టూరిజం మేనేజర్ మురళి అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ap tourism, Best tourist places, Visakhapatnam