Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM BEST SHOOTING SPOT MAINLY SOUTH INDIAN FILMS SHOOTINGS IN THE ANDRA UNIVERSITY NGS VSJ NJ

Best Shooting Spot: ప్రేమ, కాలేజ్ నేపథ్యం ఉన్న సినిమా షూటింగ్ లకు అడ్డా..? హిట్టు సెంటిమెంట్ కూడా?

సినిమా షూటింగ్ లకు అడ్డా..?

సినిమా షూటింగ్ లకు అడ్డా..?

Best Shooting Spot: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్ లు ఉన్నాయి. అయితే ఈ స్పాట్ వెరీ స్పెషల్.. ముఖ్యంగా ప్రేమ కథలకు.. కాలేజ్.. చదువు బ్యాక్ డ్రాప్ స్టోరీలు ఉంటే.. కచ్చితంగా ఆ దర్శకుల చూపు ఈ అడ్డపైనా పడుతుంది.. కారణం ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...
  Setti Jagadeesh, News 18, Visakhaptnam.

  Best Shooting Spot: దేశానికి ఎందరో మేధావులను అందించిన యూనివర్శిటీ అది.. రాజకీయ, సినీ ప్రముఖులు ఎంతో మంది ఇక్కడ చదివిన వారే.. ఇక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఇంతర కంపెనీల్లో టాప్ పొజిషన్లలో ఉన్నవారు.. ఉన్నతాధికారులు అధికారులు.. వ్యాపారా దిగ్గజాలు.. ఇలా ఎందరో ఆ యూనివర్శిటీ విద్యార్థులే.. అదే విశాఖపట్నం (Visakha Patnem)లో ఉన్న ఆంధ్రా యూనివర్శిటీ (Andhra University).. అయితే వైజాగ్ లో ఉన్న బీచ్ ఎంత ఫేమస్సో.. యూనివర్శిటీ సైతం అంతే ఫేమస్ అయ్యింది. దేశ, వీదేశాల నుంచి ఎందరో విద్యార్థులు ఇక్కడ చదువుకోడానికి వస్తారు.  ఎందుకంటే  యూనివర్సిటీకి ఉన్న చరిత్ర అలాంటిది. అక్కడ నుంచి ఎంతో మంది గొప్పవ్యక్తులు తమ డిగ్రిల పట్టాల అందుకున్నారు. మరెందరో తమ ఉన్నత భవిష్యత్ కు బాటలు వేసుకున్నారు.. ఇంకొందరు జీవితంలో బతకడం నేర్చుకున్నారు. ఇలా తన చెంతకుచేరిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్పిస్తుంది ఈ యూనివర్సిటీ. ప్రస్తుతం ఏ పొజిషన్ లో ఉన్నా.. పూర్వ విద్యార్థులు అందరికీ  వర్శిటీతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అది కేవలం విశ్వవిద్యాలయమే కాదు.. ఎంతోమంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసి.. మరెన్నో మరుపురాని జ్ఞాపకాల (beautiful memories) ను అందించిన అందమైన అమ్మ ఒడి.

  ఇలా ఎన్నో అనుబంధాలను పెనవేసుకున్న ఈ యూనివర్సిటీ పురాతన భవనాలు, ఆహ్లాదకరమైన చల్లని ప్రదేశం.. వింటేజ్ లుక్ (vintage look)తో చాలా సహజంగా కనిపిస్తుంది. ఈ యూనివర్సిటీలో సినిమా షూటింగ్ లు చేసేందుకు మన డైరక్టర్లు ఆసక్తి చూపుతారు. అందుకే ఈ అమ్మ ఒడి..ఆ కళామ్మతల్లి తోబుట్టువులా మారింది.

  ఇదీ చదవండి : నిమ్మచెట్టునే శివలింగంగా ప్రతిష్టించిన ధర్మరాజు! ఈ ఆలయం ఎక్కడ ఉంది..? ప్రత్యేకత ఏంటో తెలుసా?
  ఏయూలో సినిమా షూటింగ్

  ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ లో ఎక్కువగా తెలుగు సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. ఆ యూనివర్శిటీ విద్యార్థులకు మాత్రమే దక్కిన అవకాశం.. తమ అభిమాన సినీ నటులను తరచూ చూస్తుండటం. పాతకాలపు వాతావరణం ఈ ప్రదేశానికి మరింత అందాన్ని చేకూరుస్తుంది. కాలేజీకి సంబంధించిన సన్నివేశాలు, ఫ్లాష్ బ్యాక్ లు, ఫైట్లు , లవ్ ప్రపోజల్స్..  ఇలాంటి సీన్స్ అన్ని దాదాపు ఈ యూనివర్సిటీలో చిత్రీకరిస్తూ ఉంటారు.

  ఇదీ చదవండి : జగన్ మరో రికార్డు.. దేశంలో మరోసారి నెంబర్ వన్ సీఎంగా గుర్తింపు.. ఎందులోనో తెలుసా..?

  సౌత్ ఇండియన్ సినిమాలకు ఏయూ అడ్డా                                                      యూనివర్శిటీలో షూటింగ్ చేసిన వాటిలో ఎక్కువగా హిట్ అవ్వడంతో.. ఆ సెంట్ మెంట్ కూడా కలిసి వస్తుందని దర్శనకులు నమ్ముతారు. నాని హీరోగా తెరకెక్కిన చిత్రం నిన్నుకోరి. ఈ సినిమాలో కాలేజీ సీన్ల న్నీ ఏయూ క్యాంపస్ లోనే తీశారు.   ఉన్నది ఒకటే జిందగీ సినిమా కూడా ఇక్కడే రూపొందించారు.  జాను మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో కాలేజీ సీన్స్ ఈ యూనివర్సిటీలోనే జరిగాయి. తాజాగా వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఉప్పెన కూడా ఇక్కడే షూటింగ్ జరిగింది.  ఇవేకాదు ఇంకా ఎన్నో  నువ్వు నేను ప్రేమ, ఎందుకంటే ప్రేమంట, కేరాఫ్ కంచరపాలెం, క్షణం, మహాసముద్రం ఇలా ఎన్నో టాలివుడ్టా సినిమాలకు ఇదే అడ్డాగా నిలిచింది. తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం ఇకపై సినిమాలకు రాయితీలు ఇవ్వాలి అంటే.. 21 శాతం సినిమా షూటింగ్ ఏపీలోనే జరగాలని కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో మరిన్నిషూటింగ్స్ పెరిగే అవకాశం ఉంది..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Andhra university, AP News, Tollywood, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు